Liquor Policy Case: సిసోడియా కస్టడీని పొడిగించిన ఢిల్లీ కోర్టు, మరో 5 రోజుల పాటు ఈడీ విచారణ
Liquor Policy Case: మనీశ్ సిసోడియా కస్టడీని మరో 5 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ఢిల్లీ కోర్టు వెల్లడించింది.
Liquor Policy Case:
ఈడీ పిటిషన్
ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు మనీశ్ సిసోడియా కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో ఐదు రోజుల పాటు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. సిసోడియా విచారణకు మరో 7 రోజుల సమయం కావాలని, కస్టడీని పొడిగించాలని ఈడీ కోర్టుని కోరగా...ఐదు రోజుల పాటు పొడిగించేందుకు అంగీకరించింది. సిసోడియా తన ఫోన్లను నిర్వీర్యం చేశాడని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని తేల్చి చెప్పింది. సిసోడియా తరపు న్యాయవాది ఈడీ రిమాండ్ పిటిషన్‌ను వ్యతిరేకించారు. అటు ఈడీ మాత్రం సిసోడియా ఫోన్‌లు,ఈ మెయిల్స్‌ను ఫోరెన్సిక్ అనాలసిస్ చేస్తున్నామని కోర్టుకు తెలిపింది. సిసోడియా కస్టడీలో ఉన్న సమయంలోనే కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయని తేల్చి చెప్పింది. గతేడాది ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియాపై కేసు నమోదైన వెంటనే ఆయన తన మొబైల్ మార్చేశారని ఆరోపించింది. ఆ ఫోన్‌ను ఏం చేశారో అన్నది మాత్రం చెప్పలేకపోతున్నామని తెలిపింది. 2021 మార్చి నాటి డాక్యుమెంట్‌ల ఆధారంగా చూస్తే ఈ పాలసీలో సిసోడియాకు 5% కమీషన్ ఉన్నట్టు చెబుతోంది ఈడీ. అయితే 2022 సెప్టెంబర్ నాటికి అది 12%కి పెరిగిందని వివరించింది. సిసోడియా తరపు న్యాయవాది మాత్రం దర్యాప్తు సంస్థలు చెప్పిందే చెబుతున్నాయి తప్ప కొత్త ఆధారాలేవీ వెలుగులోకి తీసుకురావడం లేదని వాదిస్తున్నారు. వారం రోజుల పాటు కస్టడీలో ఉంచినా...మొత్తం మీద ఆయనను 10-12 గంటల మాత్రమే ప్రశ్నించారని చెబుతున్నారు. ఈడీ మాత్రం తాము రోజుకి 5-6 గంటల పాటు విచారిస్తున్నట్టు చెబుతోంది.
Excise policy case | Delhi's Rouse Avenue Court extends Delhi's former Deputy Chief Minister Manish Sisodia ED remand by five more days in a money laundering case pertaining to alleged irregularities in the framing and implementation of the excise policy of GNCTD. pic.twitter.com/oIKH9FqN8m
— ANI (@ANI) March 17, 2023
రిమాండ్ రిపోర్ట్..
సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ సంచలనాలు బయటపెట్టింది. హైదరాబాద్ కేంద్రంగానే దిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందని తెలిపింది. కొంతమంది వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేలా నిపుణుల కమిటీ అభిప్రాయాలను అంగీకరించకుండా ఈ మద్యం విధానాన్ని రూపొందించారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఆప్ సీనియర్ నేత సిసోడియాకు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ న్యాయవాది తెలిపారు. ఈ విధానంలో తాము ఎంపిక చేసిన హోల్‌సేల్ వ్యాపారులు 12 శాతం ప్రాపిట్ మార్జిన్ వచ్చే విధంగా పాలసీని రూపొందించినట్లు ఈడీ తెలిపింది. ఇది ఉండాల్సిన దానికంటే ఆరు శాతం ఎక్కువ ఉందని వెల్లడించింది. "మనీశ్ సిసోడియా ఆదేశాల ప్రకారమే ఇది జరిగిందని మా వద్ద సమాచారం ఉంది. మద్యం అమ్మకానికి లైసెన్స్ ఇవ్వడానికి నిర్ణయించిన వ్యవస్థను కూడా ఉల్లంఘించారు. కొంతమంది ఎంపిక చేసిన వ్యక్తులు దాని నుంచి ప్రయోజనం పొందారు" అని ED తెలిపింది. తెలంగాణ ఎమ్మెల్సీ కె.కవితతో సహా సౌత్ గ్రూప్‌తో పాటు సిసోడియా సహాయకుడు విజయ్ నాయర్ మొత్తం కుట్రను సమన్వయం చేశారు, వ్యాపారవేత్త దినేష్ అరోరా కిక్‌బ్యాక్‌లను సమన్వయం చేస్తున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. దిల్లీలోని ఎక్సైజ్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ వాటాదారుగా మారిందని ఈడీ పేర్కొంది.
Also Read: BJP vs Rahul Gandhi: రాహుల్ సారీ చెబితేగానీ మాట్లాడనివ్వం, తేల్చి చెప్పిన బీజేపీ నేతలు