Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!
Karnataka Ola Uber Auto Ban: 3 రోజుల్లోపు ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు తమ ఆటో సర్వీసులను నిలిపివేయాలని కర్ణాటక సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
Karnataka Ola Uber Auto Ban: కర్ణాటక రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై సర్కార్ బ్యాన్ విధించింది. 3 రోజుల్లోపు తమ ఆటో సర్వీసులను నిలిపివేయాలని కర్ణాటక సర్కార్ ఆదేశించింది.
ఓలా, ఉబర్.. 2 కిలోమీటర్ల కంటే తక్కువ దూరానికి కూడా రూ.100 వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు రవాణా శాఖలో ఫిర్యాదులు నమోదు చేశారు. దీంతో రవాణా శాఖ అక్టోబర్ 6న ఈ నోటీసు ఇచ్చింది. ప్రస్తుతం.. మొదటి 2 కి.మీకి కనీస ఆటో ఛార్జీ రూ.30గా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.15 వసూలు చేస్తారు.
భారీగా ఛార్జీలు
ఓలా, ఉబర్, ర్యాపిడో.. ఈ మధ్య ఎక్కడికి వెళ్లాలన్నా చాలా మంది ప్రయాణికులు వీటినే ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ కంపెనీలు ప్రయాణికుల అవసరాలను ఆసరాగా తీసుకుని, ఛార్జీల బాదుడును భారీగా పెంచేశాయి. దీంతో కర్ణాటక రవాణా శాఖ ఈ మూడు రైడ్ హైరింగ్ సర్వీసు సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
మూడు రోజుల్లోగా ఈ కంపెనీలు తమ ఆటో సర్వీసులను ఆపివేయాలని ఆదేశించింది. ఈ సంస్థల ఆటోలు అక్రమంగా సర్వీసులను అందిస్తున్నాయని తెలిపింది. మూడు రోజుల్లోగా ఈ సంస్థల సర్వీసులను ఆపివేసి, వెంటనే నివేదికను సమర్పించాలని ఈ వెహికిల్ అగ్రిగేటర్లను కర్ణాటక ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ ఆదేశించింది.
కొత్త యాప్
మరోవైపు ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్(ARDU)తో పాటు నందన్ నిలేకనికి చెందిన బెకన్ ఫౌండేషన్ బెంగళూరులో నమ్మ యాత్రి యాప్(Namma Yatri App)ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. నవంబర్ 1న ఈ నమ్మ యాత్రి యాప్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
Also Read: Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు కేసు అప్‌డేట్- కీలక తీర్పు వాయిదా!
Also Read: Ghaziabad Blast: సినిమా చూస్తుండగా పేలిపోయిన టీవీ- బాలుడు మృతి, మహిళకు గాయాలు!