Fake Call Centre: ఒక్క కాల్‌తో అమెరికా సిటిజన్స్‌కు టోకరా, గుట్టురట్టు చేసిన పోలీసులు
Fake Call Centre: మహారాష్ట్రలోని థానేలో ఓ నకిలీ కాల్‌సెంటర్‌పై పోలీసులు దాడి చేసి 16 మందిని అరెస్ట్ చేశారు.
Fake Call Centre:
థానేలో నకిలీ కాల్‌సెంటర్..
నకిలీ కాల్స్, మెసేజ్‌లతో కొందరు ఎలా బురిడీ కొట్టిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇలాంటివెన్ని జరుగుతున్నా మళ్లీ మళ్లీ ఆ వలలోనే చిక్కుకుని నష్టపోతున్నారు చాలా మంది. ఇటీవల మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. థానే పోలీసులు ఫేక్ కాల్ సెంటర్‌పై దాడి చేసి 16 మందిని అరెస్ట్ చేశారు. రుణాల పేరిట అమెరికా పౌరులను వీళ్లు మోసం చేశారు వీళ్లంతా. అధికారిక సమాచారం అందుకున్న పోలీసులు ఈ కాల్‌సెంటర్‌పై దాడి చేశారు. థానేలోని Wagle Estate ప్రాంతంలో ఉందీ కాల్‌సెంటర్. ఉన్నట్టుండి సోదాలు చేసి అక్కడ పని చేసే వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ కాల్‌సెంటర్ నుంచి అమెరికాకు ఫోన్ చేసి...అక్కడి వాళ్లకు లోన్‌లు ఇస్తామని చెప్పటమే వీళ్ల పని. ఓసారి వాళ్ల అకౌంట్ డిటెయిల్స్ తీసుకుని...ఆ ఖాతాల్లో ఉన్న డబ్బుని కాజేస్తారు. అమెరికాలో వీళ్ల తరపున ఓ ఏజెంట్ కూడా ఉన్నాడు. అక్కడ లోన్ కావాలనుకున్న వాళ్ల నుంచి కాజేసిన డబ్బుని భారత్‌కు పంపుతాడు. ఈ హవాలా లావాదేవీలు చేసినందుకు కొంత వాటా తీసుకుంటాడు. ఇలా జరుగుతోంది వీళ్ల దందా. ఇదే విషయాన్ని పోలీసులు వెల్లడించారు.
మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో కాల్ సెంటర్ ఓనర్లు సిద్దేశ్ సుధీర్ భైడ్కర్, సానియా రాకేశ్ జైస్వాల్ ఉన్నారు. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ నిందితుల్లో ఓ మైనర్ కూడా ఉన్నాడు. లీగల్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక...ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కాల్‌సెంటర్‌లోని పలు గ్యాడ్జెట్స్‌ని పోలీసులు సీజ్ చేశారు. నిందితుల్ని ఏడు రోజుల కస్టడీలో ఉంచారు.
థాయ్‌లాండ్‌లో ఇండియన్స్ టార్గెట్..
ఈ మధ్య కాలంలో ఇలాంటి ఆర్థిక నేరాలు బాగా పెరిగిపోయాయి. విదేశాల్లో భారతీయులను టార్గెట్ చేసుకునీ కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. థాయ్‌లాండ్‌లో ఫేక్ జాబ్ రాకెట్స్‌పై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది. భారతీయులనే లక్ష్యంగా చేసుకుని కొందరు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది. ఇందుకు సంబంధించి అడ్వైజరీ వెలువరించింది. డిజిటల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్‌గా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొన్ని ఐటీ సంస్థలు వల వేస్తుంటాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గతంలో కాల్ స్కామ్స్, క్రిప్టో కరెన్స్ ఫ్రాడ్స్ చేసిన IT సంస్థలే ఇప్పుడీ జాబ్ ఫ్రాడ్‌కు పాల్పడుతు న్నాయని వెల్లడించింది. బ్యాంకాక్, మియన్మార్‌లో ప్రత్యేక నిఘా ఉంచిన తరవాతే ఇది నిర్ధరణ అయిందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. "ఐటీ స్కిల్స్ ఉన్న వారినే టార్గెట్ చేసుకుంటున్నారు. డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దుబాయ్, ఇండియాలోని ఏజెంట్‌లు ఇలా మభ్యపెడుతున్నారు" అని విదేశాంగ శాఖ ప్రతినిధి అరింద్ బాగ్చీ వెల్లడించారు.
Also Read: Gandhi Jayanti 2022: మహాత్మా గాంధీ, శాస్త్రిలకు రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల నివాళులు