అన్వేషించండి

అయోధ్యలో KFC పెట్టుకోవచ్చు, కానీ ఒక కండీషన్ - తేల్చి చెప్పిన అధికారులు

KFC in Ayodhya: వెజ్‌మాత్రమే విక్రయించేటట్టైతే అయోధ్యలో KFC స్టాల్ పెట్టుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

KFC Outlet in Ayodhya: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం తరవాత పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. లక్షలాది మంది భక్తులు అయోధ్యకి తరలి వస్తున్నారు. ఫలితంగా...నగరమంతా మిగతా వ్యాపారాలు క్రమంగా పెరుగుతున్నాయి. భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుండడం వల్ల రకరకాల ఫుడ్‌స్టాల్స్ వెలుస్తున్నాయి. వెజిటేరియన్ ఫుడ్‌ స్టాల్స్ పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. అయోధ్యని దర్శించేందుకు వచ్చిన వాళ్లు ఇక్కడ అన్ని రకాల రుచుల్ని ఆస్వాదిస్తున్నారు. రామ మందిరానికి కిలోమీటర్‌ దూరంలోనే ఇవి ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలోనే KFC కూడా ఇక్కడ ఔట్‌లెట్‌ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. అయితే... పవిత్రమైన అయోధ్య క్షేత్రంలో KFC ఎలా పెడతారన్న వాదనలు వినిపించాయి. Panch Kosi Parikrama కి సమీపంలో ఫుడ్‌స్టాల్స్ పెట్టుకోడానికి ప్రభుత్వం అనుమతినిస్తున్నప్పటికీ మాంసాహారం విక్రయించడానికి మాత్రం వీల్లేదని తేల్చి చెప్పింది. మద్యం అమ్మకాలూ కుదరవని స్పష్టం చేసింది. 

"అయోధ్యలో బడా ఫుడ్‌ చైన్ ఔట్‌లెట్స్ పెట్టుకోడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేం వాళ్లని సాదరంగా స్వాగతిస్తాం. కానీ...కొన్ని కండీషన్స్ పాటించాలి. ఆ స్టాల్స్‌లో మాంసాహారం విక్రయించకూడదు. మద్యం విక్రయాలకూ వీల్లేదు"

- ప్రభుత్వ అధికారి

ప్రస్తుతానికి  Parikrama Marg కి వెలుపల KFC ఔట్‌లెట్స్ ఉన్నాయి. అయోధ్య లక్నో హైవేపై అందుబాటులోకి వచ్చాయి. నిజానికి అయోధ్యలోనే ఏర్పాటు చేయాలని KFC భావించినా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. శాకాహారం మాత్రమే విక్రయిస్తే KFC కూడా స్టాల్‌ పెట్టుకోవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే..దీనిపై KFC ఇంకా స్పందించలేదు. రామ మందిరానికి దగ్గర్లో ఉంటేనే తమ మార్కెట్ బాగుంటుందని చాలా వరకూ సంస్థలు భావిస్తున్నాయి. రామ మందిరానికి 8 కిలోమీటర్ల దూరంలో పిజా హట్‌ ఏర్పాటైంది. ఇక్కడ మంచి డిమాండ్ ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. 

 జనవరి 23 నుంచి అయోధ్య రామాలయం (Ram Mandir in Ayodhya)లో భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. దాంతో అయోధ్యకు భక్తులు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. తొలి వారంలోనే, అది కూడా మొదటి ఆరు రోజుల వ్యవధిలోనే అయోధ్య రామ మందిరాన్ని 18.75 లక్షల మంది యాత్రికులు సందర్శించారు. జన్మభూమిలో రామయ్య కొలువు తీరడంతో అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రామ్ లల్లా పవిత్రోత్సవం తరువాత దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. అయోధ్య బాలరాముడ్ని కనులారా చూసేందుకు, స్వామి వారి సేవలో పాల్గొనేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారని అధికారులు తెలిపారు. 23 జనవరిన 5 లక్షల మంది భక్తులు అయోధ్య రామాలయాన్ని దర్శించుకోగా, 24 జనవరి రోజు 2.5 లక్షలు, 25 జనవరి 2 లక్షలు, 26 జనవరి 3.5 లక్షలు, 27 జనవరి 2.5 లక్షల మంది, 28 జనవరి 3.25 లక్షల మంది అక్కడికి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. అప్పటి నుంచి ఈ పర్యాటకుల తాకిడి పెరుగుతూనే ఉన్నట్టు ట్రస్ట్ నిర్వాహకులు వెల్లడించారు. 

Also Read: మంచి పనులు చేసిన వారికి ఎప్పుడూ గౌరవం ఉండదు - నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK vs MI: ముంబైని మడతపెట్టిన అహ్మద్ ద్వయం, చెన్నై ముందు మోస్తరు టార్గెట్
IPL 2025 CSK vs MI: ముంబైని మడతపెట్టిన అహ్మద్ ద్వయం, చెన్నై ముందు మోస్తరు టార్గెట్
IPL Highest Scores: రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
CM Chandrababu: అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP DesamSRH vs RR IPL 2025 Match Preview | రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK vs MI: ముంబైని మడతపెట్టిన అహ్మద్ ద్వయం, చెన్నై ముందు మోస్తరు టార్గెట్
IPL 2025 CSK vs MI: ముంబైని మడతపెట్టిన అహ్మద్ ద్వయం, చెన్నై ముందు మోస్తరు టార్గెట్
IPL Highest Scores: రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
CM Chandrababu: అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
SRH Vs RR Result Update:  స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. ఈ సీజ‌న్లో సొంత‌గ‌డ్డ‌పై గెలిచిన‌ తొలి జ‌ట్టు.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
Sikandar Trailer: కండలవీరుడు సల్మాన్ ఖాన్ యాక్షన్ గూస్ బంప్స్ - 'సికిందర్' మూవీ ట్రైలర్ వచ్చేసింది
కండలవీరుడు సల్మాన్ ఖాన్ యాక్షన్ గూస్ బంప్స్ - 'సికిందర్' మూవీ ట్రైలర్ వచ్చేసింది
Kishan Reddy: డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
Embed widget