By: ABP Desam | Updated at : 10 Nov 2022 05:27 PM (IST)
Edited By: Murali Krishna
నాన్నకు ప్రేమతో! లాలూకు కిడ్నీ దానం చేయనున్న కుమార్తె!
Lalu's Daughter Roshni: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. అయితే త్వరలోనే ఆయనకు కిడ్నీ మార్పిడి జరగనుంది. ఆయన రెండో కుమార్తె రోహిణీ ఆచార్య కిడ్నీని లాలూకు అమర్చనున్నారు. తండ్రికి కిడ్నీ దానం ఇచ్చేందుకు ఆమె ముందుకు వచ్చారు.
#LaluPrasadYadav's second daughter #RohiniAcharya will donate a kidney to her ailing father who is battling several health complications. pic.twitter.com/1EJqKN4o7a
— IANS (@ians_india) November 10, 2022
సింగపూర్‌లో
లాలూ రెండో కుమార్తె రోహిణీ సింగపూర్‌లో ఉంటున్నారు. లాలూ అక్టోబర్‌లో సింగపూర్ వెళ్లి వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నారు. వారు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలని లాలూకు సూచించారు. దీంతో తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు రోహిణి ముందుకొచ్చారు. అయితే తన ప్రాణం కాపాడుకొనేందుకు కుమార్తె కిడ్నీని స్వీకరించేందుకు లాలూ నిరాకరించినట్లు సమాచారం.
కానీ, కుమార్తె ఒత్తిడి చేయడంతో పాటు, కుటుంబ సభ్యుల కిడ్నీని అమరిస్తే శస్త్రచికిత్స విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో ఆయన అంగీకరించాల్సి వచ్చిందట. ఆపరేషన్ కోసం లాలూ నవంబర్ 20-24 మధ్య సింగపూర్‌కు వెళ్లే అవకాశం ఉంది.
కొన్నేళ్లుగా
గత కొన్నేళ్లుగా తన కిడ్నీ, గుండె సమస్యలకు లాలూ దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఆయనకు సెప్టెంబర్‌లోనే కోర్టు నుంచి అనుమతి వచ్చింది. వైద్య చికిత్స కోసం ఆయన విదేశాలకు వెళ్లొచ్చని దిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది.
అక్టోబర్ 10 నుంచి 25 వరకూ వైద్య చికిత్స కోసం సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని లాలూ.. కోర్టులో ఈ పిటిషన్ వేశారు. ఐఆర్‌సీటీసీ (IRCTC) కుంభకోణంలో లాలూ ప్రసాద్‌పై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుతం లాలూ బెయిల్‌పై ఉన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఐఆర్‌సీటీసీకి చెందిన రెండు హోటళ్ల కాంట్రాక్టులను ఓ ప్రైవేట్ సంస్థకు కేటాయించడంలో అవినీతికి పాల్పనట్టు సీబీఐ ఆరోపించింది. రాంచి, పూరీలోని ఐఆర్‌సీటీసీ హోటళ్లను 2006లో ప్రైవేటు సంస్థలకు అప్పగించడంలో అక్రమాలకు పాల్పడ్డారని రబ్రీ దేవీ, లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్‌పై సీబీఐ అభియోగాలు మోపింది.
ఐఆర్‌సీటీసీ హోటల్ కాంట్రాక్ట్ తమకు వచ్చేలా చేసినందుకు సుజాత హోటల్స్ యజమానులు విజయ్, వినయ్ కొచ్చార్‌లు పట్నా జిల్లాలో మూడు ఎకరాల కమర్షియల్ ప్లాట్‌ను లాలూ కుటుంబానికి ఇచ్చినట్లు అభియోగాలు ఉన్నాయి.
ఈ కేసులో 2019 జనవరిలో లాలూకు బెయిల్ మంజూరైంది. తమ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని కోర్టు షరతులు విధించింది. దీంతో ఆయన విదేశాలకు వెళ్లలేకపోయారు.
Also Read: Tamil Nadu: బాణసంచా కర్మాగారంలో పేలుడు- ఐదుగురు మృతి!
Telangana Power statistics: డిస్కంలకు అప్పులు రూ.80 వేల కోట్లు నిజమే, వాస్తవాలు వెల్లడించిన బీఆర్ఎస్
Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి
Fake Votes in AP: రాప్తాడులో ఆధార్ కార్డు మార్ఫింగ్, దొంగ ఓట్ల నాటకాలు ఆపాలి: ఎమ్మెల్యేపై పరిటాల సునీత ఫైర్
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
ABP Desam Top 10, 9 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
/body>