TMC MP Mahua Moitra Bag Price: ఆ బ్యాగ్‌ను MP ఎందుకు దాచేశారు? దాని ధర తెలిస్తే అవాక్కవుతారు!
TMC MP Mahua Moitra Bag Price: టీఎమ్‌సీ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటులో తన బ్యాగ్ దాచిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

TMC MP Mahua Moitra Bag Price: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతోంది. పార్లమెంటులో ఫైర్ బ్రాండ్ స్పీచ్‌లతో మహువా అందర్నీ ఆకర్షించారు. అయితే పార్లమెంట్‌లో సోమవారం.. మహువా తన హ్యాండ్ బ్యాగ్‌ను దాచి పెడుతోన్న ఓ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది. దీంతో ఆమె అలా ఎందుకు చేశారు అంటూ? చర్చ మొదలైంది.
People are blaming " Mahua Moitra " For " Louis Vuitton " ₹160000 bag but actually, She didn't know todays topic is Price rise. Don't worry she will take care from next time.#LouisVuitton #MahuaMoitra pic.twitter.com/ulGnL368W2
— Parikshit Pawar (@parikshitpawar0) August 1, 2022
ఇలా జరిగింది
లోక్‌సభలో ధరల పెరుగుదలపై చర్చ జరుగుతోన్న సమయంలో ఈ ఘటన జరిగింది. టీఎంసీ ఎంపీ దస్తీదార్ ధరల పెరుగుదల గురించి మాట్లాడారు. ఆ సమయంలో ఎంపీ దస్తీదార్ పక్కనే మహువా మొయిత్రా కూర్చుకున్నారు. దస్తీదార్ మాట్లాడుతోన్న సమయంలో తన హ్యాండ్ బ్యాగ్‌ను ఎంపీ మహువా తీసి టేబుల్ కింద పెట్టారు. ఇంతకీ ఆ బ్యాగ్‌ను ఎంపీ మహువా ఎందుకు కింద పెట్టిందో ఎవరికీ అర్థం కాలేదు.
ధర గురించి
Rich doesn’t need to become poor n talk about sufferings of poor. #MahuaMoitra is decent wealthy women, she has all rights to spend her earning to buy a globally recognised brand #LouisVuitton. She has courage to maintain her standard of living inside house as she does it outside pic.twitter.com/vp1R1X7aY5
— Striving for Secularism (@SecularTOI) August 2, 2022
అయితే ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆమె బ్యాగ్ ఎందుకు కింద పెట్టిందో వెతికే పనిలో పడ్డారు. ఆమె బల్ల కింద పెట్టిన లగ్దరీ బ్యాగ్ ధర సుమారు రూ.2 లక్షలట. ఆ బ్యాగ్ లూయిస్ విట్టాన్ బ్రాండ్‌కు చెందినది. ధరల పెరుగుదల గురించి చర్చిస్తున్న సమయంలో ఇలాంటి ఖరీదైన బ్యాగ్‌లతో పార్లమెంట్‌కు వస్తారా? అని ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని ఆమె వెంటనే ఆ బ్యాగ్ దాచినట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఎంపీ కౌంటర్
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోకు ఎంపీ మహువా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. 2019 నుంచి తాను ఇదే బ్యాగ్‌ను పార్లమెంటుకు తీసుకువెళ్లి, తిరిగి తీసుకువస్తున్నానని ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి పలు సందర్భాల్లో తీసిన ఫొటోలను ఆమె షేర్ చేశారు.
Jholewala fakir in Parliament since 2019.
— Mahua Moitra (@MahuaMoitra) August 2, 2022
Jhola leke aye the… jhola leke chal padenge… pic.twitter.com/2YOWst8j98
Also Read: Kerala MP Ramya Haridas: ఓ మంచి అబ్బాయిని చూడండి- పెళ్లి చేసుకుంటా: పాటలు పాడుతూ MP రిక్వెస్ట్
Also Read: National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో ED స్పీడు- దిల్లీలో 10 ప్రాంతాల్లో సోదాలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

