Madives: మాల్దీవ్స్‌లో సంచలనం, అధ్యక్షుడు ముయిజూపై చేతబడి చేసిన మంత్రి అరెస్ట్
Maldives President: మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజూపై ఓ మంత్రి చేతబడి చేసిన ఘటన అలజడి సృష్టించింది. మంత్రితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Maldives Minister Suspended: మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజూపై ఓ మంత్రి చేతబడి చేసిన ఘటన ఆ దేశాన్ని కుదిపేసింది. ఈ గుట్టు బయటపడిన వెంటనే ఆ మంత్రిని సస్పెండ్ చేశారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం...మాల్దీవ్స్ పర్యావరణ మంత్రి ఫతిమత్ షమ్‌నాజ్ అలీ సలీమ్ (Fathimath Shamnaz Ali Saleem) ముయిజూపై చేతబడి చేయించినట్టు తేలింది. మంత్రితో పాటు మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల కస్టడీకి తరలించారు. మాల్దీవ్స్‌లోని Sun న్యూస్ ఈ విషయం వెల్లడించింది. ఆ పదవి నుంచి తక్షణమే ఆమెని తొలగించినట్టు స్పష్టం చేసింది. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించిన ఆమె ఇలాంటి కేసులో అరెస్ట్ అవడం సంచలనమవుతోంది. మాల్దీవ్స్‌లో Black Magic అనేది పెద్ద నేరం కాకపోయినా ఇస్లాం చట్టం ప్రకారం ఆర్నెల్ల జైలు శిక్ష విధిస్తారు. అయితే...ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ముయిజూ మేల్ సిటీకి మేయర్‌గా పని చేసినప్పుడు షమ్‌నాజ్ మేల్ సిటీ కౌన్సిల్‌లో సభ్యురాలిగా పని చేశారు.
గతేడాది మాల్దీవ్స్‌లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ముయిజూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తరవాత వెంటనే షమ్‌నాజ్ కౌన్సిల్‌కి రాజీనామా చేశారు. పర్యావరణ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె వాతావరణ మార్పులపై దృష్టి పెట్టారు. సముద్ర మట్టం పెరిగితే ద్వీపానికి ఎంతో ప్రమాదమని గతంలోనే ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. గతంలోనూ మాల్దీవ్స్‌లో చేతబడి కేసులు నమోదయ్యాయి. చేతబడి చేస్తోందన్న అనుమానంతో గతేడాది ఓ 62 ఏళ్ల వృద్ధురాలిని కొంత మంది దుండగలు కత్తితో పొడిచి హత్య చేశారు. పోలీసుల విచారణలో ఆమె అలాంటిదేమీ చేయలేదని తేలింది. అంతకు ముందు 2012లో ఓ పొలిటికల్ ర్యాలీ జరుగుతుండగా కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు మంత్రించిన కోళ్లను విసిరారని అప్పట్లో పోలీసులు చెప్పడం సంచలనమైంది.
Also Read: Hemant Soren: ఝార్ఘండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కి ఊరట, ల్యాండ్ స్కామ్ కేసులో బెయిల్