అన్వేషించండి

కొత్త ఎయిర్‌పోర్ట్‌, లిక్కర్ సేల్స్ - టూరిస్ట్‌లను ఆకర్షించేందుకు లక్షద్వీప్ ప్లాన్

Lakshadweep Tourism: లక్షద్వీప్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

Lakshadweep Tourism Expansion:

లక్షద్వీప్‌లో టూరిజం..

లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్‌ రగడ కొనసాగుతూనే ఉంది. ప్రధాని మోదీపై నోరు పారేసుకున్న మంత్రులపై మాల్దీవ్స్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయినా అక్కడితో ఈ గొడవ ఆగలేదు. మాల్దీవ్స్‌కి పోటీగా లక్షద్వీప్‌ని తీర్చి దిద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీలైనంత త్వరగా ఇక్కడ పర్యాటక రంగాన్ని (Lakshadweep Tourism) అభివృద్ధి చేయాలని చూస్తోంది. ప్రస్తుత వివాదం కారణంగా చాలా మంది ఇండియన్స్ మాల్దీవ్స్ ట్రిప్‌ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ తప్పుని సరిదిద్దుకునేందుకు మాల్దీవ్స్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గూగుల్‌ సెర్చ్‌లో లక్షద్వీప్‌ టాప్‌లోకి వెళ్లిపోయింది. ఇక్కడ టూరిజం రంగాన్ని డెవలప్ చేయడానికి ఇదే సరైన సమయం అని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం...ఇక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఏమేం చేయొచ్చో అధికారులు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతానికి లక్షద్వీప్‌లో అగట్టి ద్వీపంలో ఎయిర్‌ స్ట్రిప్ అందుబాటులో ఉంది. అయితే...పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌లు ల్యాండ్ అయ్యేలా మినికాయ్ ఐల్యాండ్‌లో కొత్తగా ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం. Smart City projectలో భాగంగా కొన్ని చోట్ల హోటల్ ప్రాజెక్ట్‌లకూ అనుమతినిచ్చే యోచనలో ఉంది. విదేశీయులు వచ్చినా సౌకర్యవంతంగా ఉండేలా పెద్ద హోటళ్లు నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. లక్షద్వీప్‌ పర్యాటకంగా అభివృద్ధి చెందాలంటే Minicoy Island చాలా కీలకమైన ప్రాంతం. అందుకే..ఇక్కడే ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని అనుకుంటోంది ప్రభుత్వం. 

లిక్కర్ సేల్స్ కూడా..

టూరిజం డిపార్ట్‌మెంట్‌ అనుమతితో లిక్కర్ సేల్స్‌నీ పర్మిట్ చేయనున్నారు. స్థానికంగా కొబ్బరి చెట్ల నుంచి వచ్చిన నీరాని విక్రయించనున్నారు. లక్షద్వీప్‌లో మొత్తంగా 36 ద్వీపాలున్నాయి. ఇందులో 10 ద్వీపాల్లో మాత్రమే జనాభా ఉంది. చేపలు పట్టడం సహా కొబ్బరి సాగుతో ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. స్వయం సహాయ సంఘాలతో మహిళలు రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక్కడి లైఫ్‌స్టైల్‌ని ప్రపంచానికి పరిచయం చేయాలన్నదీ కేంద్రం ఆలోచన. ఫ్లైట్‌లోనే కాకుండా షిప్‌లోనూ లక్షద్వీప్‌కి చేరుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లు కొచ్చి నుంచి లక్షద్వీప్‌కి సర్వీస్‌లు నడుపుతోంది. అయితే...లక్షద్వీప్‌లో పర్యటించాలంటే మాత్రం స్థానిక ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 

లక్షద్వీప్ దీవులు భారతదేశంలోని అత్యంత అందమైన పర్యాటక ప్రాంతం. చక్కటి బీచ్ లు, చల్లని గాలులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అరేబియా సముద్రంలో ఉంటుంది. సెలవులలో వెకేషన్ కు వెళ్లాలి అనుకునే వాళ్లు ఇక్కడికి వెళ్లవచ్చు. అదీ కూడా మాల్దీవుల కంటే తక్కువ ఖర్చుతో. భారతదేశంలోని ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో లక్షద్వీప్ ఒకటి. 1956లో ఈ ప్రాంతాన్ని భారత ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించింది.లక్షద్వీప్‌కు వెళ్లాలంటే ముందు కేరళలోని కొచ్చిన్ కు చేరుకోవాలి. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి లక్షద్వీప్ అగట్టి ఐలాండ్ కు ఫ్లైట్ అవైలబుల్ ఉంటాయి. ఎంత ముందుగా ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నాం.. ఏ వెబ్ సైట్స్ ఆర్ ఫ్లాట్ ఫామ్స్ నుంచి చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి రేట్స్ ఉంటాయి. తక్కువ రేట్ అయితే రూ.5 వేల నుంచి ఎక్కువ రేట్ అంటే రూ.10 వేల - రూ.15 వేల వరకూ వన్ సైడ్ జర్నీకి ఖర్చవుతుంది. 

Also Read: రన్ తీస్తూ పిచ్‌లోనే కుప్ప కూలిన బ్యాట్స్‌మెన్, గుండెపోటుతో మృతి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd Test Highlights: ఇదేం ఆటరా సామీ! రిషభ్‌ పంత్‌ లేకపోతే పరువు పోయేది!
IND vs NZ 3rd Test Highlights: ఇదేం ఆటరా సామీ! రిషభ్‌ పంత్‌ లేకపోతే పరువు పోయేది!
Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
Viswam OTT : నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
Kamala Harris: చిన్నప్పుడు ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్‌కు కొత్త ప్రత్యర్థి, డ్రోన్లతో వరుసగా దాడులు!‘సుప్రీం జడ్జినే చంపేశారు, చేతకాని పాలకుడు చెత్తపన్ను వేశాడు’వీడియో: చంద్రబాబుకు ముద్దు పెట్టాలని మహిళ ఉత్సాహంParvathipuram Elephants Hulchul | భవన నిర్మాణ కార్మికులను వణికించిన ఏనుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd Test Highlights: ఇదేం ఆటరా సామీ! రిషభ్‌ పంత్‌ లేకపోతే పరువు పోయేది!
IND vs NZ 3rd Test Highlights: ఇదేం ఆటరా సామీ! రిషభ్‌ పంత్‌ లేకపోతే పరువు పోయేది!
Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
Viswam OTT : నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
Kamala Harris: చిన్నప్పుడు ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
Janasena: వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
Kanguva Movie: తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!
తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!
Kadiyam Srihari: వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి కేటీఆర్‌? అందుకే కవిత జైలుకు: కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి కేటీఆర్‌? అందుకే కవిత జైలుకు: కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
Free Gas Cylinder: ఉచితంగా గ్యాస్ సిలిండర్‌ పొందాలంటే ఈ విషయాలు తెలుసుకోండి, అలా చేస్తేనే నగదు జమ
ఉచితంగా గ్యాస్ సిలిండర్‌ పొందాలంటే ఈ విషయాలు తెలుసుకోండి, అలా చేస్తేనే నగదు జమ
Embed widget