అన్వేషించండి

Mahindra Car Discounts: మహీంద్రా కార్లపై భారీ ఆఫర్లు: ఈ మే నెలలో ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసా..!

మహీంద్రా తన పాపులర్ ఎస్‌యూవీలైన ఎక్స్‌యూవీ400, థార్ రాక్స్ , స్కార్పియో మోడల్స్‌పై మే 2026 నెలలో భారీ క్యాష్ డిస్కౌంట్లు ఇంకా బెనిఫిట్స్ ప్రకటించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మహీంద్రా XUV400 EV పై రూ. 2.5 లక్షల వరకు క్యాష్ బెనిఫిట్స్.
  • థార్ రాక్స్ పై రూ. 85,000 క్యాష్, రూ. 25,000 యాక్సెసరీస్ ఆఫర్.
  • స్కార్పియో N, క్లాసిక్ పై వరుసగా రూ. 30,000, రూ. 50,000 డిస్కౌంట్లు.
  • బోలెరో నియోపై రూ. 25,000 నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు.

Mahindra Car Discounts and Offers on SUVs for May: ఇండియన్ ఎస్‌యూవీ మార్కెట్లో మహీంద్రా కంపెనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల లిస్టులో మహీంద్రా మోడల్స్ ఎప్పుడూ టాప్‌లో ఉంటాయి. భారీ డిమాండ్ కారణంగా కొన్ని కార్లకు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, సేల్స్ మరింత పెంచేందుకు ఈ మే నెలలో కంపెనీ అదిరిపోయే ఆఫర్లను అనౌన్స్ చేసింది. డీలర్ల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ఆఫర్లు నగరాన్ని బట్టి లేదా స్టాక్ లభ్యతను బట్టి మారే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు..

మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహనాలపై ఈ నెలలో అత్యధిక డిస్కౌంట్లు ఇస్తోంది. ముఖ్యంగా ఎక్స్‌యూవీ400 ఈవీ మోడల్‌పై ఏకంగా రూ. 2.5 లక్షల వరకు క్యాష్ బెనిఫిట్స్ అందుకోవచ్చు. ఇందులో ఈసీ ప్రో (EC Pro) ఇంకా ఈఎల్ ప్రో (EL Pro) వేరియంట్లు ఉన్నాయి. మహీంద్రా నుంచి వస్తున్న సరికొత్త ఐఎన్‌జీఎల్ఓ (INGLO) ప్లాట్‌ఫామ్ ఆధారిత బీఈ 6 (BE 6), ఎక్స్‌ఈవీ 9ఈ (XEV 9e) మోడల్స్ నుండి గట్టి పోటీ ఉండటంతో ఎక్స్‌యూవీ400 పై భారీ ఆఫర్లు ప్రకటించారు. అలాగే పాత 2025 మోడల్ స్టాక్ క్లియర్ చేసేందుకు బీఈ 6 పై రూ. 2 లక్షలు, ఎక్స్‌ఈవీ 9ఈ పై రూ. 1.4 లక్షల వరకు డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఇవి పరిమిత స్టాక్ మీద మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Also Read: Tata Altroz CNG AMT వెర్షన్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు , ధ‌ర చూసి డిసైడ్ అవ్వండి

థార్ రాక్స్ ,స్కార్పియోపై ఆఫర్లు

ఈ నెలలో బెస్ట్ కాంబినేషన్ ఆఫర్ పొందుతున్న కారు థార్ రాక్స్. దీనిపై మొత్తంగా రూ. 1.10 లక్షల వరకు లాభం పొందవచ్చు. ఇందులో రూ. 85,000 క్యాష్ డిస్కౌంట్ తో పాటు రూ. 25,000 విలువైన యాక్సెసరీస్ ఫ్రీగా ఇస్తున్నారు. లైఫ్ స్టైల్ ఎస్‌యూవీ కేటగిరీలో ఈ కారుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ ఆఫర్ చాలా మందిని ఆకర్షిస్తోంది. అలాగే ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (XUV 3XO) పై రూ. 60,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. దీనిలో రూ. 40,000 నగదు తగ్గింపు కాగా, మిగిలిన రూ. 20,000 యాక్సెసరీస్ రూపంలో లభిస్తుంది. పాపులర్ మోడల్ స్కార్పియో ఎన్ (Scorpio N) లోని జెడ్4 వేరియంట్ పై రూ. 30,000, జెడ్8 వేరియంట్ పై రూ. 20,000 డిస్కౌంట్ ప్రకటించారు. స్కార్పియో క్లాసిక్ కొనే వారికి రూ. 50,000 వరకు లాభం చేకూరుతుంది.

Also Read: ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది

బోలెరో నియోపై..

మహీంద్రా క్లాసిక్ మోడల్ బోలెరో నియోపై రూ. 25,000 నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఇస్తున్నారు. అయితే కొన్ని కార్లపై మాత్రం ఈ నెలలో ఎలాంటి డిస్కౌంట్లు లేవు. స్టాండర్డ్ బోలెరో, ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ (XUV 7XO) ఇంకా త్రీ-డోర్ థార్ మోడల్స్ పై కంపెనీ ఎటువంటి ఆఫర్లు ఇవ్వడం లేదు. కొత్తగా కారు కొనాలి అనుకునే వారికి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూడాలి అనుకునే వారికి ఈ మే నెల మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. డీలర్ డిస్క్రిషన్ ఇంకా లోకల్ అవైలబిలిటీని బట్టి ఈ ఆఫర్లలో చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. కాబట్టి కారు బుక్ చేసుకునే ముందు దగ్గర్లోని షోరూమ్‌లో వివరాలు చెక్ చేసుకోవడం ఉత్తమం. ఈ సమ్మర్ సీజన్‌లో సేల్స్ పెంచేందుకు మహీంద్రా వేసిన ఈ ప్లాన్ కస్టమర్లకు మంచి లాభాన్ని ఇస్తుంది.

మరిన్ని ఆటోమొబైల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 

Frequently Asked Questions

ఈ మే నెలలో మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లపై ఎలాంటి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి?

XUV400 EV మోడల్ పై రూ. 2.5 లక్షల వరకు క్యాష్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే BE 6 పై రూ. 2 లక్షలు, XEV 9e పై రూ. 1.4 లక్షల వరకు డిస్కౌంట్లు లభిస్తాయి.

థార్ రాక్స్ మరియు స్కార్పియో మోడల్స్ పై ఏ ఆఫర్లు ఉన్నాయి?

థార్ రాక్స్ పై రూ. 1.10 లక్షల వరకు మొత్తం లాభం (రూ. 85,000 క్యాష్ డిస్కౌంట్ + రూ. 25,000 యాక్సెసరీస్) లభిస్తుంది. స్కార్పియో క్లాసిక్ పై రూ. 50,000 వరకు లాభం చేకూరుతుంది.

బోలెరో నియోపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి?

బోలెరో నియోపై రూ. 25,000 నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఏ మహీంద్రా మోడల్స్ పై ఈ నెలలో డిస్కౌంట్లు లేవు?

స్టాండర్డ్ బోలెరో, XUV 7XO, మరియు త్రీ-డోర్ థార్ మోడల్స్ పై కంపెనీ ఎటువంటి ఆఫర్లు ఇవ్వడం లేదు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Kaleshwaram Project: కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ నేత రామచందర్‌రావు లేఖ
కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్, NDSA నివేదిక పట్టించుకోలేదు: CM రేవంత్‌‌కు రామచందర్‌రావు లేఖ
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
Embed widget