News
News
వీడియోలు ఆటలు
X

CM Yediyurappa Profile: యడియూరప్ప రాజకీయ జీవితంలో ఆఖరి పేజీ ఇదేనా?

ఈ రోజు సాయంత్రంలోగా కర్ణాటక సీఎం మార్పుపై ఓ ప్రకటన వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత సీఎం యడియూరప్ప చేత రాజీనామా చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయం జీవితం ఓసారి చూద్దాం.

FOLLOW US: 
Share:

కన్నడనాట అర్ధ శతాబ్దానికి పైగా రాజకీయాలను శాసించిన బి.ఎస్‌.యడియూరప్ప జీవితంలో ఆదివారం అత్యంత కీలకంగా మారనుంది. తన రాజీనామాపై విస్తృత స్థాయిలో వ్యాపించిన వదంతుల నడుమ గురువారం ఆయన ఓ కీలక ప్రకటనే చేశారు. అధిష్ఠానం నుంచి ఆదివారం అందే సూచనపైనే నా భవిష్యత్తు ఆధారపడుతందని ఆయన వెల్లడించడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఆయన అంచనా ప్రకారం పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి రాజీనామాపై ఆదివారమే స్పష్టత ఇవ్వనున్నారు. రాజీనామా చేయాలని అధిష్ఠానం సూచిస్తే సోమవారం నిర్వహించే సర్కారు రెండేళ్ల విజయోత్సవ కార్యక్రమంలో తన నిష్క్రమణపై ప్రకటన చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధమవుతారు.

"సాయంత్రంలోగా పార్టీ అధిష్ఠానం నుంచి సలహా వస్తుందని ఆశిస్తున్నా. అదెంటో మీరూ (మీడియా) తెలుసుకుంటారు. దళిత సీఎం నియామకంపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఆందోళన చెందను."

-బి.ఎస్.యడియూరప్ప, కర్ణాటక సీఎం

అడుగడుగునా ఆటుపోట్లు..

ఆర్ఎస్ఎస్ కార్యదర్శిగా మొదలు.. కర్టాణట సీఎం వరకు యడియూరప్ప ఎన్నో బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆయన రాజకీయ జీవితంలో గత మూడేళ్లు అత్యంత కీలకం.  ఎన్నో పోరాటాల అనంతరం 2019 జులై 26న నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బి.ఎస్‌.యడియూరప్ప ఈ రెండేళ్లు రాజీనామా వదంతులు, ప్రకృతి వైపరీత్యాలతో సహవాసం చేశారు. ఇప్పటికే మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా.. నాలుగోసారి ప్రయాణం అంత సజావుగా సాగలేదు. భాజపా, జేడీఎస్‌ నుంచి రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేల అండతో అధికారాన్ని అందుకున్నా.. వారి కారణంగానే పార్టీ కంట్లో నలుసుగా మారారు. వలస నేతలందరికీ పదవులు కట్టబెట్టిన ముఖ్యమంత్రి సహజంగానే పార్టీ విధేయులకు దూరమయ్యారు.

రెండుసార్లు మంత్రివర్గాన్ని విస్తరించినా సీనియర్లకు ప్రాధాన్యం నాస్తీ. ఈ కారణంగా సొంత ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తిరుగుబాటు బావుటా ఎగురువేసి చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని కదలించే స్థాయికి చేరారు. తన అండదండలు, సహకారంతో పార్టీలో ఎదిగిన వారు నేడు ముఖ్యమంత్రికి బద్ద శత్రువులుగా మారారు. యడియూరప్ప లేనిదే భాజపా లేదని అన్నవారు కాస్తా.. ఆయనే పార్టీకి అడ్డంకిగా మారారని దుష్ప్రచారం చేశారు. కుమారుడు బి.వై.విజయేంద్ర అక్రమాలను అడ్డుకోలేని ముఖ్యమంత్రితో సర్కారుకు తలవంపులు తప్పవని అధిష్ఠానం వద్ద పదేపదే ఫిర్యాదు చేస్తూ చివరకు అన్నంత పని చేశారు.

వయసే భారమా?

ముఖ్యమంత్రికి.. 78 సంవత్సరాల వయసే ప్రధాన శత్రువుగా మారింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆయన వయసు 76 సంవత్సరాలు. పార్టీ నిబంధనల ప్రకారం 75 ఏళ్లు దాటితే ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం కావాలి. రాష్ట్రంలో భాజపా ప్రగతికి మార్గదర్శకుడైన యడియూరప్పను అధిష్ఠానం గౌరవించింది. ఆ గౌరవంతోనే రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించింది. సరిగ్గా ఇదే అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి తాను అధిష్ఠాన నిర్ణయాన్ని గౌరవించి.. సూచనలను పాటిస్తానని ఇటీవల ప్రకటించారు. వాస్తవానికి వయసు మళ్లినా ముఖ్యమంత్రి యడియూరప్ప ఎంతో చురుకుగా పని చేశారు. రెండేళ్ల కాలంలో రెండు సార్లు కరోనా బారిన పడినా.. కోలుకుని యువ నేతలకు పోటీగా పని చేశారు.

2019 జులై 26న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుల వ్యవధిలోనే వరదలు చుట్టుముట్టాయి. అప్పటికీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయని ముఖ్యమంత్రి ఒంటరిగానే వరద ప్రాంతాలను సందర్శించారు. 2020లోనే జులై ఆగస్టు, సెప్టెంబరు మధ్య కాలంలో మరోమారు అతివృష్టి, తాజాగా మరింత భీభత్సకరమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భాల్లో ముఖ్యమంత్రి ఎంతో చురుకుగా జిల్లాలను చుట్టేశారు. ప్రజలకు అండగా ఉన్నానన్న భరోసా ఇచ్చారు. 2020 మార్చిలో మొదలైన కరోనా తీవ్రత నేటికీ తగ్గలేదు. వయసు మళ్లినా ఏనాడూ విశ్రమించని ఆయన.. కరోనా నియంత్రణలో ఉత్తమ పాలన అందించినట్లు అధిష్ఠానమే పలుమార్లు కితాబిచ్చింది. రాష్ట్రాన్ని సందర్శించిన ప్రతిసారీ పార్టీ బాధ్యుడు అరుణ్‌సింగ్‌ కూడా క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి యడియూరప్ప భేషుగ్గా పని చేసినట్లు కొనియాడారు. వయసు కార్డుతో ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేందుకు సిద్ధం కావడమే రాజకీయం.

అయినా సరే..

ముఖ్యమంత్రి యడియూరప్ప ఆదివారం బెళగావిలో పర్యటించనున్నారు. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న ఉత్తర కర్ణాటక ప్రాంతాలను ఆయన చుట్టేస్తారు. అదే సమయానికి.. అధిష్ఠానం నుంచి ఆయన రాజీనామాపై స్పష్టమైన సూచనలు అందనున్నాయి. నిజానికి ఈ పర్యటన తనకెంతో ఊరటనిస్తుందని అప్ప భావిస్తున్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాలు వరద తాకిడితో తల్లడిల్లుతున్నాయి. ముఖ్యమంత్రి నేతృత్వంలో రక్షణ చర్యలు చేపట్టాల్సిన సమయంలో కేంద్ర సర్కారూ చేయూతనివ్వాలి. వరద పరిహారం కోసం నిధులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సమకూర్చాల్సిన కేంద్రం.. ఈ పరిస్థితుల్లో నాయకత్వ మార్పు సాహసం చేయదనే వాదన మొదలైంది. ఈ పరిస్థితుల్లో రాజకీయాలపై దృష్టి సారిస్తే అదెంతో తప్పిదమవుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఆదివారం తన రాజకీయ ప్రస్థానానికి చివరి రోజని తెలిసినా ముఖ్యమంత్రి వరద ప్రాంతాలను సందర్శించటం ఆసక్తి కల్గిస్తోంది. చివరి నిమిషం వరకు తాను కష్టపడుతున్నా.. అధిష్ఠానం గుర్తించలేదన్న సందేశాన్ని పంపేందుకు ఈ పర్యటన చేపట్టారని మరో వాదన.

లెక్క లేని సవాళ్లు..

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచీ సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని ఎంతో గట్టిగా ఎదుర్కోవటం సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. శనివారం దృశ్య మాధ్యమం ద్వారా శివమొగ్గ జిల్లాలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన శివమొగ్గ జిల్లా అభివృద్ధికి చేసిన సేవలు సంతృప్తి ఇచ్చాయన్నారు. శికారిపుర పురసభ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం చేపట్టిన పనులతో వారి రుణం తీర్చుకున్నట్లు ప్రకటించారు. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్నారు. రూ.384 కోట్లతో విమానాశ్రయాన్ని నిర్మించి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేస్తున్నామన్నారు. కరోనా, వరదల రూపంలో రెండేళ్లలో పెను సవాళ్లు ఎదురయ్యాయి. ప్రజల బతుకులు అస్తవ్యస్తమైనా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచే ప్రయత్నం చేశానన్నారు. ప్రజల సహకారంతోనే సవాళ్లను సులువుగా ఎదుర్కొన్నానని వివరించారు. ఈ సందర్భంగా రూ.1,074కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై జిల్లా పాలనాధికారులతో మాట్లాడారు.

 

మరో వ్యాజ్యం..

ముఖ్యమంత్రి యడియూరప్ప, ఆయన చిన్న కుమారుడు బి.వై.విజయేంద్ర, బంధువులు కలిసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సహ కార్యకర్త టి.జె.అబ్రహం దాఖలు చేసిన కేసును చట్టసభ ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఇప్పటికే కొట్టివేసింది. ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ అబ్రహం ఉన్నత న్యాయస్థానంలో తాజాగా మరో పిటిషన్‌ దాఖలు చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా గవర్నర్‌ అనుమతి లేకుండానే కేసు దాఖలు చేశారని దిగువ న్యాయస్థానం పేర్కొంది. తాను ఆధారాలతో సహా దాఖలు చేసిన వ్యాజ్యం విచారణకు అర్హమైనదంటూ తాజాగా వేసుకున్న కేసు వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Published at : 25 Jul 2021 03:31 PM (IST) Tags: yediyurappa yediyurappa political yediyurappa karnataka karnataka politics yediyurappa resign

సంబంధిత కథనాలు

Gold-Silver Price Today 04 June 2023: కొండ దిగొచ్చిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price Today 04 June 2023: కొండ దిగొచ్చిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Coromandel Express Accident: టెక్నాలజీని వినియోగించుకొని రైలు ప్రమాదాలు జరగకుండా చూడాలి - ఎంపీ రామ్మోహన్ నాయుడు

Coromandel Express Accident: టెక్నాలజీని వినియోగించుకొని రైలు ప్రమాదాలు జరగకుండా చూడాలి - ఎంపీ రామ్మోహన్ నాయుడు

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?

Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?

SAP: శాప్‌లో డెవలపర్ అసోసియేట్ ఉద్యోగాలు- అర్హతలివే!

SAP: శాప్‌లో డెవలపర్ అసోసియేట్ ఉద్యోగాలు- అర్హతలివే!

టాప్ స్టోరీస్

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్