Amazon Employee : గూగుల్ తీసేస్తే అమెజాన్‌లో పడ్డాడు - పని చేయకుండానే ఏటా రూ. 3 కోట్ల జీతం !
Layoff : ఓ సంస్థలో ఉద్యోగం పోతే మరో ఉద్యోగం వెదుక్కోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ కొంత మంది అదృష్టవంతులుంటారు. ఓ ఉద్యోగంపోగానే మరో ఉద్యోగం రెడీగా ఉంటుంది. పని కూడా ఏమీ ఉండదు.
Layoff turns into goldmine for techie : పనేమీ ఉండని ఉద్యోగం దొరికితే ఎంత హాయిగా ఉంటుంది.. అది కూడా ఏటా రూ. మూడు కోట్ల జీతం వచ్చే ఉద్యోగం. అంత కంటే ఇంకేం కావాలి...అని ధాంక్ గాడ్ అనుకుంటాం. ఇలాంటి అవకాశం చాలా కొద్ది మందికే వస్తుంది. అలాంటి వ్యక్తి ఒకరు ఆన్ లైన్‌లో తారసరపడ్డారు. ఆ వ్యక్తి అనుభవాన్ని విని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
పేరు తెలియని ఓ ఉద్యోగి మొదట గూగుల్‌లో ఉద్యోగం చేసేవారు. గూగుల్ లేఆఫ్స్ జాబితాలో అతని పేరు పెట్టింది. వెంటనే అతను టెర్మినేషన్ డేట్ దగ్గర పడేసరికి అమెజాన్ లో చేరిపోయాడు. చేరి సంవత్సరంన్నర అయింది. కానీ ఇప్పటి వరకూ అతనికి పనేమీ చెప్పలేదు. కానీ జీతం..భత్యాలు.. వేరియబుల్ పే లాంటివి మాత్రం ఫుల్‌గా స్తున్నాయి. ఎలా చూసినా .. ఏటా రూ. మూడు కోట్ల రూపాయలు ఖాతాలో పడిపోతున్నాయి. ఆయన తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
many such cases pic.twitter.com/4o32Qq7JKE
— anpaure (@anpaure) August 23, 2024
అమెజాన్ లో చేరి ఏడాదిన్నర అయిందని .. ఈ కాలంలో కేవలం ఏడు టిక్కెట్స్ మాత్రమే పరిష్కరించానన్నారు. అలాగే చాట్ జీపీటీ ఉపయోగించి చేసిన ఓ ప్రాజెక్టును.. మూడు నెలల పాటు చేసినట్లుగా రిపోర్టు ఇచ్చారు. అంతకు మించి తాను చేసిందేమీ లేదన్నారు. ఆమెజాన్ గోల్ సెట్టింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. దాన్ని కూడా ఆ ఉద్యోగి సులువుగానే మోసం స్కిప్ చేయగలిగారు. సోషల్ మీడియాలో ఈ పోస్టు చూసి చాలా మంది షేర్ చేసుకుంటున్నారు. [
People that are butthurt about this: 99% of you corporate peons are useless and in denial. If you work a lot, you are either just inefficient, or keeping yourself busy with random BS. If you genuinely believe you should work 8-10h per day you drank the corporate kool aid.
— GenevaInvestor (@GenevaInvestor) August 23, 2024
కొంత మంది ఇలాంటి అదృష్టవంతులు చాలా చోట్ల ఉంటారని చెప్పుకొచ్చారు. కొంత మంది ఉద్యోగాల్లో రెండు గంటలు పని చేస్తారని అయితే ఎనిమిది గంటల జీతం తీసుకుంటారన్నారు. కొంత మంది ఎనిమిది గంటల పాటు పని చేసి రెండు గంటల జీతమే పొందుతారని.. కార్పొరేట్ కంపెనీల్లో ఇలాంటి వారు ఎక్కువగా ఉంటారని చెప్పుకొచ్చారు.
కొంత మంది ఇలా ఏ పనీ చేయకపోవడం పెద్ద నష్టమని.. అది కంపెనీకి కాదని... ఆ ఉద్యోగికని చెబుతున్నారు.
This person is hurting themselves more than they are hurting their employer.
— Pablo Musumeci (@pablonmusu) August 23, 2024
Is there a worse torture than throwing away your limited time in life by pretending to be busy?
Experience comes from doing, not by time itself.
That’s why some engineers with 1 year of work…