News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Akhilesh on Kashmir Files: 'లఖింపుర్ ఫైల్స్' అని సినిమా తీయండి- ఇంకా బాగా ఆడుతుంది: అఖిలేశ్ యాదవ్

లఖింపుర్‌లో జరిగిన హింస్మాతక ఘటనపై లఖింపుర్ ఫైల్స్ అని ఓ చిత్రం తీయాలని సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు.

FOLLOW US: 
Share:

భాజపాపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మరోసారి ఫైర్ అయ్యారు. 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని ప్రచారం చేస్తోన్న భాజపాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీతాపుర్‌లో అఖిలేశ్ మీడియాతో మాట్లాడారు.

" 'ద కశ్మీర్ ఫైల్స్' అని చిత్రం తీసినప్పుడు రైతులను జీపుతో తొక్కి చంపేసిన ఘటనపై 'లఖింపుర్ ఫైల్స్' అని ఓ సినిమా కూడా తీయాలి.                                                           "
-అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత 

వివాదాల్లో

'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై రాజుకున్న రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. ఈ చిత్రంపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూాడా కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నాలు జరిగాయని ప్రధాని మోదీ అన్నారు. 'ద కశ్మీర్ ఫైల్స్' లాంటి చిత్రాలు మరిన్ని రావాలని.. వీటి వల్ల ప్రజలకు నిజాలు తెలుస్తాయని మోదీ ఇటీవల అన్నారు. 

ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు భాజపా అగ్రనేతలు ఈ సినిమాను వెనకేసుకొచ్చారు. ఇలాంటి చిత్రాలు రావాలని ఆకాంక్షించారు. 

కశ్మీర్‌ లోయలో పండిట్లపై జరిగిన దాడులు, వాళ్లని అక్కడి నుంచి తరిమికొట్టిన విధానాన్ని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వెండితెరపై చూపించేందుకు ద కశ్మీర్ ఫైల్స్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 11న ఈ సినిమా విడుదలైంది. 1990లలో జరిగిన వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది.

లఖింపుర్ ఘటన

అయితే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఈ చిత్రన్నా వెనకేసుకొస్తోన్న భాజపాపై విమర్శలు కురిపించారు. 1990-2007 మధ్య కాలమైన 17 ఏళ్లలో కశ్మీర్ పండిట్ల కంటే ఎక్కువ మంది ముస్లింలను హత్య చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. తాజాగా అఖిలేశ్ యాదవ్ కూడా భాజపాను ఇరుకున పెట్టేందుకు 'లఖింపుర్ ఫైల్స్' అని సినిమా తీయాలని పంచ్‌లు వేశారు.

గత ఏడాది అక్టోబర్ 3న కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న రైతులపైకి కేంద్రమంత్రి కుమారుడు అజయ్ మిశ్రా వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు మృతి చెందారు. ఆ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మరో ముగ్గురు మరణించారు.

Also Read: Punjab Anti Corruption Helpline: పంజాబ్‌లో తొలి బంతికే ఆప్ సిక్సర్- డైరెక్ట్‌గా సీఎంకే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు!

Also Read: Snake Stunt Goes Wrong : కోబ్రాలతో గేమ్సా ? ఏం జరుగుతుందో సయ్యద్‌కు బాగా తెలుసు

Published at : 17 Mar 2022 07:18 PM (IST) Tags: samajwadi party Akhilesh Yadav Lakhimpur Kheri incident The Kashmir Files Akhilesh Yadav On Kashmir Files Lakhimpur Files Opposition On The Kashmir Files

ఇవి కూడా చూడండి

Asian Games 2023: ఏసియన్ గేమ్స్‌లో సత్తా చాటిన సిఫత్ కౌర్, రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ - ప్రపంచ రికార్డు

Asian Games 2023: ఏసియన్ గేమ్స్‌లో సత్తా చాటిన సిఫత్ కౌర్, రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ - ప్రపంచ రికార్డు

ఇరాక్‌లో ఓ పెళ్లి వేడుకలో ఘోర అగ్ని ప్రమాదం, 100 మంది సజీవదహనం

ఇరాక్‌లో ఓ పెళ్లి వేడుకలో ఘోర అగ్ని ప్రమాదం, 100 మంది సజీవదహనం

Jaishankar In UNGA: ‘భారత్‌ నుంచి నమస్తే’ - ఐరాసలో మంత్రి జైశంకర్‌

Jaishankar In UNGA: ‘భారత్‌ నుంచి నమస్తే’ - ఐరాసలో మంత్రి జైశంకర్‌

2000 Rupee Notes: రూ.2 వేల రూపాయల నోట్ల మార్పిడికి 3 రోజులే మిగిలుంది, ఇంకా వేల కోట్లు తిరిగి రాలేదు!

2000 Rupee Notes: రూ.2 వేల రూపాయల నోట్ల మార్పిడికి 3 రోజులే మిగిలుంది, ఇంకా వేల కోట్లు తిరిగి రాలేదు!

Ganesh Immersion: వినాయక విగ్రహాలకు క్యూఆర్ కోడ్లు, నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు

Ganesh Immersion: వినాయక విగ్రహాలకు క్యూఆర్ కోడ్లు, నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు

టాప్ స్టోరీస్

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

Bhainsa News: బైంసాలో గణేష్‌ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్‌

Bhainsa News: బైంసాలో గణేష్‌ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్‌

Naga Vamsi MAD Movie : 'జాతి రత్నాలు' కంటే తక్కువ ఒక్కసారైనా తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తా

Naga Vamsi MAD Movie : 'జాతి రత్నాలు' కంటే తక్కువ ఒక్కసారైనా తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తా

రోడ్డుపై అర్ధనగ్నంగా అత్యాచార బాధితురాలు, సాయం కోసం ఇంటింటికీ తిరిగిన బాలిక

రోడ్డుపై అర్ధనగ్నంగా అత్యాచార బాధితురాలు, సాయం కోసం ఇంటింటికీ తిరిగిన బాలిక