News
News
వీడియోలు ఆటలు
X

Krishna District Crime News: అరకోటికిపైగా అప్పు చేసిన కుమారుడు - రోకలి బండతో కొట్టి చంపిన తల్లి

Krishna District Crime News: అరకోటికి పైగా అప్పులు చేసి వాళ్లను ఇంటిచుట్టూ తిప్పుంచుకుంటుంగా.. పరవు పోయిందని భావించిన కన్నతల్లి సొంత కుమారుడిని చంపేసింది. రోకలి బండతో కొట్టి అంతమొందించింది. 

FOLLOW US: 
Share:

Krishna District Crime News: అరకోటికిపైగా అప్పులు చేశాడు. ఇచ్చిన వాళ్లు డబ్బులు తిరిగివ్వమంటూ ఇంటిమీదకు వస్తున్నారు. కొడుకు చేసిన ఈ పనితో.. తల్లిదండ్రులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. తరచుగా అప్పుల వాళ్లు ఇంటికి రావడం, పరువు పోతుందని భావించిన ఆ తల్లి.. కన్న కొడుకునే అంతమొందించాలనుకుంది. ఈక్రమంలోనే పడుకొని ఉన్న కుమారుడిని రోకలి బండతో మోది హత్య చేసింది. తనకు ఏం తెలియదన్నట్లు నాటకమాడినా... చివరకు పోలీసులకు దొరికిపోయింది. 

అసలేం జరిగిందంటే..?

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ఉంగటూరు మండలం పెద్దఅవుటపల్లికి చెందిన 29 ఏళ్ల ఉప్పలపాటి దీప్ చంద్ గృహోపకరణాల పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఇంకా పెళ్లి కాలేదు. తల్లిదండ్రులతోనే కలిసి జీవిస్తున్నాడు. డ్రైవర్ గా పని చేసే తండ్రి తెల్లవారు జామున 5 గంటలకే విధులకు వెళ్లాడు. ఆ తర్వాత కాసేపటికే తల్లి రమాదేవి పాలు తీసేందుకని బయటకు వెళ్లి తరిగొచ్చే సరికి.. దీప్ చంద్ ఇంట్లో తీవ్ర గాయాలతో చనిపోయి ఉన్నట్లు తల్లి చెబుతోంది. రక్తపు మడుగులో పడి ఉన్న  కుమారుడిని చూసి ఆ కన్నతల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆశ్చర్యపోయే విషయం తెలిసింది. 

కన్నతల్లే కుమారుడిని చంపేసిందనే విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు చేపట్టిన ఈ దర్యాప్తులో దీప్ చంద్ 50 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడని తేలింది. ఇప్పు ఇచ్చిన వారు కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. కుమారుడు చేసిన అప్పుల కారణంగా కుటుంబ కలహాలు మొదలు అయ్యాయి. ఈ నేపథ్యంలో కుమారుడు అప్పులు ఎక్కువై మరింత ఒత్తిడికి గురవుతున్నామని భావించిన తల్లి రమాదేవి ఇంట్లోని రోకలి బండతో నిద్రమత్తులో ఉన్న కుమారుడిని తలపై మోదిందని తేలింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘనటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు రమాదేవిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ విజయ్ పాల్ స్పష్టం చేశారు. 

పదిహేను రోజుల క్రితం కట్టుకున్నదాన్నే కడతేర్చిన భర్త

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ లో ఉమామహేశ్వరి(23), అతని భర్త చెంగయ్య(27) లు నివాసం ఉంటున్నారు. అయితే వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతిరూపంగా రితికా(7), జగదీష్(5)లు ఉన్నారు. చెంగయ్య బేల్ధారుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పెళ్లయి‌ ఎనిమిది సంవత్సరాల వరకు దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే చెంగయ్యకు ఇటీవల భార్య ఉమామహేశ్వరిపై అనుమానం కలిగింది. అంతే‌కాకుండా తన భార్య మరోకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని భ్రమ పడిన చెంగయ్య తరచూ భార్యను వేధింపులకు గురి చేసేవాడు. కనీసం భార్యను పుట్టింటికి కూడా పంపేవాడు కాదు.. 
బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళతో‌ సైతం భార్యను మాట్లాడనిచ్చేవాడు కాదు.

ఎవరితో మాట్లాడినా వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నావని ఉమామహేశ్వరిని వేధింపులకు గురి చేసేవాడు. ఇలా ఉండగా పని పూర్తి చేసుకుని‌ ఇంటికి వస్తే తరచూ భార్యతో గొడవకు‌ దిగ్గేవాడు చెంగయ్య. ఆదివారం సంక్రాంతి ‌పండుగ కావడంతో ఇద్దరూ ‌పిల్లలను మహేశ్వరీ‌ తన పుట్టినింటికి పంపింది. అయితే ఇంట్లో ఎవరూ‌లేక పోవడంతో భార్యతో చెంగయ్య గొడవపడ్డాడు. అయితే ఇద్దరూ మధ్య మాటల యుద్దం జరిగింది. కోపోద్రిక్తుడైన చెంగయ్య తన ఇంటిలో ఉన్న కర్రను తెచ్చిన భార్య తలపై మోదాడు. దీంతో రక్రస్రావం కావడంతో ఉమామహేశ్వరీ సంఘటన స్ధలంలోనే‌ మృతి చెందింది.   

Published at : 09 Feb 2023 11:23 AM (IST) Tags: AP Crime news Latest Murder Case Krishna District Crime News Mother Murdered Son Mother Killed Son

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: సైకిల్ ఎక్కబోతున్న ఆ ముగ్గురు, సరూర్‌నగర్‌ హత్య కేసులో సాయికృష్ణ హాంగామా

Top 10 Headlines Today: సైకిల్ ఎక్కబోతున్న ఆ ముగ్గురు, సరూర్‌నగర్‌ హత్య కేసులో సాయికృష్ణ హాంగామా

పని చేసే నాయకుడిని దీవించండి- కూకట్‌పల్లి ప్రజలకు హరీష్‌ విజ్ఞప్తి

పని చేసే నాయకుడిని దీవించండి- కూకట్‌పల్లి ప్రజలకు హరీష్‌ విజ్ఞప్తి

Wrestlers Protest: సమస్యలు తీరితేనే ఏషియన్ గేమ్స్‌లో ఆడతాం, మానసికంగా కుంగిపోయాం - సాక్షి మాలిక్

Wrestlers Protest: సమస్యలు తీరితేనే ఏషియన్ గేమ్స్‌లో ఆడతాం, మానసికంగా కుంగిపోయాం - సాక్షి మాలిక్

ABP Desam Top 10, 10 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 10 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

BDL Jobs: భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 12 డిప్యూటీ మేనేజర్ & అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు!

BDL Jobs: భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 12 డిప్యూటీ మేనేజర్ & అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు!

టాప్ స్టోరీస్

Telangana Poltics : తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతుంది ?

Telangana Poltics :  తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా  చక్కదిద్దుతుంది ?

Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం - దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !

Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం -  దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Saroor Nagar Murder Case: పోలీసులనే భయపెట్టిన అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ- పరువు కోసం చంపేసినట్టు స్టేట్‌మెంట్

Saroor Nagar Murder Case: పోలీసులనే భయపెట్టిన అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ- పరువు కోసం చంపేసినట్టు స్టేట్‌మెంట్