News
News
X

Y+ Security to Shiv Sena MLAs: శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు ఫుల్ సెక్యూరిటీ, భాజపానే చక్రం తిప్పుతోందా?

శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్రం వై ప్లస్ సెక్యూరిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏఎన్‌ఐ వార్తా సంస్థ ఈ విషయం వెల్లడించింది.

FOLLOW US: 

రెబల్ ఎమ్మెల్యేలకు భద్రత పెంపు..? 

మహారాష్ట్రలో శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేంద్రం వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికేరాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి భాజపాయే కారణమని శివసేన, కాంగ్రెస్ మండి పడుతున్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ వార్తలు రావటం భాజపాపై అనుమానాలు పెంచింది. షిండే శిబిరంలోని 15 మంది ఎమ్మెల్యేలకు వై ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారని తెలుస్తోంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌-CRPF బలగాలు వీరికి భద్రత ఇవ్వనున్నాయి. ఆదిత్య థాక్రేతో సహా సంజయ్ రౌత్ ఇటీవలే షిండేకి ఓ సవాల్ విసిరారు. దమ్ముంటే ముంబయికి వచ్చి నేరుగా తలపడాలంటూ ఛాలెంజ్ చేశారు. ఈ తరుణంలోనే కేంద్రం పలువురు ఎమ్మెల్యేలకు భద్రత పెంచటం చర్చనీయాంశమైంది. జాతీయ వార్తా సంస్థ ఏఎన్‌ఐ ఈ మేరకు ట్విటర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇదంతా భాజపా కుట్రే: శివసేన ఆరోపణ 

శివసేన లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏక్‌నాథ్ షిండేని తొలగించాలన్న డిప్యుటీ స్పీకర్ నిర్ణయాన్ని న్యాయపరంగా సవాలు చేసేందుకు షిండే సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందుకోసం ఆయన న్యాయసలహాలు తీసుకుంటున్నారట. పార్టీని వీడిన కారణాలపై వివరణ కోరటం సహజమే అయినా, వివరణ ఇచ్చేందుకు కనీసం వారం రోజులైనా గడువు ఇవ్వాల్సిందని షిండే మద్దతుదారులు అంటున్నారు. నిజానికి ఈ అనిశ్చితికి భాజపానే కారణమన్న వాదనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అసోం ముఖ్యమంత్రి బిశ్వంత్ శర్మ, గువాహటిలో రెబల్ ఎమ్మెల్యేలు నివసిస్తున్న హోటల్‌కు వెళ్లటం వల్ల ఈ వాదనలకు బలం చేకూరింది. 

Also Read: Kollapur Updates: వచ్చే ధైర్యం లేకే అరెస్టు నాటకం - జూపల్లి ధ్వజం, తిప్పికొట్టిన ఎమ్మెల్యే హర్షవర్థన్

Also Read: Prabhas: ప్రభాస్ పార్టీలో అమితాబ్, దుల్కర్ - వైరల్ అవుతోన్న వీడియో 

Published at : 26 Jun 2022 03:13 PM (IST) Tags: maharashtra Eknath Shinde Maharashtra Crisis Y plus Security

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: విజయనగరం జిల్లాలో మద్యం వ్యాను బోల్తా, పోటెత్తిన మందుబాబులు

Breaking News Live Telugu Updates: విజయనగరం జిల్లాలో మద్యం వ్యాను బోల్తా, పోటెత్తిన మందుబాబులు

Maharashtra Cabinet Expansion: ఎట్టకేలకు 'మహా' కేబినెట్ విస్తరణ- 18 మందికి చోటు, మహిళలకు నో ఛాన్స్!

Maharashtra Cabinet Expansion: ఎట్టకేలకు 'మహా' కేబినెట్ విస్తరణ- 18 మందికి చోటు, మహిళలకు నో ఛాన్స్!

APSRTC Bus Theft: ఆర్టీసీ బస్సునే కొట్టేసిన దుండగుడు, కంగారుపడ్డ డ్రైవర్ - ఇంతలో ఊహించని ట్విస్ట్!

APSRTC Bus Theft: ఆర్టీసీ బస్సునే కొట్టేసిన దుండగుడు, కంగారుపడ్డ డ్రైవర్ - ఇంతలో ఊహించని ట్విస్ట్!

Bihar Political Crisis: బిహార్ రాజకీయంలో మరో ట్విస్ట్- గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన నితీశ్!

Bihar Political Crisis: బిహార్ రాజకీయంలో మరో ట్విస్ట్- గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన నితీశ్!

ABP Desam Anniversary: ఏబీపీ దేశం తొలి వార్షికోత్సవం- మొదటి అడుగుతోనే మరింత ముందుకు

ABP Desam Anniversary: ఏబీపీ దేశం తొలి వార్షికోత్సవం- మొదటి అడుగుతోనే మరింత ముందుకు

టాప్ స్టోరీస్

Dangerous Job: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం

Dangerous Job: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం

Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!

Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!

Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే

Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే

Actress Pragathi : ఏ వయస్సులో చేయాల్సినవి ఆ వయస్సులో చేయాలి - ప్రగతిపై పంచ్

Actress Pragathi : ఏ వయస్సులో చేయాల్సినవి ఆ వయస్సులో చేయాలి - ప్రగతిపై పంచ్