Kejriwal House Renovation: కేజ్రీవాల్ "ఇంటి" చుట్టూ రాజకీయాలు, ఆప్ బీజేపీ మధ్య పొలిటికల్ వార్
Kejriwal House Renovation: అరవింద్ కేజ్రీవాల్ ఇంటి చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి.
Kejriwal House Renovation:
ఇంటి రెనోవేషన్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ "ఇంటి" చుట్టూ రాజకీయాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆప్ వర్సెస్ బీజేపీ వార్ గట్టిగానే జరుగుతోంది. ఇప్పుడు కేజ్రీవాల్ ఇంటి గురించి ఆ వాదం ఇంకాస్త ముదిరింది. ఇల్లు బాగు చేసుకునేందుకు కేజ్రీవాల్ రూ.45 కోట్లు ఖర్చు చేశారంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. కేజ్రీవాల్‌కి ఇన్ని విలాసాలెందుకు..? అని ప్రశ్నిస్తోంది. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ఆ డబ్బుతోనే విలాసవంతమైన ఇళ్లు కట్టుకుంటున్నారని మండి పడుతోంది. దీనిపై ఆప్ కూడా గట్టిగానే బదులిస్తోంది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్ నివసిస్తున్న ఇల్లు 80 ఏళ్ల క్రితం కట్టారని చెప్పారు. పైకప్పు పూర్తిగా పాడైపోయినందునే రెనోవేషన్ చేస్తున్నామని స్పష్టం చేశారు.
"ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్ నివసిస్తున్న ఇల్లు 80 ఏళ్ల క్రితం కట్టింది. సీఎం తల్లిదండ్రులు ఉంటున్న రూమ్ పై కప్పు కూలిపోయింది. సీఎం ఉండే రూమ్‌లోనూ పైకప్పు పెచ్చులూడుతోంది. అధికారులతో భేటీ అయ్యే రూమ్‌లోనూ ఇదే పరిస్థితి. అందుకే PWD విభాగం ఇంటిని రెనోవేట్ చేసుకోవాలి సూచించింది. ఆ సూచనల ప్రకారమే బంగ్లాలో మార్పులు చేస్తున్నారు"
- సంజయ్ సింగ్, ఆప్ ఎంపీ
मित्र डॉनल्ड ट्रम्प की 3 घंटे की विज़िट के लिए 80 करोड़ खर्च दिया। गुजरात और मध्यप्रदेश के मुख्यमंत्री अपने लिए 200 करोड़ के हवाई जहाज़ ले लेते हैं। मजाल है कोई चैनल इस पर डिबेट कर ले।
— Priyanka Kakkar (@PKakkar_) April 25, 2023
अरविंद केजरीवाल जी को 1942 में बना 1 एकड़ से भी छोटा बँगला एलोट किया जिसकी छत्ते 3 बार गिर… pic.twitter.com/GJZkSp60rD
ఖర్చైంది ఇంత..
బీజేపీ మాత్రం కేజ్రీవాల్ ఇంటి కోసం రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ విమర్శలు చేస్తోంది. అయితే..ప్రస్తుతం అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఇంటీరియర్ డెకరేషన్ కోసం రూ. 11.30 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక స్టోన్, మార్బుల్ ఫ్లోరింగ్ కోసం రూ.6 కోట్లు, ఇంటీరియర్ కన్సల్టెన్సీకి రూ.కోటి ఖర్చు చేయనున్నారు. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌ల కోసం రూ.2.58కోట్లు, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ కోసం రూ.2.85 కోట్లు, వార్డ్‌రోబ్‌కి రూ.1.41 కోట్లు, కిచెన్ అప్లియనెస్స్ కి రూ.1.1కోట్లు ఖర్చు చేస్తున్నారని వెల్లడించారు అధికారులు. 2020 సెప్టెంబర్ 9వ తేదీ నుంచి 2022 జూన్ మధ్య కాలంలో ఈ ఖర్చులు చేసినట్టు స్పష్టం చేశారు. అయితే...బీజేపీ మాత్రం విమర్శలు ఆపడం లేదు. దీనిపై ఆప్ నేతలు ఓ సవాల్ విసిరారు. బీజీపీ వాళ్లే నేరుగా ఇంటికి వచ్చి చెక్ చేసుకోవాలని, నిజంగా అందుకు రూ.45 కోట్లు ఖర్చైందో లేదో డిబేట్ పెట్టాలని ఛాలెంజ్ చేశారు.
An amount worth Rs. 45 crore has been spent for the renovation of Maharaj's (Kejriwal's) palace.
— BJP (@BJP4India) April 26, 2023
The palace has been beautified with the curtains worth Rs 8 lakh each.
Ironically, the people who came hanging in autos for taking oath, who used to deny taking car, taking house… pic.twitter.com/UyR208Xtkt
Also Read: Delhi School Bomb Threat: స్కూల్లో బాంబు పెట్టామంటూ మెయిల్,బయటకు పరుగులు తీసిన విద్యార్థులు