అన్వేషించండి

మహారాష్ట్రలో కొలిక్కి వచ్చిన ప్రతిపక్షాల పొత్తు లెక్కలు, త్వరలోనే అధికారిక ప్రకటన!

Maharashtra Politics: మహారాష్ట్రలో ప్రతిపక్షాల సీట్‌ షేరింగ్‌ విషయంలో ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.

Maharashtra Opposition Seat Sharing: లోక్‌సభ ఎన్నికల ముందు ఒక్కో రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. NDAని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన I.N.D.I.A కూటమిలో భేదాభిప్రాయాలు వచ్చాయి. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు మిగతా పార్టీలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ...ఆ తరవాత మళ్లీ ఒక్కో పార్టీ దగ్గరవుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఆప్‌తో డీల్ కుదిరింది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఉద్దవ్ థాక్రే శివసేన పార్టీతో సీట్ల లెక్కలు కొలిక్కి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. శివసేన (UBT) 21 చోట్ల పోటీ చేయనుందని తెలుస్తోంది. అటు కాంగ్రెస్‌ 15 స్థానాల్లో, శరద్ పవార్ NCP 9 చోట్ల పోటీ చేసే అవకాశాలున్నాయి. Vanchit Bahujan Aaghadi (VBA) పార్టీ కూడా ఇటీవలే మహా వికాస్ అఘాడిలో (MVA) చేరింది. ఈ పార్టీ కూడా రెండు చోట్ల పోటీ చేసే అవకాశముంది. శరద్ పవార్ ఇంట్లో ఈ మేరకు కీలక భేటీ జరిగిందని సమాచారం. కాంగ్రెస్ నేతలు నానా పటోలే, పృథ్విరాజ్ చవాన్, వర్ష గైక్వాడ్ సహా మరి కొంత మంది కీలక వ్యక్తులు ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలుస్తోంది. అయితే...దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. కూటమిలోని సీనియర్ నేతలు ప్రకటించనున్నారు. 

దేశంలో అత్యధిక లోక్‌సభ నియోజకవర్గాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అక్కడ 80 స్థానాలున్నాయి. ఆ తరవాత అత్యధికంగా మహారాష్ట్రలో 48 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఇప్పటికే సంజయ్ రౌత్‌ ఈ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు కొనసాగుతున్నాయని, అంతా కలిసి అధికారికంగా ఓ ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలవాలన్నదే తమ లక్ష్యం అని, సీట్‌లు ఎన్ని వచ్చినా పరవాలేదని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నదే తమ ఎజెండా అని తేల్చి చెప్పారు. అటు కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టింది. మార్చి 4వ తేదీన ఢిల్లీ వేదికగా సమావేశం కానుంది. ఆ భేటీలోనే అభ్యర్థుల జాబితాని ఫైనలైజ్ చేయనుంది. 

 కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు లెక్కలు కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. విశ్వసీయ వర్గాల సమాచారం ప్రకారం...ఢిల్లీలో ఆప్‌ నాలుగు చోట్ల, కాంగ్రెస్ మూడు చోట్ల పోటీ చేస్తాయని ఇప్పటికే తెలిసింది. అయితే...దీనిపై అధికారిక ప్రకటన చేసేందుకు రెండు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ మైత్రిని కేవలం ఢిల్లీకే పరిమితం చేయకుండా మరికొన్ని రాష్ట్రాల్లోనూ కొనసాగించాలని చూస్తున్నాయి. ఆప్‌తో డీల్ కుదిరిందన్న వార్తలు వచ్చినప్పటి నుంచి మరి తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితేంటన్న ప్రశ్న తెరపైకి వస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని, ఆ పార్టీ తమతో కలిసి వస్తే ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. I.N.D.I.A కూటమిని బలోపేతం చేయాలనుకున్న వారిలో మమతా బెనర్జీ కూడా ఒకరని, పొత్తుల విషయంలో చర్చలకు సిద్ధంగానే ఉన్నాని వెల్లడించారు. 

Also Read: లోక్‌సభ ఎన్నికల ముందు కర్ణాటకలో కులగణన, కాంగ్రెస్‌పై లింగాయత్‌ల అసహనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget