అన్వేషించండి

లోక్‌సభ ఎన్నికల ముందు కర్ణాటకలో కులగణన, కాంగ్రెస్‌పై లింగాయత్‌ల అసహనం

Karnataka Caste Survey: కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ముందు కులగణన నిర్వహించడం సంచలనమవుతోంది.

Karnataka Caste Survey 2024: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలనానికి తెర తీసింది. Socio-Economic and Education Survey గా చెప్పుకునే కులగణనను పూర్తి చేసింది. ఆ రిపోర్ట్ ఇప్పటికే సిద్దరామయ్య వద్దకు వెళ్లింది. ఇప్పటికే దీనిపై రాజకీయాలు వేడెక్కాయి. ఈ నివేదికలోని వివరాలు ఇంకా బయటకు రాకపోయినప్పటికీ...అప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల ముందు ఇలా కుల గణన చేపట్టడం కీలకంగా మారింది. Karnataka State Commission for Backward Classes ఛైర్మన్ కే జయప్రకాశ్ హెగ్డే ఈ రిపోర్ట్‌ని తయారు చేసి ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అందజేశారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం...షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల జనాభా ఎక్కువగా ఉంది. ఆ తరవాత ముస్లింలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తరవాత లింగాయత్‌లు, వొక్కళిగల జనాభా ఎక్కువగా ఉంది. ఆ తరవాత కురుబల జనాభా కూడా ఎక్కువగానే ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించినట్టు సమాచారం. అటు దళితుల సంఖ్య కూడా భారీగానే ఉంది. త్వరలోనే కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ భేటీలోనే ఈ నివేదిరపై చర్చ జరుగుతుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇప్పటికే వెల్లడించారు. ఆ తరవాతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని వివరించారు. 

"ఈ రిపోర్ట్‌లో ఏముందో ఇంత వరకూ తెలియదు. రిపోర్ట్ మాత్రం ప్రభుత్వానికి అందింది. కేబినెట్ సమావేశంలో దీని గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. అక్కడ చర్చించిన తరవాతే ఆ నివేదిక ఆధారంగా ఏం చేయాలన్నది నిర్ణయించుకుంటాం"

- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి

లక్షా 60 వేల మంది అధికారుల నుంచి సమాచారం సేకరించి ఈ నివేదిక తయారు చేసినట్టు జయప్రకాశ్ హెగ్డే స్పష్టం చేశారు. వీళ్లతో పాటు 1.33 లక్షల ఉపాధ్యాయుల సహకారమూ తీసుకున్నట్టు వెల్లడించారు. అన్ని జిల్లాల డిప్యుటీ కమిషనర్ల నుంచి సమాచారం సేకరించినట్టు తెలిపారు. అయితే...ఈ సర్వే లింగాయత్‌లు, వక్కళిగలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అశాస్త్రీయమైన విధానంలో సర్వే చేశారని మండి పడుతున్నారు. కొత్తగా మరోసారి సర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రభుత్వం మాత్రం ఆ రిపోర్ట్‌లో ఏముందో ఇంకా తెలియదని, అనవసరంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెబుతోంది. 

మరో అలజడి..

రూ. కోటి కన్నా ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాల నుంచి ఏటా 10% ట్యాక్స్ వసూలు చేస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. హిందూవ్యతిరేక ప్రభుత్వం అంటూ బీజేపీ మండి పడింది. అయితే...ఈ విషయంలో చాలా పట్టుదలతో ప్రభుత్వం అసెంబ్లీలో ఈ బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదం తెలిపేలా చేసుకుంది. శాసనమండలిలో మాత్రం సిద్దరామయ్య సర్కార్‌కి షాక్ తగిలింది. మండలిలో ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించారు. అధికార కాంగ్రెస్ కన్నా శాసనమండలిలో బీజేపీకే ఎక్కువ మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌కి 30 మంది MLCలు ఉండగా..బీజేపీకి 35 మంది ఉన్నారు. జేడీఎస్ నుంచి 8 మంది ఎమ్‌ఎల్‌సీలు ఉన్నారు. బీజేపీ MLCలు ఈ బిల్‌ని వ్యతిరేకించారు. ప్రభుత్వం Karnataka Hindu Religious Institutions and Charitable Endowment Amendment Bill 2024 పేరిట ఈ బిల్‌ తీసుకొచ్చింది. 

Also Read: మహారాష్ట్రలో కొలిక్కి వచ్చిన ప్రతిపక్షాల పొత్తు లెక్కలు, త్వరలోనే అధికారిక ప్రకటన!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget