అన్వేషించండి

Lok Sabha Security Breach: CISF భద్రతా వలయంలో పార్లమెంట్, దాడి ఘటనతో హోంశాఖ కీలక నిర్ణయం

Parliament Security Breach: పార్లమెంట్ భద్రత బాధ్యతను కేంద్ర హోంశాఖ ఇకపై CISF సిబ్బందికి అప్పగించనున్నట్టు తెలుస్తోంది.

Security Breach Lok Sabha:

సీఐఎస్‌ఎఫ్ భద్రత..

పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. పార్లమెంట్ సెక్యూరిటీని పూర్తి స్థాయిలో Central Industrial Security Force (CISF) కి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఢిల్లీలోని కేంద్ర మంత్రిత్వ శాఖల బిల్డింగ్‌లకు భద్రత కల్పిస్తున్న CISFకే ఈ బాధ్యత అప్పగించనుంది. ఎయిర్‌పోర్ట్‌లు, ఢిల్లీ మెట్రోలోనూ ఈ సిబ్బందే భద్రతనిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..కేంద్ర హోం శాఖ ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. పార్లమెంట్ బిల్డింగ్ కాంప్లెక్స్ సెక్యూరిటీపై సర్వే నిర్వహించాలని ప్రతిపాదించింది. ఆ తరవాత అవసరాలకు అనుగుణంగా CISF భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఇప్పటి వరకూ పార్లమెంట్ భద్రత బాధ్యత ఢిల్లీ పోలీసులకే ఉండేది. అయితే...ఇటీవల లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు దూసుకురావడం సంచలనం సృష్టించింది. పార్లమెంట్ సెక్యూరిటీని రివ్యూ చేసుకుని మరింత పటిష్ఠంగా మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. అందుకే...కేంద్ర హోంశాఖ పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించింది. చివరకు ఢిల్లీ పోలీసులకు బదులుగా CISF సిబ్బందికి పార్లమెంట్ భద్రతను అప్పగించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. సభలోకి వచ్చే వాళ్లను చెకింగ్‌ చేసే బాధ్యతనూ CISFకే అప్పగించనున్నారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో భద్రత బాధ్యతలు మాత్రం లోక్‌సభ సెక్రటేరియట్‌ పరిధిలోనే ఉంటాయి. ఢిల్లీ పోలీసులు వెలుపల భద్రత కల్పిస్తారు. సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ని పూర్తిగా మార్చేయడంతో పాటు రకరకాల సెక్యూరిటీ ఏజెన్సీలకు భద్రత బాధ్యతలు అప్పగించే బదులు పూర్తిగా ఒక ఏజెన్సీకి ఇవ్వడం మంచిదని హోంశాఖ భావించింది. పబ్లిక్‌ సెక్టార్‌కి సంబంధించిన పలు కార్యాలయలకు CISF భద్రత అందిస్తోంది. మొత్తంగా 350 సెన్సిటివ్ లొకేషన్స్‌లో సెక్యూరిటీ ఇస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ (PSS), ఢిల్లీ పోలీస్, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్, CRPF ఏజెన్సీలు CISFకిందే విధులు నిర్వర్తించనున్నాయి.  

Also Read: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామక అధికారం కేంద్రానిదే, లోక్‌సభలో బిల్లుకి ఆమోదం

టాప్ హెడ్ లైన్స్

Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Rs 500 Notes Ban: మళ్లీ పెద్ద నోట్లు రద్దు! ప్రధాని మోదీని మరోసారి కోరతాం: ఏపీ సీఎం చంద్రబాబు
మళ్లీ పెద్ద నోట్లు రద్దు! ప్రధాని మోదీని మరోసారి కోరతాం: ఏపీ సీఎం చంద్రబాబు సంచలనం
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Comedy Drama OTT : ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget