Tamil Nadu: బాణసంచా కర్మాగారంలో పేలుడు- ఐదుగురు మృతి!
Tamil Nadu: తమిళనాడులో బాణసంచా కర్మాగారంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Tamil Nadu: తమిళనాడులో భారీ ప్రమాదం జరిగింది. మధురై జిల్లాలో ఓ ప్రైవేట్ బాణసంచా ఫ్యాక్టరీలో గురువారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి.
#UPDATE | 5 people dead in the explosion that occurred in a private firecracker factory near Usilambatti in the Madurai district today, confirms SP Madurai.
— ANI (@ANI) November 10, 2022
Further details awaited.
ఇదీ జరిగింది
ఉసిలంబట్టి సమీపంలో బాణసంచా ఫ్యాక్టరీ ఉంది. ఇందులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 10 మందికి గాయాలైనట్లు మదురై ఎస్పీ ధ్రువీకరించారు. పేలుడులో గాయపడిన 10 మందిని జిల్లాలోని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను అమ్మవాసి, వల్లరసు, గోపి, వికీ, ప్రేమగా గుర్తించారు. ఈ బాణసంచా కర్మాగారం వలైయప్పన్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు.
విషయం తెలుసుకున్న వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రాథమిక విచారణ అనంతరం బాణాసంచా ఫ్యాక్టరీ యజమాని వలైయప్పన్ అని పోలీసులు గుర్తించారు. తదుపరి విచారణ జరుగుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

