Karnataka CM Race: కర్ణాటక సీఎం రేసులో ఖర్గే పేరు, తెరపైకి కొత్త డిమాండ్
Karnataka CM Race: మల్లికార్జున్ ఖర్గేని కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రకటించాలని కొందరు కార్యకర్తలు డిమాండ్ చేశారు.
Karnataka CM Race:
కార్యకర్తల కొత్త డిమాండ్..
కర్ణాటక సీఎం రేసులో ఇప్పటి వరకూ డీకే శివకుమార్, సిద్దరామయ్య పేర్లు మాత్రమే వినిపించాయి. కానీ...ఇప్పుడు కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆయనే మల్లికార్జున్ ఖర్గే. అవును. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని (Mallikarjun Kharge) కూడా ఈ రేసులోకి లాగారు కొందరు కార్యకర్తలు. బెంగళూరులోని పార్టీ ఆఫీస్ బయట కొందరు ఖర్గేకి మద్దతుగా నినాదాలు చేశారు. మల్లికార్జున్ ఖర్గేనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. "ఇప్పటి వరకూ కర్ణాటకలో ఓ దళితుడు ముఖ్యమంత్రి అవ్వలేదు. అందుకే ఖర్గేకు ఆ అవకాశమివ్వాలి" అంటూ తమ వాదనలు వినిపించారు. ఓ వైపు ఖర్గే, రాహుల్‌తో డీకే శివకుమార్, సిద్దరామయ్య వరుస భేటీలతో బిజీబిజీగా ఉండగా...వీళ్లు కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటికే...సీఎం ఎవరన్నది ఓ క్లారిటీ వచ్చినట్టే ఉంది. సిద్దరామయ్యకే హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. డీకే శివకుమార్‌కి డిప్యుటీ సీఎంతో పాటు మరి కొన్ని కీలక శాఖలు కట్టబెట్టే అవకాశాలున్నాయి. అయితే...ఇవన్నీ ఊహాగానాలేనా..? లేదా నిజంగానే హైకమాండ్ నిర్ణయం తీసుకుందా అన్నది అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకూ ఏమీ చెప్పలేం. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం..డీకే శివ కుమార్‌తో సోనియా గాంధీ భేటీ అయినట్టు తెలుస్తోంది. సీఎం పదవిని ఇవ్వకపోవడానికి కారణాలేంటో ఆమె వివరించారట. అంతే కాదు. ఆయనను కన్విన్స్ చేయడంతో పాటు పార్టీ కోసం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందని భరోసా ఇచ్చినట్టూ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
VIDEO | “As SC community has a larger population in the state, we want Mallikarjun Kharge to become the CM,” say protesting workers outside Karnataka PCC office in Bengaluru. pic.twitter.com/uLDSHKVpWg
— Press Trust of India (@PTI_News) May 17, 2023
వీడని సస్పెన్స్
కర్ణాటక సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. డీకే శివకుమార్, సిద్దరామయ్యల్లో ఎవరికి వారు ఆ కుర్చీ కోసం ఆరాటపడుతున్నారు. హైకమాండ్ వరుస భేటీలతో ఈ సమస్యను తేల్చే పనిలో పడింది. ఈక్రమంలోనే...డీకే శివకుమార్ ఖర్గేతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో... శివకుమార్ సిద్దరామయ్యకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు సమాచారం. అంతే కాదు. సిద్దరామయ్యపై ఓ పెద్ద రిపోర్ట్ తయారు చేసి మరీ ఇచ్చినట్టు తెలుస్తోంది. 135 మంది ఎమ్మెల్యేలను తానే గెలిపించినట్టు ఇప్పటికే స్పష్టం చేశారు శివకుమార్. అందుకే...తనకే ముఖ్యమంత్రి పదవి దక్కాలని పట్టుపడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో సిద్దరామయ్య చేసిన తప్పులే కాంగ్రెస్ పతనానికి కారణమయ్యాయని ఆరోపించినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయన వల్లే 2019 ఎన్నికల్లోనూ అనుకూల ఫలితాలు రాలేదని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. 2020లో ప్రభుత్వం కూలిపోవడానికీ కారణం సిద్దరామయ్యే అని శివకుమార్ ఆరోపించినట్టు తెలుస్తోంది. అయితే...హైకమాండ్ మాత్రం సిద్దరామయ్యే వైపే మొగ్గుతున్నట్టు సమాచారం.
Also Read: Karnataka CM Race: సీఎం రేసులో డీకే శివకుమార్ ఎందుకు వెనకబడ్డారు? అదొక్కటే మైనస్ అయిందా?