KRK - Elon Musk: డియర్ మస్క్ నాకంత టైమ్ లేదు, ఒకేసారి అడ్వాన్స్‌గా కట్టేస్తాను -బ్లూటిక్ పెయిడ్ ఫీచర్‌పై కేఆర్‌కే ట్వీట్
KRK - Elon Musk: ట్విటర్ బ్లూటిక్ పెయిడ్ ఫీచర్‌పై క్రిటిక్ కేఆర్‌కే ట్వీట్ చేశారు.
KRK - Elon Musk:
కేఆర్‌కే ఏమన్నారంటే..
ట్విటర్ సీఈవోగా ఎలన్ మస్క్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోజూ ఏదో ఓ కొత్త అప్‌డేట్ వెలుగులోకి వస్తూనే ఉంది. కొన్ని వార్తలు యూజర్స్‌కి షాక్ ఇస్తే...ఇంకొన్ని ట్విటర్ ఉద్యోగులకే షాక్ ఇచ్చాయి. కంపెనీలో భారీ మార్పులే ఉంటాయని ముందు నుంచి అనుకున్నారంతా. ఇప్పుడు అందుకు అనుగుణంగానే మస్క్ ప్రక్షాళన మొదలు పెట్టారు. ఇందులో...ప్రస్తుతానికి బాగా వినిపిస్తున్న అప్‌డేట్ ట్విటర్ బ్లూ టిక్ కోసం డబ్బులు కట్టడం. వెరిఫైడ్ అకౌంట్‌లు బ్లూ టిక్ కంటిన్యూ చేయాలంటే నెల వారీగా ట్విటర్‌కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దీనిపై పూర్తిస్థాయి కసరత్తు జరుగుతోంది. ట్విటర్ ఉద్యోగులంతా మేధోమథనం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీనిపై ఇప్పటికే ట్విటర్ యూజర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులూ స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే..ప్రముఖ సినీ క్రిటక్, ట్రేడ్ అనలిస్ట్ కేఆర్‌కే ట్విటర్ వేదికగా స్పందించారు. ఎలన్‌మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. "డియర్ ఎలన్ మస్క్. నెలనెలా డబ్బులు కట్టేంత టైమ్ నాదగ్గర లేదు. అడ్వాన్స్‌గా ఐదేళ్లకు ఒకేసారి చెల్లిస్తాను. దయచేసి ఆ పేమెంట్ లింక్ఉంటే పంపండి" అని ట్వీట్ చేశారు.
Dear @elonmusk I don’t have time to pay monthly charges, So I will pay for 5 years in advance. Pls send me the link to pay.
— KRK (@kamaalrkhan) November 1, 2022
Dear @elonmusk pls introduce lifetime membership charges also. Many of us would love to pay for lifetime.
— KRK (@kamaalrkhan) November 2, 2022
వారం రోజుల్లో అందుబాటులోకి..
ఉద్యోగులపై ఒత్తిడి పెంచేందుకు మస్క్ రెడీ అవుతున్నారట. ట్విటర్ మేనేజర్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారట. బ్లూ టిక్ పెయిడ్ ఫీచర్‌ని నవంబర్ 7వ తేదీలోగా లాంచ్ చేయాలని భావిస్తున్నారు ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్. ఇందుకోసం ఎంత కష్టమైనా పడాల్సిందే అని తేల్చి చెప్పారు మస్క్. అవసరమైతే 24X7 పని చేయాలనీ ఆదేశించారు. ఇలా పని చేసేందుకు ఎవరు ఇబ్బంది పడినా ఉద్యోగం మానేయొచ్చని చాలా కచ్చితంగా చెప్పినట్టు సమాచారం. అందుకే...ఇప్పుడు ట్విటర్ ఎంప్లాయిస్‌లో ప్రెజర్ పెరిగిపోతోంది. ఉద్యోగం ఊడుతుందేమోనన్న భయంతో దినదినగండంగా పని చేస్తున్నారు. ఆన్‌టైమ్‌లో పని పూర్తి కాకపోతే...మస్క్ ఆగ్రహంతో ఊగిపోతారట. ప్రస్తుతం బ్లూ టిక్ ఉన్న వాళ్లు త్వరలోనే వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందట! నెలకు 4.99 డాలర్లతో ఆప్షనల్ ప్లాన్ ఉంటుందని తెలిసింది. ఇందులో కొన్ని అదనపు ఫీచర్లు ఇస్తారని సమాచారం. కొత్తగా బ్లూ టిక్ కావాలని కోరుకునేవాళ్లకు 19.99 డాలర్లు ఫీజు వసూలు చేయనున్నారని వెర్జ్ రిపోర్టు చేసింది ఇప్పుడీ ప్లాన్‌లో ఉన్నవారు 90 రోజుల్లోగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని లేదంటే చెక్ మార్క్ తొలగిస్తారని కంపెనీ ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారని తెలిసింది. కొత్త ఫీచర్ కోసం కొందరు ఉద్యోగులను నియమించారు. బ్లూటిక్ కోసం చేసుకునే సబ్‌స్క్రిప్షన్ ఛార్జ్‌ను కూడా పెంచుతారని అంటున్నారు. గతేడాది జూన్‌లో ట్విటర్ బ్లూని మొదలు పెట్టారు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌లు అందుబాటులో ఉంటాయి.