By: ABP Desam | Updated at : 16 Jan 2023 05:52 PM (IST)
సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలి - సీజేఐకు కేంద్ర న్యాయమంత్రి లేఖ ! ( Image Source : File Photo/PTI )
Supreme Court Vs Central Governament : కొలీజియంలో కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిని చేర్చుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు ఓ లేఖ రాశారు. ఇలా చేయడం వల్ల పాతికేళ్ల క్రితం ఏర్పాటైన ప్యానెల్‌లో పారదర్శకతతోపాటు జవాబుదారీని నిర్ధారిస్తుందని మంత్రి సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో.. హైకోర్టు , సుప్రీంకోర్టు కొలీజియంలో మార్పుల ద్వారా న్యాయమూర్తుల నియామకాల రాజ్యాంగ ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని సూచించారు. "పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం" అవసరమని కిరణ్ రిజిజు ఆ లేఖలో పేర్కొన్నారు.
కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలంటున్న కేంద్రం
గతేడాది నవంబర్‌లో ఇదే కిరణ్ రిజిజు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని ఆరోపణలు చేశారు. హైకోర్టులో న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలన్నారు. దేశంలోని అన్ని హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకాలతో పాటు బదిలీల ప్రక్రియను ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని కొలీజియం చూస్తున్నది. అయితే ఈ విధానంపై కేంద్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత, ఆబ్జెక్టివిటీ, సామాజిక వైవిధ్యం లోపించడంపై వివిధ వర్గాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందుతున్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తరచూ వాదిస్తున్నారు.
కొలిజీయం ఎంపిక చేస్తున్న న్యాయమూర్తుల ఎంపికపై కేంద్రం అసంతృప్తి
అన్ని వర్గాల వారికి సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని కూడా కిరణ్ రిజుజు ఆరోపిస్తున్నారు. నేపథ్యంలో కొలీజియంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పెద్దరికానికి చెక్ పెట్టేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పావులు కదిపుతోందన్న ప్రచారం జరుగుతోంది. కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని చేర్చేందుకు చర్చలు చేపట్టింది. దీనిలో భాగంగానే కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌కు లేఖ రాశారు. కేంద్రం చేసిన సూచనలను సుప్రీంకోర్టు ఆమోదిస్తుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కొలీజియం సిఫార్సులపై ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోని కేంద్రం
న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్రం పూర్తి స్థాయిలో ఆమోదించడం లేదు. డిసెంబర్ నాటికి హైకోర్టుల నుంచి వచ్చిన 154 ప్రతిపాదనలు ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు కొలీజియంకు మధ్య వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఖాళీలను త్వరగా భర్తీ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవీ విరమణ, రాజీనామా లేదా పదోన్నతి, న్యాయమూర్తుల సంఖ్య పెరగడం వల్ల న్యాయమూర్తుల ఖాళీలు తలెత్తుతూనే ఉన్నాయని కేంద్ర మంత్రి చెబుతున్నారు, కొలీజియం లో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలన్నదానిపై ఇప్పుడు విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం న్యాయవ్యవస్థకు అత్యంత కీలకం అయ్యే అవకాశం ఉంది. ల
దేశ రాజకీయాలను మలుపు తిప్పనున్న ఖమ్మం సభ - మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
Union Budget 2023: బడ్జెట్ ప్రవేశ పెట్టడంలో ఈ ఆర్థిక మంత్రుల రికార్డే వేరు!
Weather Update: ఏపీలో వర్షాలు పడతాయా- తెలంగాణ చలి పెరుగుతుందా?
Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్లో Adani Enterprises, Sun Pharma
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!
ABP Desam Top 10, 1 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం