అన్వేషించండి

Dy CM Udhayanidhi Stalin : జీన్స్ ప్యాంట్, టీ షర్టుతో అధికార కార్యక్రమాలకు హజరు - తమిళనాడు డిప్యూటీ సీఎంపై కోర్టులో పిటిషన్

Madras HC : తమిళనాడు కొత్త డిప్యూటీ సీఎం ఉదయనిధి జీన్స్, టీ షర్ట్‌తో అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Lawyer moves Madras HC on govt dress code violation by TN Dy CM Udhayanidhi Stalin : తమిళనాడులో ఇటీవల డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణం చేశారు. ఆయన సినిమాల్లో హీరోగా చేశారు. ఆయన యువకుడు. డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా యూత్ ను ఫాలో అయ్యేలా ఉంటుంది. రాజకీయ నాయకుడ్ని అయ్యానని.. డిప్యూటీ సీఎంను అయ్యానని యన డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోలేదు. జీన్స్ ప్యాంట్ , టీ షర్టుల్లోనే అధికారిక కార్యక్రమాలకు హాజరవుతూంటారు. చాలా సందర్భాల్లో అధికారిక కార్యక్రమాల్లోనూ షర్టుకు తన పార్టీ గుర్తు ఉంటుంది. దీన్ని చూసి చూసి భరించేలేకపోయిన ఓ లాయర్.. అధికారంలో ఉన్న వారికి ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారికి ఓ డ్రెస్ కోడ్ ఉందని దాన్ని ఉదయనిధి ఉల్లంఘిస్తున్నారని హైకోర్టులో పిటిషన్ వేశారు. 

ఫార్మల్ డ్రెస్ కోడ్ ఉల్లంఘిస్తున్న ఉదయనిధి 

ఉదయనిధి స్టాలిన్ నిబంధనలకు ఉల్లంఘిస్తున్నారనడానికి ఆయన పలు సాక్ష్యాలు పిటిషన్‌కు జత చేశారు. 2019లో గవర్నర్ జారీ చేసిన ఫార్మల్ డ్రెస్ కోడ్ ఉత్తర్వులను తన పిటిషన్‌కు జత చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం.. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ గుర్తును ప్రదర్శించడం కూడా నిబంధనల ఉల్లంఘనేనని పిటిషన్ దాఖలు చేసిన లాయర్ సత్యకుమార్ చెబుతున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య స్పష్టమైన తేడా ఉంటుందన్నారు.         

అధికారిక కార్యక్రమాల్లో పార్టీ గుర్తు ప్రదర్శన కూడా !            

డీఎంకే తమిళ ప్రజల్ని మోడర్నైజ్ చేసేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోంది ఇది అన్నదురై కాలం నుంచి జరుగుతోందని లాయర్ సత్యకుమార్ అంటున్నారు. అన్నాదురై, కరుణానిధి కూడా ఆధునిక దుస్తులనే ధరించేవారన్నారు. కాకపోతే వారు సంప్రదాయ ధోతీలకు వెస్ట్రన్ స్టైల్ దుస్తులు ధరించారన్నారు. ఇప్పుడు ఉదయనిధి మొత్తం వెస్ట్రన్ డ్రెస్‌లతోనే అధికార విధుల్లో కనిపిస్తున్నారని అంటున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పార్టీ గుర్తును ప్రదర్శించడం అంటే అది ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని అంటున్నారు. ఈ పిటిషన్‌పై కోర్టులో వాదనలు కొనసాగాల్సి ఉంది. 

తెలంగాణ సీఎం రేవంత్ డ్రెస్ కోడ్ పైనా గతంలో కామెంట్స్                       

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొదట్లో జీన్స్ ప్యాంట్, టీషర్టులతో కనిపించేవారు.  అయితే అధికారిక కార్యక్రమాలకు మాత్రం ఎక్కువగా ప్యాంట్, వైట్ షర్టుల్లోనే వస్తున్నారు. మొదట్లో వివాదం అయింది కానీ.. రాను రాను తెలంగాణ ప్రజలు అలవాటుపడిపోయారు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలన్నదానిపై ఎవరూ కోర్టుకు వెళ్లలేదు. రేవంత్ రెడ్డి యూత్ కాకపోయినప్పటికీ.. సంప్రదాయ రాజకీయ నాయకుల్లా హాఫ్ కోటులు ధరించడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కువగా ఫార్మల్స్ లోనే ఉంటారు. ఉదయనిధిపై లాయర్ సత్యకుమార్ వేసిన పిటిషన్‌పై సానుకూల తీర్పు వస్తే ఇక్కడ కూడా రేవంత విషయంలో ఎవరైనా కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేసే అవకాశం ఉంది.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IT raids on MVV Satyanarayana : వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ ఇళ్లల్లో ఈడీ సోదాలు- దోచుకున్న ఎవర్నీ వదిలేది లేదన్న సీఎం రమేష్
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ ఇళ్లల్లో ఈడీ సోదాలు- దోచుకున్న ఎవర్నీ వదిలేది లేదన్న సీఎం రమేష్
Crime News: ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ దాడి - నిందితుడి కోసం 4 బృందాలతో పోలీసుల గాలింపు
ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ దాడి - నిందితుడి కోసం 4 బృందాలతో పోలీసుల గాలింపు
Rythu Bharosa Scheme: రైతు పెట్టుబడి సాయం వానాకాలంలో ఇవ్వలేం - మంత్రి తుమ్మల కీలక ప్రకటన
వానాకాలం సీజన్ కు రైతు భరోసా లేదు - వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
CM Chandrababu: 'విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం' - అమరావతి మీదుగా బుల్లెట్ రైలు కావాలన్న సీఎం చంద్రబాబు
'విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం' - అమరావతి మీదుగా బుల్లెట్ రైలు కావాలన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ లిక్కర్‌తో హెల్త్ పాడైంది, ఈ రూ.100 మందు బాగుందివీడియో: రూ.50కే కిలో చికెన్, ఇక్కడ అస్సలు తినకండి!!Hamas Chief Yahya Sinwar Killed | హమాస్ చీఫ్‌ సిన్వర్‌ని ఇజ్రాయేల్ ఎలా చంపింది | ABP Desamనటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IT raids on MVV Satyanarayana : వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ ఇళ్లల్లో ఈడీ సోదాలు- దోచుకున్న ఎవర్నీ వదిలేది లేదన్న సీఎం రమేష్
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ ఇళ్లల్లో ఈడీ సోదాలు- దోచుకున్న ఎవర్నీ వదిలేది లేదన్న సీఎం రమేష్
Crime News: ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ దాడి - నిందితుడి కోసం 4 బృందాలతో పోలీసుల గాలింపు
ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ దాడి - నిందితుడి కోసం 4 బృందాలతో పోలీసుల గాలింపు
Rythu Bharosa Scheme: రైతు పెట్టుబడి సాయం వానాకాలంలో ఇవ్వలేం - మంత్రి తుమ్మల కీలక ప్రకటన
వానాకాలం సీజన్ కు రైతు భరోసా లేదు - వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
CM Chandrababu: 'విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం' - అమరావతి మీదుగా బుల్లెట్ రైలు కావాలన్న సీఎం చంద్రబాబు
'విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం' - అమరావతి మీదుగా బుల్లెట్ రైలు కావాలన్న సీఎం చంద్రబాబు
Renault Electric Bike: మార్కెట్లో రెనో ఎలక్ట్రిక్ బైక్ - దీని రేటుతో స్కార్పియోనే కొనేయచ్చు బ్రో!
మార్కెట్లో రెనో ఎలక్ట్రిక్ బైక్ - దీని రేటుతో స్కార్పియోనే కొనేయచ్చు బ్రో!
Hyderabad News: ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత - నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్, సికింద్రాబాద్‌లో ఇంటర్నెట్ నిలిపివేత
ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత - నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్, సికింద్రాబాద్‌లో ఇంటర్నెట్ నిలిపివేత
Elon Musk: ఏఐ ట్యూటర్ జాజ్ ఇస్తున్న ఎలాన్ మస్క్ - గంటకు రూ.ఐదు వేలకు పైగా జీతం!
ఏఐ ట్యూటర్ జాజ్ ఇస్తున్న ఎలాన్ మస్క్ - గంటకు రూ.ఐదు వేలకు పైగా జీతం!
Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం
కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం
Embed widget