LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి భారతరత్న, ప్రధాని మోదీ కీలక ప్రకటన
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు ప్రకటించింది.
I am very happy to share that Shri LK Advani Ji will be conferred the Bharat Ratna. I also spoke to him and congratulated him on being conferred this honour. One of the most respected statesmen of our times, his contribution to the development of India is monumental. His is a… pic.twitter.com/Ya78qjJbPK
— Narendra Modi (@narendramodi) February 3, 2024
"ఎల్‌కే అద్వానీకి భారతరత్న అవార్డు ఇస్తున్నట్టు ప్రకటించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడి అభినందించాను. దేశ అభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర ఎప్పటికీ మరిచిపోలేనిది. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన అద్వానీ డిప్యుటీ ప్రధాన మంత్రి స్థాయి వరకూ ఎదిగారు. హోం మంత్రిగానూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన చేపట్టిన బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చారు. ఆయన ఎంతో మందికి ఆదర్శనీయుడు"
- ప్రధాని నరేంద్ర మోదీ
ఇవి ఎంతో భావోద్వేగ క్షణాలు అని ప్రధాని మోదీ X లో పోస్ట్ చేశారు. ఎన్నో దశాబ్దాల పాటు ఆయన ప్రజాసేవ చేశారని ప్రశంసించారు. ఎప్పుడూ పారదర్శకంగా ఉండడంతో పాటు అందరినీ కలుపుకుపోతూ పని చేశారని అన్నారు. రాజకీయ విలువలకు ఆయన నిదర్శనం అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలో ఉప ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఎల్‌కే అద్వానీ. ఆ తరవాత పలు మంత్రిత్వ శాఖల బాధ్యతలూ తీసుకున్నారు. 1970 నుంచి 2019 వరకూ పార్లమెంట్‌లోని రెండు సభలకూ ప్రాతినిధ్యం వహించారు. తనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుని ప్రకటించడంపై అద్వానీ సంతోషం వ్యక్తం చేసినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారని, కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు. పలువురు కేంద్రమంత్రులూ ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన సేవలకు తగని గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు.
#WATCH | Pratibha Advani says, "He is very overwhelmed. He is a man of few words. But he had tears in his eyes. He has this joy and satisfaction that he dedicated his entire life in service of the nation. So, we are very happy..." https://t.co/xj8Ag5Qnfk pic.twitter.com/fdOwvrEjTJ
— ANI (@ANI) February 3, 2024