Karnataka Hijab Controversy: విద్యాసంస్థల్లో హిజాబ్, కాషాయ కండువాలు ధరించవద్దు, కర్ణాటక మైనారిటీ శాఖ కీలక ఆదేశాలు
కర్ణాటక హిజాబ్ వివాదం మరో మలుపు తిరిగింది. తాజా మైనారిటీ వెల్ఫేర్ శాఖ తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ విద్యాసంస్థల్లో హిజాబ్, కాషాయ కండువాలు, ఇతర మతపరమైన చిహ్నాలు అనుమతించవద్దని సర్క్యులర్ జారీ చేసింది.

కర్ణాటక(Karnataka)లో హిజాబ్ వివాదం(Hijab Issue) ఇంకా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మైనారిటీ విద్యా సంస్థల(Minority Educational institutions)లో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు హిజాబ్ ధరించడం అనుమతించవద్దని కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) గురువారం ఒక సర్క్యులర్(Circular)ను జారీ చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ, మౌలానా ఆజాద్ మోడల్ స్కూల్స్ (ఇంగ్లీష్ మీడియం) ఆధ్వర్యంలో నడుస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలల(Residential Schools)కు కూడా హైకోర్టు(High Court) ఫుల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని మైనారిటీ సంక్షేమం, హజ్ వక్ఫ్ శాఖ కార్యదర్శి మేజర్ పి. మణివణ్ణన్ తెలిపారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని విద్యాసంస్థలు తరగతి గదుల్లో హిజాబ్, సెఫ్రాన్ కండువాలు, స్కాఫ్స్ర్, ఇతర మత చిహ్నాలను అనుమతించరాదని ఆదేశించారు.
Karnataka Minority Welfare Department restrains students of schools under the Dept from wearing saffron shawls, scarfs, hijab, religious flags or similar inside classrooms until further orders pic.twitter.com/xPjfR74Np6
— ANI (@ANI) February 17, 2022
"విద్యా సంస్థలను తిరిగి తెరిచి, విద్యార్థులను త్వరగా తరగతులకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. ఈ పిటిషన్‌లన్నింటినీ పెండింగ్‌లో ఉంచుతూ, వారి మతంతో సంబంధం లేకుండా విద్యార్థులందరినీ తదుపరి ఆదేశాల వచ్చే వరకు తరగతి గదిలో హిజాబ్, మతపర కండువాలు(Saffron Shawls), మతపరమైన జెండాలు ఇలాంటివి ధరించకుండా చూడాలి." అని సర్క్యులర్ లో మైనారిటీ వెల్ఫేర్ శాఖ వెల్లడించింది. కాలేజీ డెవలప్‌మెంట్ కమిటీలు విద్యార్థి దుస్తులను, యూనిఫామ్‌ను నిర్దేశించిన సంస్థలకు మాత్రమే ఈ ఉత్తర్వులు పరిమితమైందని సర్క్యులర్ ప్రకటించింది. హిజాబ్ ధరించిన విద్యార్థులు ఇప్పటికే అధికారులను ప్రశ్నించడం నిరసనలు చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సంబంధిత డిప్యూటీ కమిషనర్లకు మెమోరాండంలు సమర్పించడం ప్రారంభించారు.
హిజాబ్ వివాదం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

