(Source: ECI/ABP News/ABP Majha)
Next UK PM: బ్రిటన్‌కు ఆమే ప్రధాని? లిజ్ ట్రస్‌కే మొగ్గు చూపుతున్న రిపోర్ట్‌లు - రిషి సునక్ వెనుకంజ
Next UK PM: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ విజయం సాధిస్తారని రిపోర్ట్‌లు స్పష్టం చేస్తున్నాయి.
Who is Next UK PM:
విజయం ఆమెదే..!
బ్రిటన్ ప్రధాని ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ దాదాపు పూర్తైనట్టే. కన్జర్వేటివ్ సభ్యుల ఓటింగ్‌లో లిజ్ ట్రస్ ముందంజలో ఉన్నట్టు రిపోర్ట్‌లు చెబుతున్నాయి. ఆమే తరవాతి బ్రిటన్ ప్రధాని అవుతారని ఇప్పటికే చాలా మంది ఓ నిర్ణయానికి వచ్చేశారు. భారత సంతతికి చెందిన రిషి సునక్ ప్రధాని అవుతారని అంచనా వేసినా...అది నిజమయ్యేలా కనిపించటం లేదు. లిజ్ ట్రస్, రిషి సునక్ మధ్య మొదటి నుంచి గట్టి పోటీ ఉంది. అయితే...క్రమంగా కన్జర్వేటివ్ సభ్యులు లిజ్ ట్రస్ వైపే ఎక్కువగా మొగ్గు చూపటం వల్ల అంచనాలు తారుమారయ్యాయి. ప్రచార కార్యక్రమాల్లోనూ లిజ్ ట్రస్‌కు ఎక్కువ రెస్పాన్స్ వచ్చినట్టు సమాచారం. ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ తన రాజీనామాను క్వీన్ ఎలిజిబెత్-2కు అందించకముందే ఈ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. దాదాపు 2 లక్షల మంది సభ్యులున్న టోరిలో ఆగస్టు నుంచి పోస్టల్, ఆన్‌లైన్ విధానంలో ఓటింగ్ కొనసాగుతోంది. ఆ ఓటింగ్ నేటితో ముగిసింది. దీనిలో లిజ్‌ట్రస్ మంచి మెజార్టీ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఈ ఓటింగ్‌లో ఎవరు విజయం సాధిస్తారో...వారు బ్రిటన్ రాణి అనుమతితో పీఎం కుర్చీలో
కూర్చుంటారు.
వెనకబడిన రిషి సునక్
బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ కాస్త వెనకబడ్డట్టు గతంలోనే యూగవ్ సర్వే వెల్లడించింది. రిషి సునక్‌తో పోల్చుకుంటే ప్రత్యర్థి లిజ్ ట్రస్ 28 పాయింట్ల లీడ్‌లో ఉన్నట్టు తెలిపింది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు రిషి సునక్, లిజ్ ట్రస్‌కు ఓటు వేయటం వల్ల చివరి రౌండ్‌లో వీరిద్దరే మిగిలారు. వీరిలో ఎవరికి మద్దతు ఎక్కువగా వస్తే, వారే ప్రధాని పదవిని చేపడతారు. అయితే ఇది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆగష్టు 4 వ తేదీ నుంచి బ్యాలెట్ పద్ధతిలో ఈ నియామకానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తవగానే ఎవరు ప్రధాని అన్నది తేలిపోతుంది. బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ బేస్డ్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ అయిన యూగవ్ రిపోర్ట్‌లో రిషి సునక్ మొదటి నుంచి వెనకబడినట్టే తేలింది. 19 పాయింట్ల తేడాతో ట్రస్, రిషి సునక్‌ను అధిగమిస్తారని గతంలోనే అంచనాలు వచ్చాయి. ఈ సర్వే ప్రకారం...అప్పట్లో 730 మంది కన్జర్వేటరీ పార్టీ సభ్యుల్లో 62% మంది తాము ట్రస్‌కు ఓటు వేసినట్టు చెప్పగా, 38% మంది మాత్రమే రిషి సునక్‌కు ఓటు వేసినట్టు వెల్లడించారు. ఇలా చూసుకుంటే 24% మేర ట్రస్ లీడ్‌లో ఉన్నట్టే. 2019లో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం కోసం జరిగిన ఎన్నికల్లో 1,60,000 మంది సభ్యులు ఓటు వేశారు. ప్రస్తుతం వారి సంఖ్య ఇంకాస్త పెరిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ సభ్యుల్లో మహిళలు, పురుషులతో పాటు అన్ని వయసుల వారిలో ఎక్కువ మంది ట్రస్‌కే మద్దతునిచ్చారు. దేశంలో ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరిగింది. కొత్త ప్రధానికి ఈ సమస్యే స్వాగతం పలకనుంది.
Also Read: Viral Video: గన్ జామ్ అయింది, ప్రాణాపాయం తప్పింది - అర్జెంటీనా వైస్ ప్రెసిడెంట్‌పై హత్యాయత్నం