అన్వేషించండి

Maharashtra Political Crisis: షిండే వైపు ఎంత మంది స్థిరంగా ఉంటారో చూడాలి, డిప్యుటీ స్పీకర్ నరహరి జిర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రస్తుతం షిండే వైపు ఉన్న ఎమ్మెల్యేల్లో ఎంత మంది స్థిరంగా ఉంటారో స్పష్టత లేదని డిప్యుటీ స్పీకర్ నరహరి జిర్వాల్ అన్నారు. తనకు సమర్పించిన లేఖలోనూ సంతకాల్లో ఏదో మతలబు ఉందని చెప్పారు.

సంతకాల్లో ఏదో మతలబు ఉంది: డిప్యుటీ స్పీకర్ నరహరి జిర్వాల్

శివసేన రెబల్ లీడర్‌ వైపు ఎంత మంది ఎమ్మెల్యేలు స్థిరంగా ఉంటారో చూడాల్సి ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర డిప్యుటీస్పీకర్ నరహరి జిర్వాల్. షిండే తనకు ఓ లేఖ పంపారని, అందులో 34 మంది ఎమ్మెల్యేల సంతకాలున్నాయని చెప్పారు. అయితే ఈ 34 మంది సంతకాలను మరోసారి వెరిఫై చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు జిర్వాల్. ఇందుకు కారణాన్నీ వివరిస్తున్నారు. ఈ తీర్మానంపై ఎమ్మెల్యేలందరూ ఇంగ్లీష్‌లోనే సంతకం చేసినట్టు షిండే చెప్పారట. అయితే ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ సంతకం మాత్రం మరాఠీలో ఉందని చెబుతున్నారు జిర్వాల్. అంటే ఎక్కడో ఏదో మతలబు ఉందని, అదేంటో తేలాలని అంటున్నారు. మిగతా అందరి ఎమ్మెల్యేల సంతకాలనూ మరోసారి చెక్ చేస్తానని స్పష్టం చేశారు. 

చీఫ్ విప్ నియామకం చట్ట ప్రకారమే..

చీఫ్ విప్ నియామకంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నరహరి జిర్వాల్. షిండే కూటమికి ఎవరు అధ్యక్షత వహిస్తారన్నది స్పష్టత లేదని, ఆ విషయం తేలకుండా విప్ నియామకం ఎలా చేస్తామని అన్నారు. ఈ విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. 
చీఫ్ విప్‌ నియమించే సమయంలో ఎమ్మెల్యేలందరూ హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చట్ట ప్రకారం తన పార్టీకి కొత్త చీఫ్ విప్‌ని నియమించాలంటూ ఉద్ధవ్ థాక్రే తనను కోరారని, ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నాని స్పష్టంచేశారు జిర్వాల్. షిండేకు మద్దతు తెలపాలంటూ కొందరు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలపైనా జిర్వాల్ స్పందించారు."వారిపై ఒత్తిడి తీసుకొచ్చి గువాహటిలోని హోటల్‌లో నిర్బంధించారనటంపై ఎలాంటి ఆధారాల్లేవు. అయితే స్థానిక పోలీస్ స్టేషన్లలో పలు ఫిర్యాదుల నమోదయ్యాయి. దర్యాప్తు చేపడితే కానీ అందులో నిజానిజాలేంటో బయటపడవు. ప్రస్తుతానికి ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయదలుచుకోలేదు" అని వెల్లడించారు డిప్యుటీ స్పీకర్ నరహరి జిర్వాల్. 

ప్రస్తుతం శివసేన ఎమ్మెల్యేలందరూ కలిసి ఏక్‌నాథ్‌ షిండేకి మద్దతు తెలిపే వారిపై ఫిరాయింపుల వ్యతిరేక చట్టం అమలు చేయాలని డిప్యుటీస్పీకర్‌కు లేఖ రాయొచ్చు. అయితే ఇప్పటికే మూడింట రెండొంతుల మెజార్టీ షిండేకి దక్కటం వల్ల అది సాధ్యపడదు. ఒకవేళ లెటర్ రాసినప్పటికీ ఆధారాలతో సహా ఈ లెటర్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తరవాత డిప్యుటీ స్పీకర్ ఈ లేఖను ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు అందిస్తారు. వివరణ ఇచ్చేందుకు వారం రోజుల గడువు ఇస్తారు. ఫిరాయింపుల వ్యతిరేక చట్టంలో గవర్నర్ కీలకపాత్ర పోషిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి గవర్నర్‌ వద్దకు వెళ్లి శాసనసభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కోరవచ్చు. అయితే మధ్యంతర ఎన్నికలు జరపాలా వద్దా అన్నది గవర్నర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Mohan Babu Vs Manoj Manchu: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Shruti Haasan: పెళ్లి గురించి నెటిజన్ ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతి హాసన్
పెళ్లి గురించి నెటిజన్ ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతి హాసన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP DesamPushpa 2 Breaking all Bollywood Records | హిందీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పుష్ప కలెక్షన్లు | ABP Desamఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Mohan Babu Vs Manoj Manchu: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Shruti Haasan: పెళ్లి గురించి నెటిజన్ ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతి హాసన్
పెళ్లి గురించి నెటిజన్ ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతి హాసన్
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Andhra Pradesh Pension Scheme: ఏపీలో పింఛన్‌ల ఏరివేత ప్రక్రియ ప్రారంభం- ఆరు దశల్లో వడపోత- గ్రామాల్లో అధికారుల సర్వే
ఏపీలో పింఛన్‌ల ఏరివేత ప్రక్రియ ప్రారంభం- ఆరు దశల్లో వడపోత- గ్రామాల్లో అధికారుల సర్వే
TDP Yanamala: తెలుగుదేశంలో యనమల లేఖ కలకలం - నేతల ఆగ్రహం - సీనియర్ నేతకు పార్టీపై కోపం ఎందుకు ?
తెలుగుదేశంలో యనమల లేఖ కలకలం - నేతల ఆగ్రహం - సీనియర్ నేతకు పార్టీపై కోపం ఎందుకు ?
Mahesh Babu: 'ముఫాస : ది లయన్ కింగ్'కి వాయిస్ ఓవర్... మహేష్ బాబు ఎందుకు చేశారో తెలుసా?
'ముఫాస : ది లయన్ కింగ్'కి వాయిస్ ఓవర్... మహేష్ బాబు ఎందుకు చేశారో తెలుసా?
Embed widget