అన్వేషించండి

PM Modi Convoy Size: ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది

PM Modi Reduces His Convoy | ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రధాని మోదీ తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను చాలా తగ్గించి దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. దీని వల్ల ఎంత పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుంది.

న్యూఢిల్లీ: చమురు వినియోగం సాధ్యమైనంత తగ్గించాలని, వర్క్ ఫ్రం హోం బెటర్ ఆప్షన్ అని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధనాన్ని పొదుపు చేసే ప్రయత్నంలో భాగంగా, ప్రధాని ఇప్పుడు స్వయంగా దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. నివేదికల ప్రకారం, ప్రధాని మోదీ తన అధికారిక కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యం కేవలం ఇంధనాన్ని ఆదా చేయడం మాత్రమే కాదు, ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించడం. ఈ చర్య ద్వారా మోదీ కాన్వాయ్‌లో ఎంత పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుందో వివరాలు ఇక్కడ అందించే ప్రయత్నం చేస్తున్నాం.

గతంలో ఎన్ని వాహనాలు వాడేవారు.. 
ప్రధాని కాన్వాయ్‌లో సాధారణంగా అనేక భద్రతా, సహాయక వాహనాలు ఉంటాయి. వీటిలో SUVలు, భద్రతా ఎస్కార్ట్ వాహనాలు, అంబులెన్సులు, టెక్నాలజీ సంబంధిత సహాయక వాహనాలు ఉంటాయి. మీడియా నివేదికల ప్రకారం, గతంలో ప్రధాని మోదీ వాహన శ్రేణిలో సుమారు 18 నుండి 20 వాహనాలు ఉండేవి. ఇప్పుడు ఈ సంఖ్యను సుమారు 9 నుంచి 10 వాహనాలకు తగ్గించారు. అయితే, భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకున్నారు. 

ఎంత ఇంధనం వినియోగించేవారు..
ప్రధానమంత్రి వాహన శ్రేణిలో ఉపయోగించే వాహనాల్లో ఎక్కువ భాగం పెద్ద SUVలే ఉంటాయి. ఇవి లీటరుకు సగటున 6 నుండి 8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. ఒక అధికారిక పర్యటనలో పీఎం కాన్వాయ్ 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే, గతంలో ఇంధన వినియోగం సుమారు 250 నుండి 300 లీటర్ల వరకు ఉండేది. వాహనాల సంఖ్య సగానికి తగ్గడంతో, ఇప్పుడు ఈ వినియోగం దాదాపు సగానికి తగ్గుతుంది. ప్రతి అధికారిక పర్యటనలో 100 నుండి 150 లీటర్ల ఇంధనాన్ని ఆదా చేయవచ్చు అని అంచనా వేశారు. ఏడాదిపాటు జరిగే మొత్తం అధికారిక పర్యటనలను పరిగణనలోకి తీసుకుంటే, తాజా నిర్ణయం ద్వారా వేల లీటర్ల పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుంది. 

ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సాధ్యమైన చోట తమ కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) చేర్చాలని ప్రధాని మోదీ అధికారులకు సూచించారు. ఈ చర్య పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని మరింత తగ్గించడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. 

ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
ఇంధన వినియోగం తగ్గించాలని, సాధ్యమైనంత పొదుపు చేయాలని ప్రధాని మోదీ గతంలోనే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మెట్రో, రైల్వేలు, కార్‌పూలింగ్ సేవలను, ఆర్టీసీని వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలు కలిగిన వారు వాటిని మరింతగా ఉపయోగించాలని ప్రోత్సహించారు.  వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా  ప్రస్తావించారు. దేశంలోని ప్రతి పౌరుడూ చేసే చిన్న ప్రయత్నం ఎంతో మార్పు తీసుకొస్తుందన్నారు. దానివల్ల భారత ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం సాధ్యమేనని ప్రధాని మోదీ విశ్వసిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget