అన్వేషించండి

Leak Videos Row: చండీగఢ్‌ ఘటనపై ప్రభుత్వం సీరియస్, విచారణకు ఆదేశించిన సీఎం

Leak Videos Row: చండీగఢ్‌ యూనివర్సిటీ ఘటనపై సీఎం భగవంత్ మాన్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.

 Leak Videos Row: 

కఠినంగా శిక్షిస్తామంటున్న సర్కార్..

పంజాబ్‌ మొహాలీలోని చండీగఢ్ యూనివర్సిటీ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.  క్యాంపస్‌లోని హాస్టల్‌లో విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలు ఆన్‌లైన్‌లో లీక్ కావడం అలజడికి కారణమైంది. అయితే...ఇదంతా అవాస్తవమని యూనివర్సిటీ చెబుతోంది. 
విద్యార్థినులు మాత్రం దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిజానిజాలు తేల్చేందుకు...పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రంగంలోకి దిగారు. వదంతులు వ్యాప్తి చేయొద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. 
అంతకు ముందే ఆప్ సీనియర్ నేతలంతా స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులెవరైనా వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. "ఇది ఎంతో సిగ్గుచేటు. అమ్మాయిలందరూ మానసికంగా దృఢంగా ఉండాలి" అని ట్వీట్ చేశారు. నిందితులను కచ్చితంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు అండగా నిలబడతామని చెప్పారు. అందరూ సహనంగా ఉండాలని సూచించారు.

అటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ట్వీట్ చేశారు. "దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాను. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తాం. అందరితోనూ నేనూ సంప్రదింపులు జరుపుతున్నాను. అప్పటి వరకూ రూమర్స్ వ్యాప్తి చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను" అని అన్నారు. ఇది చాలా సున్నితమైన అంశమని, వదంతులు వ్యాప్తి చేయొద్దని పంజాబ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి గురుమీత్ సింగ్...ట్వీట్ చేశారు. "యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత మాది. ఇప్పిటికే విచారణకు ఆదేశించాం" అని చెప్పారు. అయితే... వీడియోలు లీక్ అయిన తరవాత కొందరు యువతులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పోలీసులు ఇప్పటికే స్పష్టతనిచ్చారు. అలాంటిదేమీ లేదని చెప్పారు. ప్రో వైస్‌ఛాన్స్‌లర్ కూడా ఇదే విషయం వెల్లడించారు. అలాంటి వార్తలు నమ్మొద్దనిఅన్నారు. 

ఆ వీడియోల వల్లే..

యూనివర్సిటీ హాస్టల్‌లో తోటి విద్యార్థినిలు స్నానం చేస్తున్న వీడియోలను తీసిన ఓ విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్‌కు వాటిని పంపింది. మొత్తం 60 మంది అమ్మాయిలు స్నానం చేస్తున్న వీడియోలను అతను ఇంటర్నెట్‌లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోలు పోర్న్ సైట్‌లో కనిపించడంతో యూనివర్సిటీ విద్యార్థినిలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అవమాన భారంతో 8 మంది విద్యార్థినిలు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై చండీగఢ్ యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు నిందితులపై  ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చండీగఢ్ యూనివర్సిటీ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. పోలీసుల వాహనాలపై విద్యార్థులు రాళ్లు రువ్వారు.

Also Read: Iran Hijab Protest: రోడ్లపైకి వచ్చి హిజాబ్‌లు తొలగించిన మహిళలు, ప్రభుత్వ తీరుపై ఆగ్రహం

 

 

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
MS Dhoni Retirement:  ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
Shubman Gill, Rishabh Pant Record: ఒకే ఇన్నింగ్స్‌లో చరిత్ర సృష్టించిన గిల్, పంత్.. డబ్ల్యూటీసీలో 3000 పరుగులు దాటిన తొలి భారత ఆటగాళ్లుగా రికార్డు, సెంచరీ చేజారడంతో నిరాశలో కెప్టెన్
ఒకే ఇన్నింగ్స్‌లో చరిత్ర సృష్టించిన గిల్, పంత్.. డబ్ల్యూటీసీలో 3000 పరుగులు దాటిన తొలి భారత ఆటగాళ్లుగా రికార్డు, సెంచరీ చేజారడంతో నిరాశలో కెప్టెన్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
MS Dhoni Retirement:  ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
Embed widget