అన్వేషించండి

అత్యాశకు పోయి అరెస్ట్ అయ్యాడు, కేజ్రీవాల్‌పై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు

Kejriwal Arrest: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు.

Kejriwal Arrest News: లోక్‌పాల్‌ ఉద్యమనేత అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించారు. మద్యానికి దూరంగా ఉండాలని తాను ఎన్నో సార్లు చెప్పినట్టు గుర్తు చేశారు. డబ్బుకి ఆశపడి కేజ్రీవాల్ ప్రత్యేకంగా ఓ పాలసీయే చేశారని అన్నారు. అటు ప్రతిపక్షాలు కేజ్రీవాల్‌కి మద్దతుగా నిలబడుతుండగా..అన్నా హజారే మాత్రం ఆప్‌ అసలు ఆ పాలసీ రూపొందించకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 

"మద్య నిషేధంపై నాతో పాటు ఉద్యమం చేసి, నా వెన్నంటే ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడిలా లిక్కర్ పాలసీ స్కామ్‌లో అరెస్ట్ అవడం చాలా బాధగా ఉంది. కానీ మనమేం చేయగలం. ఏం జరిగినా అది చట్ట ప్రకారమే జరిగింది"

- అన్నా హజారే, సామాజిక కార్యకర్త 

 

2011లో అవినీతి వ్యతిరేకంగా అన్నా హజారే (Anna Hazare) భారీ ఉద్యమం చేశారు. ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఆయనతో పాటే ఉద్యమించారు. అప్పుడే కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. రాజకీయాల్లోకి వెళ్లడం ఇష్టం లేని అన్నా హజారే కేజ్రీవాల్‌కి బయట నుంచి మద్దతునిచ్చారు. కానీ...కొన్ని అంశాల్లో పార్టీని విమర్శించడంలో మాత్రం వెనకాడలేదు. అటు కేజ్రీవాల్‌ ఈ విమర్శల్ని పట్టించుకోలేదు. లిక్కర్ పాలసీపై గతంలోనే అన్నాహజారే తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. తన ఆవేదనంతా వివరిస్తూ 2022లో సీఎం కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. ‘‘మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను రాస్తున్న మొట్ట మొదటి లేఖ ఇది. మీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ గురించి తెలిసి చాలా బాధగా అనిపించింది. మద్యంలాగే అధికారమూ మత్తునిస్తుంది. మీరు అధికారం మత్తులో ఉన్నట్టుగా అనిపిస్తోంది’’ అని ఆ లేఖలో ప్రస్తావించారు. 

ఏంటీ స్కామ్..?

2021-22లో ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని రూపొందించింది. మద్యం షాప్‌లని 100% ప్రైవేటీకరణ చేసింది. తద్వారా ప్రభుత్వంపై భారం తగ్గుతుందని చెప్పింది. హోల్‌సేలర్స్‌కి 12% లాభాలు వచ్చేలా, రిటైలర్స్‌కి ఏకంగా 185% లాభాలు వచ్చేలా పాలసీ తయారు చేసింది. అయితే..హోల్‌సేలర్స్‌కి ఇచ్చిన 12% లాభాల మార్జిన్‌లో దాదాపు 6% తమకు ఇచ్చేలా ఆప్ ప్లాన్ చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. సౌత్‌ గ్రూప్‌ విజయ్‌ నాయర్‌కి రూ.100 కోట్లు ముట్టజెప్పినట్టు ఈడీ చెబుతోంది. అసలు మొత్తంగా ఇది రూ.100 కోట్ల కుంభకోణం కాదని రూ.600 కోట్ల వరకూ స్కామ్ జరిగిందని కోర్టుకి వివరించింది. 

Also Read: Electoral Bonds Data: ఎలక్టోరల్ బాండ్స్‌తో బీజేపీకి భారీ విరాళాలు, టాప్ డోనార్స్ లిస్ట్ ఇదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget