బాబా పాదాలపైనే ప్రాణాలొదిలిన భక్తుడు, గుండెపోటుతో మృతి - వైరల్ వీడియో
Madhya Pradesh: సాయిబాబా పాదాలపై తలపెట్టి ప్రార్థిస్తూ ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు.
Viral Video:
మధ్యప్రదేశ్‌లో...
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆలయంలో దేవుడిని ప్రార్థిస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ వీడియో అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మధ్యప్రదేశ్‌లోని కత్ని జిల్లాలో జరిగిందీ ఘటన. సాయిబాబా పాదాలకు దండం పెడుతూ అలాగే కూర్చున్న వ్యక్తి చాలా సేపటి వరకూ చలనం లేకుండా ఉన్నాడు. అప్పటికే కొంత మంది వచ్చి దర్శనం చేసుకుని వెళ్లారు. ఎంత సేపటికీ ఈ వ్యక్తి కదలకపోవటం వల్ల అనుమానం వచ్చి కొందరు ఆయనను కదిలించారు. ఉన్నట్టుండి కుప్ప కూలిపోయాడు. అప్పటికే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బాబా పాదాలపై తల పెట్టి...అదే పొజిషన్‌లో గుండెపోటుతో ప్రాణాలొదిలాడు. ఆ వ్యక్తి అంత సేపు అక్కడే ఉండటాన్ని గమనించినా...దండం పెట్టుకున్నాడేమో అనే అనుకున్నారు మిగతా భక్తులు. ఒకసారి కదిలిస్తే కానీ తెలియలేదు...ఆయన చనిపోయినట్టు. బాబా కాళ్ల దగ్గర చనిపోవడం అదృష్టమని, అతడికి మోక్షం లభిస్తుందని భక్తులు చెబుతున్నారు. ఇటీవలే రామ్‌లీలా మైదానంలో ఓ వ్యక్తి నాటకం ఆడుతూ మధ్యలో కుప్ప కూలిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోనూ ఓ మహిళ తన వివాహంలోనే ఉన్నట్టుండి కుప్ప కూలిపోయింది. గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.
रहस्यमय मौत... कटनी में साईं मंदिर में दर्शन करते समय शख्स की हो गई मौत. गिरते ही हो गई उसकी वहीं पर मौत.#Trending #TrendingNow pic.twitter.com/rOAYx852eU
— Narendra Singh (@NarendraNeer007) December 4, 2022
యూపీలోనూ..
ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ఇలాంటి విషాదం జరిగింది. హనుమాన్ వేషం వేసిన వ్యక్తి డ్యాన్స్ చేస్తూ వేదికపై కుప్పకూలి మరణించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫతేపుర్ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. సేలంపుర్ గ్రామానికి చెందిన రామ్ స్వరూప్.. దసరా సందర్భంగా శనివారం రాత్రి హనుమంతుడి వేషం వేశాడు. రామ్ లీలా నాటకాన్ని ప్రదర్శించాడు. లంకా దహనం ఘట్టం సందర్భంగా నిప్పంటించిన తోకతో ఒక బల్లపై డ్యాన్స్ చేశాడు. అయితే గిరాగిరా తిరిగిన అతడు ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో డ్యాన్స్ చేస్తున్న బల్ల పైనుంచి కిందపడ్డాడు. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇలాంటి ఘటనే...
ఇటీవల స్టేజీపై నృత్యం చేస్తోన్న ఓ వ్యక్తి హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రిగా తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జమ్మూలోని బిష్నా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సాంస్కృతి క కార్యక్రమంలో యోగేశ్ గుప్తా (20) అనే కళాకారుడు పార్వతీదేవి వేషధారణలో నృత్యం చేశాడు. కాసేపు నృత్యం చేసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే అక్కడున్న వారంతా నృత్యం చేస్తున్నాడని భావించి అతని వద్దకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. కొద్ది క్షణాలైన లేవకపోయేసరికి.. శివుడి వేషధారణలో ఉన్న మరో వ్యక్తి యోగేశ్‌ను లేపేందుకు వెళ్లాడు. అయితే ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో అతడ్ని ఆసుపత్రికి తరలించారు.
एक और हादसा।
— Narendra nath mishra (@iamnarendranath) September 8, 2022
हंसते-गाते-नाचते हुए एक और मौत की LIVE तस्वीर। यह बहुत चिंताजनक ट्रेंड है। अब इसपर बहुत गंभीरता से व्यापक तरीक़े से बात होनी चाहये pic.twitter.com/FGPxQvWHit
Also Read: OYO Layoffs: ఓయోలోనూ మొదలైన లేఆఫ్‌లు, వేరే ఉద్యోగం వెతుక్కోటానికి సీఈవో సాయం!