Lithuania : నెల రోజులుగా మేకులు, బోల్టులే తిన్నాడు ! చివరికేమయిందంటే ?
లిధువేనియాలో ఓ వ్యక్తి నెల రోజుల పాటు బోల్టులు, నట్లే తిన్నాడు. చివరికి కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరాడు. అతని కడుపులో ఉన్న వాటిని చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు.
"వాడు మేకులు తిని కూడా అరగదీసుకుంటాడురా" అని మిత్రులు మునగ చెట్టు ఎక్కించేశారేమో కానీ .. నిజంగానే మేకులు తిన్నాడు. వాటితో పాటు బోల్టులు, స్క్రూలు కూడా తిన్నాడు. కానీ తిన్నది అరగలేదు. అందుకే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. చివరికి అతని కడుపులో ఏముందో చూసి ఆస్పత్రిలో డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. అప్పటి వరకూ కిడ్నీల్లో రాళ్లనే తీసిన డాక్టర్లు కడుపు లో నుంచి మెటల్స్ అన్నీ బయటకు తీయాల్సి రావడంతో ఆశ్చర్యపోయారు. అవి ఏకంగా కేజీపైనే ఉన్నాయి.
Also Read : ఆరేయ్ ఏంట్రా ఇది.. రెండు నెలలపాటు బాటిల్‌లో 'అది' ఇరుక్కుపోయిందట!
లిధువేనియాకు చెందిన ఓ వ్యక్తి అక్కడి పోర్ట్ సిటీ ఆస్పత్రిలోకడుపు నొప్పి అంటూ చేరాడు. అతనికడుపు నొప్పికి కారణం ఏమిటో తెలుసుకుందమని డాక్టర్లు ఎక్స్ రే తీయించారు. ఎక్స్‌రేలో అన్నీ అన్నీ మేకులు, బోల్టులు, నట్లే కనిపించాయి. అనుమానంతో ఒకటికి రెండు సార్లు పరిశీలించినా అవే కనిపించాయి. దీంతో నిజంగానే కడుపులో మేకులు, బోల్టులు, నట్లు ఉన్నాయని గుర్తించి.. వెంటనే ఆపరేషన్ చేసి తీశారు. అంతా అయిపోయిన తర్వాత అసలేమయిందని డాక్టర్లు అడిగారు. దానికి అతను... నెల రోజులుగా తిండితిప్పలు మానేశానని బోల్టులే తింటున్నానని చెప్పుకొచ్చారు. అలా ఎందుకు చేశాడో చెప్పలేదు .. కానీ ఇనుము అయినా అరిగించుకుంటానని మిత్రులతో చేసిన చాలెంజ్‌లు లాంటివేవో ఉండి ఉంటాయని డాక్టర్లు కూడా అనుకున్నారు.
Also Read : మెదడులోకి 'బ్రేయిన్-ఈటింగ్' అమీబా.. బాలుడు మృతి.. ఎలా వచ్చిందంటే..?
అయితే నెల రోజులుగా కడుపులో మేకులు ఉన్నా అతనికి శారీరకంగా అంతర్గతంగా పెద్దగా డ్యామేజీ కాకపోవడంతో డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. కాస్త పెద్ద మేకులు.. ఉన్నా.. అవి ఆయన స్టమక్‌కు ఎలాంటి డ్యామేజీ చేయలేదు. నిజంగా మేకులు అరిగించుకోకపోయినా.. వాటిని తట్టుకునే శక్తి ఆ వ్యక్తికి ఉందని డాక్టర్లు నిర్ధారించేసుకున్నారు.
Also Read : పెట్రోల్ బంకుల ముందు భారీ క్యూలు.. రంగంలోకి సైన్యం.. బ్రిటన్‌కు ఏమైంది?
తెలుగు సినిమాల్లోనే కాదు.. చాలా సినిమాల్లో స్మగ్లింగ్‌కు పొట్టల్ని వాడుకోవడం సహజం. ఆపరేషన్లు చేయించుకుని మరీ లోపల హెరాయిన్ లాంటి డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేయిస్తూంటారు. అలాంటి చోట పొట్ట కోసి బయటకు తీయడం చూస్తూంటాం. ఇక్కడ మాత్రం అలా పొట్ట కోసం మేకులు తీశారు. ఇప్పుడీ ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read:China Power Crisis: చీకట్లో చైనా.. పరిశ్రమలకు చిక్కులు.. ఇక ప్రపంచానికి చుక్కలు!