Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలర్ట్, ఆ రూట్లలో వెళ్లే రైళ్లు రద్దు!
Trains Cancelled: నాన్ ఇంటర్ లాకింగ్ పనుల వల్ల రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు రైళ్ల వివరాలతో కూడిన ప్రకటన విడుదల చేసింది.
Trains Cancelled: రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. ఏ మేరకు ప్రకటన జారీ చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ సెక్షన్ పరిధి లోని పడుగు పాడు - వేదయ పాలెం మధ్య నాన్ - ఇంటర్ లింకింగ్ పనులు సాగుతున్నాయి. ఈ కారణంగా ఆ రూట్లో రైళ్లు వెళ్లడం కష్టంగా మారింది. అందుకే ఈ రూట్ లో పలు ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
పలు రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ..
విజయవాడ సెక్షన్ పరిధిలోని పడుగుపాడు - వేదయపాలెం మధ్య నాన్ - ఇంటర్ లింకింగ్ పనుల వల్ల ఆ రూట్ లో వెళ్లే పూణే - కాజీపేట మధ్య నడిచే వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (22151) రైలు ను సెప్టెంబర్ 23వ తేదీన, 30వ తేదీన, అక్టోబర్ 9వ తేదీల్లో రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాజీపేట - పూణే మధ్య నడిచే వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (22152) రైలును సెప్టెంబరు 25వ తేదీన, అక్టోబర్ 2వ తేదీన, అలాగే అక్టోబర్ 11వ తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన జారీ చేసింది. సూళ్లూరు పేట - నెల్లూరు మధ్య నడిచే ప్యాసింజర్ (06745) రైలును సెప్టెంబరు 18వ తేదీ నుండి 29వ తేదీ వరకు, వేదాయ పాలెం - నెల్లూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. నెల్లూరు - సూళ్లూరు పేట మధ్య నడిచే ప్యాసింజర్ (06746) రైలును సెప్టెంబర్ 18 వ తేదీ నుండి 29వ తేదీ వరకు నెల్లూరు - వేదాయ పాలెం మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన జారీ చేశారు. అలాగే సూళ్లూరు పేట - నెల్లూరు - సూళ్లూరు పేట మధ్య నడిచే ప్యాసింజర్ రైలు 06747, 06748 నంబరు రైళ్లను కూడా వేదాయ పాలెం - నెల్లూరు - వేదాయ పాలెం మధ్య రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.
ఎంఎంటీఎస్ రైళ్లూ రద్దు..
హైదరాబాద్ లోనూ లోకల్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలోని పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు అయ్యాయి. సెప్టెంబర్ 18 వ తేదీ ఆదివారం 34 ఎంఎంటీఎస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. లింగం పల్లి - హైదరాబాద్ రూట్ లో 9 సర్వీసులు రద్దు కాగా.. హైదరాబాద్ - లింగంపల్లి రూట్ లోనూ 9 సర్వీసులు రద్దు అయినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇక ఫలక్ నుమా - లింగంపల్లి రూట్ లో ఏడు సర్వీసులు రద్దు అయ్యాయి. లింగంపల్లి - ఫలక్ నుమా రూట్ లో 7 సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. లింగంపల్లి - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - లింగంపల్లి రూట్ లో ఒక్కో సర్వీసు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.