అన్వేషించండి

Indian Restaurants: స్వాతంత్య్రం రాక ముందు నుంచే ఉన్న రెస్టారెంట్‌లు ఇవి, ఇప్పటికీ క్యూ కట్టి మరీ తింటారు

Pre Independence Restaurants: స్వాతంత్య్రం రాక ముందు నుంచీ ఇండియాలోని కొన్ని రెస్టారెంట్‌లు ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఇన్నేళ్లైనా వాటి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.

Restaurants in India: వీకెండ్ వస్తే చాలు. ఎక్కడికి వెళ్దాం అని ప్లాన్ చేసుకుని ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి అలా సరదాగా ఓ టూర్‌ వేసొస్తారు చాలా మంది. ఇక ఫుడీస్‌ అయితే సిటీలో ఏయే రెస్టారెంట్‌లు కొత్తగా వచ్చాయ్..? రివ్యూస్ ఎలా ఉన్నాయని చూసుకుని అక్కడికి వెళ్లి ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తారు. ఇన్‌స్టా రీల్స్‌లో రెస్టారెట్‌ల లిస్ట్‌ చూసుకుని వెళ్తున్న వాళ్లూ ఉన్నారు. అయితే...ఆహార ప్రియులకు ఎన్నో దశాబ్దాలుగా నోరూరిస్తున్న రెస్టారెంట్‌లున్నాయి. స్వాతంత్య్రం రాక ముందు నుంచే ఇవి ఉన్నాయి. తరాలు ఎన్ని మారుతున్నా ఆ రెస్టారెంట్‌లకు ఉన్న ఫేమ్ మాత్రం తగ్గడం లేదు. 1947కి ముందు నుంచే ఉన్నా ఇప్పటికీ వాటి డిమాండ్ మాత్రం అలాగే కొనసాగుతోంది. పైగా వింటేజ్ ఫీల్ ఇస్తుండడం వల్ల ఫుడీస్‌ అంతా క్యూ కడుతూనే ఉన్నారు. 

ఈ లిస్ట్‌లో మొట్టమొదట చెప్పుకోవాల్సింది కోల్‌కత్తాలోని ఇండియన్ కాఫీ హౌజ్. కాలేజ్‌ స్ట్రీట్‌లో ఉండే హోటల్‌ని 1876లో ప్రారంభించారు. ముందుగా దీన్ని ఆల్బర్ట్ హాల్‌గా పిలుచుకునే వాళ్లు. 1942లో ఇండియన్ కాఫీ హౌజ్‌గా (Indian Coffee House) పేరు మార్చారు. అప్పట్లో ఎంతో మంది మేధావులు, రాజకీయ నేతలు, కళాకారులు ఇక్కడికి వచ్చి కాఫీ తాగేవాళ్లు. వీళ్లలో సుభాష్ చంద్రబోస్‌తో పాటు ప్రముఖ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఉన్నారు. కాఫీతో పాటు ఇక్కడ ఇచ్చే స్నాక్స్ నోరూరిస్తాయి. అందుకే..కోల్‌కత్తాకి వెళ్లిన వాళ్లు కచ్చితంగా ఈ కాఫీ హౌజ్‌ని విజిట్ చేసి వస్తారు.

undefined

(Image Credits: Wikipedia)

ఇక కర్ణాటకలోని బెంగళూరులో మావళ్లి టిఫిన్ రూమ్ (MTR) కూడా ఈ జాబితాలో ఉంది. 1924లో మొదలైన ఈ హోటల్ సౌత్ ఇండియన్ ఫుడ్‌కి చాలా ఫేమస్. ముఖ్యంగా ఇడ్లీ, దోశతో పాటు ఫిల్టర్ కాఫీ కోసం ఫుడీస్‌ ఎగబడతారు. వెజిటేరియన్లకూ ఇది మంచి స్పాట్. దాదాపు వందేళ్లుగా ఆహార ప్రియులను ఆకర్షిస్తూనే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆహార కొరతను తీర్చేందుకు రవ్వ ఇడ్లీని కనిపెట్టింది ఈ MTR హోటలే. టేస్ట్‌, క్వాలిటీలో ఎక్కడా రాజీపడకపోవడం వల్ల ఆ పేరు చెక్కచెదరలేదు. 

Indian Restaurants: స్వాతంత్య్రం రాక ముందు నుంచే ఉన్న రెస్టారెంట్‌లు ఇవి, ఇప్పటికీ క్యూ కట్టి మరీ తింటారు

(Image Credis: cntraveller)

ముంబయిలోని బ్రిటానియా అండ్ కంపెనీని 1923లో స్థాపించారు. పార్శీ వంటకాలకు ఈ హోటల్ చాలా ఫేమస్. బలార్డ్ ఎస్టేట్ ఏరియాలో ఉండే ఈ హోటల్‌లో బెర్రీ పలావ్‌ని ఆహార ప్రియులు లొట్టలేసుకుని తింటారు. వింటేజ్ ఫర్నిచర్‌ అందరినీ అట్రాక్ట్ చేసేస్తుంది. బొమన్ కోహినూర్‌ ఈ హోటల్‌ని స్థాపించాడు. అప్పట్లో అతిథులను ఆయనే ఆహ్వానించి వాళ్లకు ఏం కావాలో అడిగి మరీ ఆర్డర్లు తీసుకునే వారని చెబుతారు. లక్నోలోని తుండే కబాబీ (Tunday Kababi) 1905 నుంచి ఫేమస్. నోరూరించే కబాబ్‌లు ఇక్కడ దొరుకుతాయి. ఈ హోటల్‌ని హాజీ మురద్ అలీ ప్రారంభించాడు. ఓ చేయి లేకపోయినా సరే కబాబ్‌లు చేయడంలో మాత్రం ఆయన స్టైలే వేరట. ఇప్పుడు ఇక్కడ కబాబ్‌లతో పాటు బిర్యానీ కూడా మెనూలో చేర్చారు. ఢిల్లీలోని జామా మసీద్ వద్ద కరీమ్స్‌ రెస్టారెంట్‌లో మొఘలాయ్‌ ఫుడ్ మెనూ ఉంటుంది. మటన్ కూర్మా, కబాల్‌ల కోసం ఫుడీస్ ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు. 

Also Read: Ageing: మనమంతా రెండు సార్లు ముసలి వాళ్లమైపోతామట, మొదటి వృద్ధాప్యం వచ్చేది అప్పుడే

టాప్ హెడ్ లైన్స్

Sarfaraz Vs Jurel IND vs SL: సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget