Kim Jong Un Daughter: కిమ్ జోంగ్ కూతురుని చూశారా, చేయి పట్టుకుని నడిపిస్తున్న ఫోటో వైరల్
Kim Jong Un Daughter: కిమ్ జోంగ్ ఉన్ తన కూతురుని తొలిసారి ప్రపంచానికి పరిచయం చేశారు.
Kim Jong Un Daughter:
ఆ ప్రయోగం లాంచింగ్‌కి వచ్చిందట..
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన లీడర్. అందరూ ఆయనను డిక్టేటర్ అని పిలుస్తారు. ఎంతో మంది శత్రువుల్ని సంపాదించుకున్న కిమ్ జోంగ్..తన జీవితాన్ని అత్యంత రహస్యంగా గడిపేస్తుంటారు. ఆయన కుటుంబ సభ్యుల గురించి కూడా ప్రపంచానికి తెలిసింది తక్కువే. కిమ్ జోంగ్ తరవాత ఎక్కువగా కనిపించేది...ఆమె చెల్లెలు మాత్రమే. అయితే...ఇన్నాళ్లకు ఆయన కుటుంబంలోని ఓ ముఖ్యమైన వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేశాడు కిమ్. ఆయన కూతురు చేయి పట్టుకుని కిమ్ నడుస్తూ వస్తున్న ఫోటో వైరల్ అవుతోంది. సౌత్ కొరియా న్యూస్ ఛానల్స్ అన్నీ ఈ ఫోటోని బాగా సర్క్యులేట్ చేస్తున్నాయి. మిలిటరీ ఆయుధాలను తన కూతురుకి చూపించేందుకు కిమ్ ఇలా బయటకు తీసుకొచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే...కిమ్ కూతురు పేరుని మాత్రం ఏ ఛానల్ వెల్లడించలేదు. దాన్ని మాత్రం రహస్యంగానే ఉంచేశారు. అక్కడి మీడియా చెబుతున్న సమాచారం ప్రకారం...కిమ్ తన కూతురుకి బాలిస్టిక్ మిసైల్ లాంచింగ్‌ను దగ్గరుండి మరీ చూపించారట. నార్త్ కొరియాలోని ప్యోన్‌గ్యాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి హైటెక్, లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్‌ను ప్రయోగించినట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. బహుశా...ఈ లాంచింగ్‌ను చూపించేందుకు తన కూతురుతో కలిసి కిమ్ అక్కడికి వచ్చి ఉంటారని అంటున్నారు. కూతురితో పాటు...కిమ్ భార్య కూడా అక్కడికి వచ్చిందట. క్షిపణి ప్రయోగం సక్సెస్ అవగానే...కిమ్ కూతురు సంతోషంతో చప్పట్లు కూడా కొట్టిందని అక్కడి మీడియా చెబుతోంది.
అంతా రహస్యమే..
కిమ్ భార్య పేరు రి సాల్. వాళ్లిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకున్నారనేది ఇప్పటికీ రహస్యమే. 2012 జులై వరకూ అసలు ఆయనకు పెళ్లైందన్న విషయం కూడా ప్రపంచానికి తెలియలేదు. 2012లో కిమ్ భార్య గర్భం దాల్చారు. అప్పుడే వాళ్ల పెళ్లి గురించి తెలిసింది. 2018లో నార్త్ కొరియా... కిమ్ సతీమణికి "ఫస్ట్ లేడీ" బిరుదుని ఇచ్చింది. సౌత్ కొరియా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వివరాల ప్రకారం...కిమ్‌కి ముగ్గురు పిల్లలున్నట్టు తెలుస్తోంది.
క్షిపణి ప్రయోగాలు..
ఇప్పటివరకు అప్పుడప్పుడూ క్షిపణి ప్రయోగాలు చేసే ఉత్తర కొరియా.. తాజాగా ఒకేసారి 10 బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించింది. వీటిల్లో కొన్ని దక్షిణ కొరియా సముద్ర జలాల్లో పడ్డాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ఉత్తర కొరియా చేపట్టిన క్షిపణి ప్రయోగాలకు దక్షిణ కొరియా తీవ్రంగా స్పందించింది. ఉత్తర కొరియాపై మూడు క్షిపణులను ప్రయోగించింది. తమ భూభాగంపైకి పదికి
పైగా క్షిపణులు ప్రయోగించిన గంటల్లోనే ఈ ప్రయోగం జరిగింది. అణ్వాయుధ పరీక్షను మరికొన్ని వారాల్లో నిర్వహించేందుకు ఉత్తర కొరియా సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే కిమ్ జోంగ్ ఉన్ అణు హెచ్చరికలు చేయడం కొత్తేం కాదు. అణు యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కిమ్ గతంలోనే ప్రకటించారు. అమెరికాకు పరోక్ష హెచ్చరికలు చేశారు.
Also Read: Sandalwood Policy 2022: అక్కడి రైతులు ఎర్రచందనం సాగు చేయొచ్చు, ఓపెన్‌గా అమ్ముకోవచ్చు కూడా