అన్వేషించండి

Kodali Nani: చంద్రబాబు ఒక్క ఎకరమైనా ఇచ్చి ఉంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కొడాలి నాని

దమ్ముంటే చంద్రబాబు గుడివాడలో పోటీ చేయాలని సవాల్ విసిరారు కొడాలి నాని. తానుచంద్రబాబు మాటలు విని ఉంటే చరిత్ర హీనుడ్ని అయ్యే వాడినని వ్యాఖ్యానించారు. గుడివాడ ప్రజల కోసం చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు

Kodali Nani: గుడివాడలో పేదల ఇళ్ల నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చలవే అన్నారు ఎమ్మెల్యే కొడాలి నాని. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో జగన్‌తో కలిసి పాల్గొన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న వైఎస్‌ కలను నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ద్వారా నెరవేరుతతోందని అన్నారు. గుడివాడలో మంగాయాపాలెంలో టిడ్కో గృహాల పంపిణీ చేపట్టడానికి గుడివాడ వచ్చిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు నాని. రూ.800 కోట్ల ప్రాజెక్టుకు గత ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం రూ.180 కోట్లు మాత్రమే చెల్లించారని పేర్కొన్నారు. అందులో కూడా రూ.160 కోట్లు కేంద్రమే ఇచ్చిందని అన్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే రూ.400 కోట్లు ఈ ప్రాజెక్టుకు కేటాయించారని చెప్పుకొచ్చారు నాని. కానీ చంద్రబాబు గుడివాడ వచ్చిన ప్రతీసారి కబుర్లు చెప్పి వెళ్లిపోతాడని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ సొంత ఊరు గుడివాడకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు కొడాలి నాని. 

దమ్ముంటే గుడివాడలో పోటీ చేయాలి: కొడాలి నాని

ఈ కార్యక్రమంలో కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. దమ్ముంటే చంద్రబాబు గుడివాడలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో వేసిన రోడ్లు మూడు నెలలకే గుంతలు పడ్డాయని విమర్శించారు. తాను కూడా చంద్రబాబు మాటలు విని ఉంటే చరిత్రహీనుడ్ని అయ్యే వాడినని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదలకు లక్ష ఎకరాలను ఇంటి స్థలాల కోసం సీఎం జగన్ ఇచ్చారని చెప్పారు. ఆ ఇళ్ల కోసం రూ.15 లక్షల కోట్లు వెచ్చిస్తున్నారన్న ఆయన గుడివాడ ప్రజల కోసం చంద్రబాబు ఒక ఎకరం కూడా కొనుగోలు చేసినట్టు చూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.

టిడ్కో ఇళ్ల కోసం 320 కి.మీ పాద యాత్ర చేసిన కొడాలి నాని..

గుడివాడలో 20 ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద ప్రజలకు టిడ్కో గృహాల ద్వారా సొంతింటి కల తీరనుంది. గుడివాడ నియోజకవర్గం పరిధిలో దాదాపు 10 వేల మందిపైగా పేదలకు ఇళ్ల స్థలాల కోసం 2007 లో పాదయాత్ర చేశారు కొడాలి నాని. అప్పట్లో గుడివాడ నుంచి హైదరాబాద్ వరకూ 320 కి.మీ పాద యాత్ర చేశారు. అప్పటి సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పేదలకు ఇళ్ల పై వినతిపత్రం అందజేశారు. రెండోసారి సీఎం అవ్వగానే మల్లాయపాలెంలో 77.46 ఎకరాలను సేకరించి పేదలకు పంపిణీ చేశారు. ఆ ఇళ్ల నిర్మాణం ఇప్పటికి పూర్తి అవ్వడంతో నేడు పేదలకు సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు. ఈ ఇళ్ళ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.799.19 కోట్లు ఖర్చు చేసింది. టిడ్కో ఇళ్లకు అదనంగా మరో 178.63 ఎకరాలు సేకరించి మొత్తం 7,728 మంది పేదలకు పంపిణీ చేయనున్నారు. 

గుడివాడ శివారు మ‌ల్లాయ‌పాలెంలో టిడ్కో ద్వారా నిర్మించిన ఇళ్లను నేడు సీఎం జ‌గ‌న్ పేదలకు అందించారు. ఇక్కడ 77.46 ఎకరాలలో ఒకే చోట 8 వేల 912 టిడ్కో ఇళ్లు నిర్మాణం చేపట్టి రాష్ట్రంలోనే అతిపెద్ద లే అవుట్ ను నిర్మించింది. సీఎం పర్యటన నేపథ్యంలో సభాప్రాంగణంతో పాటు లే అవుట్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లా నాయకులు. ఈ మేరకు ఉద‌యం తాడేప‌ల్లి నివాసం నుంచి బ‌య‌లుదేరి మ‌ల్లాయ‌పాలెం లే అవుట్‌కు చేరుకొన్నారు జగన్‌. హెలిపాడ్ నుంచి టిడ్కో ఇళ్ల సముదాయానికి చేరుకొని అక్కడ ఉన్న ఫ్లాట్లను పరిశీలించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. సీఎంకు మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రి జోగి రమేష్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, వల్లభనేని వంశీ తదితరులు స్వాగతం పలికారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
Pushpa 2 Music Director: ‘పుష్ప 2’ సినిమానే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియానే! - లిస్టేంటి ఇంత ఉంది?
‘పుష్ప 2’ సినిమానే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియానే! - లిస్టేంటి ఇంత ఉంది?
Prabhas: ప్రభాస్‌తో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్... 'సలార్ 2' నుంచి మొదలు పెడితే - హోంబలే నుంచి బిగ్ అప్డేట్
ప్రభాస్‌తో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్... 'సలార్ 2' నుంచి మొదలు పెడితే - హోంబలే నుంచి బిగ్ అప్డేట్
Embed widget