PM Modi: బుల్‌డోజర్ ఎక్కడ వాడాలో యోగిని చూసి నేర్చుకోండి, ప్రతిపక్షాలపై మోదీ సెటైర్లు
PM Modi: బుల్‌డోజర్ ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదో యోగి ఆదిత్యనాథ్‌ని చూసి నేర్చుకోవాలంటూ ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు.
PM Modi on Yogi Adityanath: యూపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ యోగి ఆదిత్యనాథ్ బుల్‌డోజర్ పాలన గురించి ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు యోగిని చూసి నేర్చుకోవాలంటూ చురకలు అంటించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్య రామ మందిరాన్ని బుల్‌డోజర్‌తో కూల్చేస్తారంటూ తీవ్ర విమర్శలు చేశారు. వేటిని బుల్‌డోజర్‌తో ధ్వంసం చేయాలో, వేటిని చేయకూడదో యోగి ఆదిత్యనాథ్‌కి బాగా తెలుసని, ప్రతిపక్షాలు ఆయన దగ్గర ట్యూషన్ తీసుకుంటే మంచిదంటూ సెటైర్లు వేశారు.
"సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్య రామ మందిరాన్ని బుల్‌డోజర్‌తో ధ్వంసం చేస్తాం. రాముడు మళ్లీ టెంట్‌లోకి వచ్చేస్తాడు. ఎక్కడెక్కడ బుల్‌డోజర్‌ని వాడాలో ఎక్కడ వాడకూడదో యోగి ఆదిత్యనాథ్‌కి బాగా తెలుసు. అందుకే ప్రతిపక్షాలు ఆయన దగ్గర ట్యూషన్ తీసుకుంటే మంచిది"
- ప్రధాని నరేంద్ర మోదీ
#WATCH | In his address to a public meeting in Uttar Pradesh's Barabanki, PM Narendra Modi says, "...If SP and Congress come to power, Ram Lalla will be in a tent again and they will run a bulldozer on Ram temple. They should take tuition from Yogi ji, where to run a bulldozer… pic.twitter.com/rfhqN0XiXc
— ANI (@ANI) May 17, 2024
బీజేపీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం పని చేస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అటు ప్రతిపక్ష కూటమి I.N.D.I.A నేతలు మాత్రం అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. ఎన్నికలు పూర్తయ్యే లోగా ప్రతిపక్ష కూటమిలోని నేతలంతా ఒక్కొక్కరుగా విడిపోతారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే ఈ కూటమి ఎన్నికల బరిలో దిగిందని విమర్శించారు.