Lizz Truss New UK PM: యూకే కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్, ప్రకటించిన కన్జర్వేటివ్ పార్టీ
Liz Truss Won: యూకే ప్రధాని రేసులో లిజ్ ట్రస్ విజయం సాధించారు.
UK Prime Minister Liz Truss Profile:
యూకే ప్రధానిగా లిజ్ ట్రస్..
యూకే ప్రధాని రేసులో లిజ్ ట్రస్ విజయం సాధించారు. మొదటి నుంచి రిషి సునక్ కన్నా లీడ్‌లో ఉన్న లిజ్..ఫైనల్ కౌంట్‌డౌన్‌లోనూ ముందంజలో నిలిచారు. లిజ్ ట్రస్ 81,326 ఓట్లు దక్కించుకోగా.. రిషి సునాక్‌కు 60,339 ఓట్లు వచ్చాయి. దాదాపు 21వేల ఓట్ల తేడాతో సునక్‌పై గెలుపొందారు. ఈ సందర్భంగా యూకే ప్రధాని హోదాలో లిజ్ ట్రస్ ప్రసంగించారు. పన్నులను తగ్గించి, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అవసరమైన ప్లాన్ సిద్ధం చేస్తానని హామీ ఇచ్చారు. నేషనల్ హెల్త్ సర్వీస్‌లోని సమస్యల్నీ పరిష్కరిస్తానని వెల్లడించారు. 2024లో జరగనున్న ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి ఘన విజయం సాధించి పెడతానని స్పష్టం చేశారు.
#WATCH | I'll deliver a bold plan to cut taxes & grow our economy, on the energy crisis & long-term issues on energy supply & National Health Service...& we'll deliver a great victory for the Conservative Party in 2024: UK Foreign Secy Liz Truss after being named as the next PM pic.twitter.com/UnImwyjgVx
— ANI (@ANI) September 5, 2022
లిజ్ ట్రస్ ప్రొఫైల్..
లిజ్ ట్రస్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని సర్వేలు ముందుగానే వెల్లడించాయి. అందుకు తగ్గట్టుగానే..ఆమే గెలుపొందారు. 2010లో సౌత్‌వెస్ట్ నార్‌ఫోక్ ఎంపీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి లిజ్ ట్రస్..తరవాత ఎన్నో పదవీ బాధ్యతలు చేపట్టారు. డేవిడ్ క్యామెరాన్, థెరిసా మే, బోరిస్ జాన్సన్ క్యాబినెట్‌లో కీలక పాత్ర పోషించారు. పలు పదవులు చేపట్టారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ...ఇప్పుడు ఏకంగా దేశ ప్రధాని అయ్యారు. ఆమె గురించి మరి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
1. మేరీ ఎలిజబెత్ ట్రస్ (లిజ్ ట్రస్) 1975లో జులై 26న జన్మించారు. 2010లో ఎంపీగా పొలిటికల్ కెరీర్‌ను ప్రారంభించారు. 2012లో విద్య, శిశు సంక్షేమ శాఖకు పార్లమెంటరీ డిప్యుటీ మినిస్టర్‌గా ఎంపికయ్యారు. ఆ తరవాత 2019లో విమెన్ అండ్ ఈక్వాలిటీస్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2021 నుంచి ఫారన్, కామన్‌వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ అఫైర్స్‌కు సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.
2. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ లిబరల్ డెమొక్రాట్స్ (Oxford University Liberal Democrats) అధ్యక్షురాలిగానూ బాధ్యతలు చేపట్టారు. ఆక్స్‌ఫర్డ్‌లోని మెర్టాన్ కళాశాలలో డిగ్రీ చేశారు. 1996లో కన్జర్వేటివ్ పార్టీలో చేరారు. 2010లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. పలు పాలసీల్లో మార్పులు తీసుకువచ్చేందుకు చాలానే కృషి చేశారు. శిశుసంక్షేమం,సహా ఆర్థిక వ్యవస్థలోనూ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కన్జర్వేటివ్ ఎంపీల కోసం ఆమె Free Enterprise Group ఏర్పాటు చేశారు. పలు పేపర్స్, బుక్స్ రాశారు. కొన్నింటికి కో-ఆథర్‌గానూ పని చేశారు. వీటిలో Britannia Unchained,Coalition బుక్స్ బాగా ఫేమస్ అయ్యాయి.
3. డేవిడ్ కామెరాన్ ప్రధానిగా ఉన్న సమయంలో...Environment, Food, and Rural Affairs సెక్రటరీగా పని చేశారు లిజ్‌ట్రస్. 2012-14 మధ్య కాలంలో చైల్డ్ కేర్, ఎడ్యుకేషన్ విభాగాలకు సెక్రటరీగానూ ఉన్నారు. ఐరోపా సమాఖ్యలో యూకే సభ్యత్వం కొనసాగటంలో కీలక పాత్ర పోషించారు. అయితే..ఆ తరవాత కాలంలో బ్రెగ్జిట్‌కే మద్దతు పలికారు.
4. బ్రిటన్ వెయ్యేళ్ల చరిత్రలోనే లార్డ్ ఛాన్స్‌లర్ పదవిని చేపట్టిన తొలి మహిళా నేతగా రికార్డు సృష్టించారు లిజ్ ట్రస్. థెరిసా మే ప్రధానిగా ఉన్న సమయంలో ఈ బాధ్యతలు తీసుకున్నారు. 2016లో కామెరాన్ రిజైన్ చేసేంత వరకూ జస్టిస్ అండ్ లార్డ్ ఛాన్స్‌లర్‌గా వ్యవహరించారు ట్రస్.
5. 2017లో జరిగిన అధ్యక్ష ఎన్నికల తరవాత ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా ఎంపికయ్యారు ట్రస్. 2019లో బోరిస్ జాన్సన్‌కు మద్దతుగా నిలిచారు. కన్జర్వేటివ్ పార్టీని లీడ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. జాన్సన్ హయాంలోనే బోర్డ్ ఆఫ్ ట్రేడ్ అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కు ప్రెసిడెంట్‌గానూ ఉన్నారు. 2021లో లిజ్ ట్రస్‌ను ఫారిన్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టారు. యూరోపియన్ యూనియన్‌తో సంప్రదింపులు జరుపుతూ...యూకే పార్ట్‌నర్ షిప్ కౌన్సిల్ జరగటంలోనూ లిజ్ ట్రస్ విజయం సాధించారు.