News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Lok Sabha Election 2024: సోనియా గాంధీతో నితీశ్, లాలూ భేటీ- టార్గెట్ 2024పై చర్చ!

Lok Sabha Election 2024: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భేటీ కానున్నారు.

FOLLOW US: 
Share:

Lok Sabha Election 2024: 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించడానికి మొత్తం ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు బిహార్‌ సీఎం నితీశ్ కుమార్, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం దిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో నితీశ్, లాలూ సమావేశం కానున్నారు. ఈ మూడు పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి ఐదేళ్లకు పైగా అయింది. 

ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) వ్యవస్థాపకుడు దివంగత చౌదరి దేవి లాల్ జయంతి సందర్భంగా ఫతేహాబాద్‌లో జరిగే ర్యాలీకి నితీశ్, లాలూ హాజరు కానున్నారు. ఐఎన్‌ఎల్‌డీ నేత ఓపీ చౌతాలా ఈ సభను నిర్వహించనున్నారు. దిల్లీకి రాగానే తాను, నితీశ్‌ కుమార్‌తో కలిసి సోనియాను కలుస్తామని లాలూ అంతకుముందు శనివారం ప్రకటించారు.

" నితీశ్ కుమార్, నేను.. సోనియా గాంధీని కలుస్తాము. విపక్షాలను ఏకం చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. "
-                       లాలూ యాదవ్, ఆర్‌జేడీ అధినేత

అంతకుముందు సోనియా, రాహుల్ గాంధీని త్వరలోనే కలుస్తానని లాలూ యాదవ్ తెలిపారు.

2024లో భాజపా ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేస్తాం. నేను, నితీశ్ కుమార్‌తో కలిసి దిల్లీ వెళ్లి త్వరలో సోనియా గాంధీని కలుస్తాను. రాహుల్ గాంధీ తన యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత సమావేశమవుతాను.                             "
-  లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్‌జేడీ అధినేత
 
నితీశ్ ప్రయత్నాలు

ఇటీవల భాజపాతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ కుమార్ మళ్లీ లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్‌జేడీతో చేరి బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు. బిహార్ తర్వాత నితీశ్ కుమార్ ఇప్పుడు భాజపాను కేంద్రం నుంచి గద్దె దించాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆయన సన్నాహాలు కూడా మొదలుపెట్టారు.

ఇటీవల నితీశ్.. దిల్లీలో పర్యటించి మొత్తం విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు.  "మేం ఏర్పాటు చేసేది థర్డ్ ఫ్రంట్ కాదు మెయిన్ ఫ్రంట్" అంటూ నితీశ్ చెబుతున్నారు. ప్రధాని పదవి రేసులో ప్రతిపక్షాల నుంచి నితీశ్ పేరే ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలను ఆయన తోసిపుచ్చారు. అయితే జేడీయూ, దాని మిత్రపక్షాలు మాత్రం నితీశ్‌ను ప్రధాని పదవి రేసులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

ఈ సందర్భంగా నితీశ్ కుమార్ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాయేతర కూటమి గెలిస్తే అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.

మేము (ప్రతిపక్షం) వచ్చేసారి (కేంద్రంలో) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, వెనుకబడిన రాష్ట్రాలకు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదు? మేము బీహార్ గురించి మాత్రమే మాట్లాడటం లేదు, ఇతర వెనుకబడిన రాష్ట్రాల గురించి కూడా మాట్లాడుతున్నాం. ప్రత్యేక హోదా సాధించాలి. "

Published at : 25 Sep 2022 11:03 AM (IST) Tags: BJP CONGRESS Nitish Kumar BIHAR K Chandrashekhar Bharat Jodo Yatra Sonia Gandhi Rahul Gandhi rashtriya janata dal Mahagathbandhan

ఇవి కూడా చూడండి

Free Bus Travel: నేటి నుంచి మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం- మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Free Bus Travel: నేటి నుంచి మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం- మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Who is Lucky Ministers : శాఖల పంపకం - మిగిలిన పదవుల భర్తీ ! రేవంత్‌కు మొదటి టాస్క్

Who is Lucky Ministers : శాఖల పంపకం - మిగిలిన పదవుల భర్తీ ! రేవంత్‌కు మొదటి టాస్క్

ఉద్యమకారులకు గుడ్‌ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కారు

ఉద్యమకారులకు గుడ్‌ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కారు

ABP Desam Top 10, 9 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 9 December 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Gold-Silver Prices Today: పెరిగింది కొండంత, తగ్గేది గోరంత - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: పెరిగింది కొండంత, తగ్గేది గోరంత - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

టాప్ స్టోరీస్

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?

CM Jagan Vs TDP :   టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం -  అంతా జగనే చేశారా ?

Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?

Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?