Landmine Threats: 'ఇండియాలో ఆ రాష్ట్రాలకు వెళ్లొద్దు'- కెనడా ట్రావెల్ అడ్వైజరీ, భారత్ స్ట్రాంగ్ కౌంటర్!
Landmine Threats: కెనడా తాజాగా జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
Landmine Threats: కెనడా తన పౌరులకు ఇటీవల ఓ విచిత్రమైన ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. పాకిస్థాన్‌తో సరిహద్దులను పంచుకునే భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ప్రయాణాలు మానుకోవాలని తమ పౌరులకు సూచించింది. ఈ అడ్వైజరీపై భారత్ ఘాటుగా స్పందించింది.
వెళ్లొద్దట
భారత్‌లోని గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ప్రయాణాలు మానుకోవాలని కెనడా తన అడ్వైజరీలో పేర్కొంది. ల్యాండ్‌మైన్‌ల ఉనికి, అనూహ్య భద్రతా పరిస్థితుల కారణంగా ఆ రాష్ట్రాల్లో ప్రయాణాలు నివారించాలని సూచించింది. తీవ్రవాద దాడుల ముప్పు కారణంగా భారత్‌లో పర్యటించే కెనడా పౌరులు అధిక స్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు సెప్టెంబరు 27న కెనడా ప్రభుత్వం తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ట్రావెల్ అడ్వైజరీని పోస్ట్ చేసింది.
భారత్ కౌంటర్
కెనడా ట్రావెల్ అడ్వైజరీ, ఖలీస్థాన్‌పై కెనడా రెఫరెండం నిర్వహించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ కౌంటర్ ఇచ్చారు.
అయితే గతవారం భారత్ జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీకి కౌంటర్‌గా కెనడా ఈ సూచనలు చేసినట్టు తెలుస్తోంది. కెనడాలోని భారతీయులు, భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అక్కడ భారత వ్యతిరేక చర్యలు, నేరాలు పెరిగాయని కేంద్రం ఇటీవల అడ్వైజరీ జారీ చేసింది.
Also Read: Abortion Rights Judgement: అబార్షన్ హక్కులపై సుప్రీం సంచలన తీర్పు- ఏం చెప్పిందంటే?
Also Read: R Venkataramani: తదుపరి అటార్నీ జనరల్‌గా ఆర్ వెంకటరమణి