అన్వేషించండి

Lok Sabha Security Breach: సరిగ్గా 22 ఏళ్ల క్రితం పార్లమెంట్‌పై దాడి, ఇప్పుడు మళ్లీ అదే రోజున అలజడి

Security Breach Lok Sabha: 2001లో పార్లమెంట్‌పై జరిగిన దాడి అప్పట్లో దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసింది.

Loksabha Security Breach:


2001 పార్లమెంట్‌ దాడి..

సరిగ్గా 22 ఏళ్ల క్రితం. డిసెంబర్ 13. ఉదయం 11.40 నిముషాల సమయం. పార్లమెంట్ హౌజ్ కాంప్లెక్స్‌లోకి ఓ అంబాసిడర్ కార్‌ దూసుకొచ్చింది. ఆ కార్‌కి రెడ్‌ లైట్ బిగించి ఉంది. అంతే కాదు. హోమ్ మినిస్ట్రీ స్టికర్ కూడా ఉంది. అందులో ఐదుగురు ఉగ్రవాదులున్నారు. ఆ స్టికర్‌ని ఫోర్జరీ చేసి అతికించారు. పార్లమెంట్ బిల్డింగ్ గేట్ నంబర్ 12 వైపుగా దూసుకెళ్తున్న (2001 Parliament Attack) కార్‌ని చూసి పార్లమెంట్ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సరిగ్గా అదే సమయంలో కార్‌ని చాలా వేగంగా వెనక్కి తిప్పారు. అది కాస్తా అప్పటి ఉపరాష్ట్రపతి కృష్ణ కాంత్ వెహికిల్‌ని బలంగా ఢీకొట్టింది. అప్పుడే ఉగ్రవాదులు కార్‌లో నుంచి దిగి కాల్పులకు తెగబడ్డారు. వెంటనే పార్లమెంట్ సెక్యూరిటీ అప్రమత్తమైంది. సెక్యూరిటీ అలారం మోగింది. బిల్డింగ్ గేట్స్ అన్నీ మూసేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో పార్లమెంట్ లోపల దాదాపు 100 మంది మంత్రులు, ఎంపీలున్నారు. దాదాపు అరగంట పాటు సెక్యూరిటీ సిబ్బందికి ఉగ్రవాదులకు (Attack on Parliament) మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మొత్తం 5గురు ఉగ్రవాదులూ ప్రాణాలు కోల్పోయారు. వాళ్లతో పాటు 8 మంది సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఓ గార్డెనర్‌ బలి అయ్యారు. 15 మంది గాయపడ్డారు. ఆ సమయంలో ఎల్‌కే అడ్వాణి హోం మంత్రిగా ఉన్నారు. పాకిస్థాన్‌కి చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. ఆ ఐదుగురు ఉగ్రవాదులూ పాకిస్థాన్‌కి చెందిన వాళ్లేనని, భారత్‌తో కొంత మందితో వాళ్లకు సంబంధాలున్నాయని అడ్వాణి అప్పట్లో ప్రకటించారు. ఈ ఘటన అప్పుడు మొత్తం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 

నలుగురు అరెస్ట్..

ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురుని అరెస్ట్ చేసింది. వాళ్లలో జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ మిలిటెంట్ మహమ్మద్ అఫ్జల్ గురుతో పాటు షౌకత్ హుసేన్ గురు, షౌకత్ భార్య అఫ్సన్ గురు, అరబిక్ యూనివర్సిటీకి చెందిన లెక్చరర్ జిలానీ ఉన్నారు. వీళ్లో ఒక్క అఫ్సన్‌కి తప్ప మిగతా ముగ్గురికీ మరణశిక్ష విధించారు. 2003లో గిలానీ నిర్దోషిగా విడుదలయ్యాడు. 2005లో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. షౌకత్‌ హుసేన్ గురు ఉరిశిక్షని రద్దు చేసి పదేళ్ల జైలు శిక్ష విధించింది. అఫ్జల్ గురుకి మాత్రం ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. 2006 సెప్టెంబర్ 26న అఫ్జల్‌కి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2013 ఫిబ్రవరి 9న ఉరి తీశారు. 

22 ఏళ్ల తరవాత మళ్లీ అదే కలకలం..

ఇది జరిగిన 22 ఏళ్లు పూర్తైన రోజే మరోసారి పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం (Security Breach in Lok Sabha) బయటపడడం సంచలనం సృష్టించింది. అంత భద్రతను దాటుకుని లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు ఎలా దూసుకొచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం జీరో అవర్ జరిగే సమయంలో ఈ ఘటన జరిగింది. గ్యాస్ క్యానిస్టర్స్‌తో (Gas Canisters) ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీలో నుంచి సభలోకి దూసుకొచ్చారు. మైసూరుకి చెందిన సాగర్‌ శర్మ, మనోరంజన్‌ సభలోకి వచ్చినట్టు గుర్తించారు. పార్లమెంట్ బయట నీలం, అమోల్ శిందే అనే మరో ఇద్దరు వ్యక్తులు నినాదాలు చేశారు. మొత్తం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభలో టియర్ గ్యాస్ ప్రయోగించడం వల్ల ఎంపీలు పరుగులు పెట్టారు. స్పీకర్‌ ఓం బిర్లా వెంటనే సభను రద్దు చేశారు. తరవాత కాసేపటికి మళ్లీ సభ మొదలైంది. 

Also Read: Lok Sabha Security Breach: లోక్‌సభలోకి దూసుకొచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు, సభలో టియర్ గ్యాస్ ప్రయోగం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget