By: Ram Manohar | Updated at : 20 May 2023 11:54 AM (IST)
కర్ణాటక కాంగ్రెస్ క్యాస్ట్ ఈక్వేషన్స్‌పై దృష్టి సారించాల్సి ఉంటుంది.
Karnataka CM Swearing-In:
అసలు కథ ఇప్పుడే..
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. ఇక్కడితోనే కథ అయిపోలేదు. అసలు సవాళ్లన్నీ ఇప్పటి నుంచే మొదలవుతాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతో పాటు..అంతర్గత విభేదాలు లేకుండా చూసుకోవడం హైకమాండ్‌కి పెద్ద టాస్క్. రాజస్థాన్‌లో ఇప్పటికే గహ్లోట్, పైలట్ మధ్య ఏ స్థాయిలో వార్ జరుగుతోందో దేశమంతా గమనిస్తూనే ఉంది. "కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఇంతే. ఇంటి పోరుతోనే అలా అయిపోయింది" అనే విమర్శల్నీ ఎదుర్కొంటోంది ఆ పార్టీ. ఇలాంటి సమయంలో బూస్ట్ ఇచ్చిన కర్ణాటక విక్టరీని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఉత్సాహంతో ముందుకు సాగుతూనే...తప్పటడుగులు వేయకుండా చూసుకోవాలి. ప్రస్తుతం కర్ణాటక విషయంలో కేబినెట్ విస్తరణ చాలా కీలకంగా మారింది. ఆశావహులందరూ ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. "ఒక్క ఛాన్స్" అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొందరు డిమాండ్ చేస్తున్నారు. కానీ...క్యాస్ట్ ఈక్వేషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ కేబినెట్‌ని ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏ మాత్రం క్లారిటీ మిస్ అయినా...కథంతా మళ్లీ మొదటికే వస్తుంది. కర్ణాటకలో ప్రభుత్వం కూలితే మాత్రం..ఇక కాంగ్రెస్‌పై ప్రజలు ఉన్న నమ్మకం కూడా పోగొట్టుకునే ప్రమాదముంది. అందుకే...కేబినెట్ విస్తరణ కత్తిమీద సాములా మారింది. ఎవరికి ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వాలో స్పష్టంగా హైకమాండ్ చెప్పగలిగితేనే అలకలు, జంపింగ్‌లు ఉండవు. లేదంటే మాత్రం కాంగ్రెస్‌కి మరో తలనొప్పి పట్టుకోక తప్పదు.
ఇవిగో సవాళ్లు..
వాళ్లు ఎన్నుకునే మంత్రులు సరిగ్గా పని చేయకపోయినా...హామీలు నెరవేర్చడంలో విఫలమైనా పెద్ద దెబ్బ తప్పదు. అందుకే..ఈ హామీలు నెరవేర్చే విషయంలో ఇంకాస్త క్లారిటీ అవసరం. ఓల్డ్ మైసూర్, కల్యాణ కర్ణాటక, సెంట్రల్ కర్ణాటక..ఈ ప్రాంతాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ఆశగా చూస్తున్నారు. అటు కోస్టల్ కర్ణాటకలోని ఎమ్మెల్యేలూ అంతే ఆశలు పెట్టుకున్నారు. ఈ అన్ని చోట్లా కాంగ్రెస్‌కి ఎక్కువ సీట్లు వచ్చాయి. అందుకే...వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ మంత్రి పదవులు ఇవ్వడం మరో టఫ్ టాస్క్. అందులోనూ త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. అందుకే..మరింత జాగ్రత్తగా ఉండాలి. లింగాయత్, వక్కళిగలకు సమన్యాయం చేస్తూ ఆ వర్గాలకు చెందిన వారికి ప్రియారిటీ ఇవ్వడం మరో సవాలు. మైనార్టీలతో పాటు షెడ్యూల్ తెగల ఓట్లనూ రాబట్టుకుంది కాంగ్రెస్. అలాంటప్పుడు ఆ వర్గాలకు చెందిన నేతలకూ వరమివ్వాల్సిందే. ఇదే సమయంలో కొత్త వారికీ అవకాశమివ్వాలి. ఇక మహిళలకూ సరైన స్థాయి పదవి ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తూనే ఉంది. ఇక ఎమ్మెల్యేలందరూ ఎలాంటి అసంతృప్తికి లోనుకాకుండా వాళ్లకు ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఇదే తప్పు చేసింది కాంగ్రెస్. కొందరు ఎమ్మెల్యేలు కంప్లెయింట్ చేసినా పట్టించుకోలేదు. ఫలితంగా..వాళ్లు రిజైన్ చేసి ప్రభుత్వం కూలిపోయేలా చేశారు. ఇప్పుడీ యూనిటీని కాపాడుకోవటం ఇంకా ముఖ్యం. ఎవరికి ఏ పోర్ట్‌ఫోలియో ఇస్తున్నారనే దాన్ని బట్టే హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది తెలుస్తుంది.
AFCAT Notification 2023: ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నతహోదా ఉద్యోగాలకు 'ఏఎఫ్‌క్యాట్' - నోటిఫికేషన్ వెల్లడి!
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Manipur Violence: అమిత్‌షా వార్నింగ్ ఎఫెక్ట్, ఇప్పటివరకు 140 ఆయుధాలు అప్పగించిన నిరసనకారులు
Infosys: ఇన్ఫోసిస్‌లో సిస్టమ్స్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!
TSPSC Paper Leakage: నిందితుడు డీఈ రమేష్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సిట్
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా
Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!