అన్వేషించండి

Karnataka Budget 2024: కర్ణాటక బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన సీఎం సిద్దరామయ్య, పద్దులోని హైలైట్స్ ఇవే

Karnataka Budget 2024: కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది.

Karnataka Budget 2024 Highlights: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాష్ట్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరవాత ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ ఇది. ఈ క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అభివృద్ధికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిందని స్పష్టం చేశారు. 'Karnataka Model of Development గురించీ ప్రస్తావించారు. రాజ్యాంగానికి అనుగుణంగా అందరికీ సమన్యాయం అందిస్తున్నట్టు వెల్లడించారు. పద్దు ప్రవేశపెడుతున్న సమయంలో పలు కీలక ప్రకటనలు చేశారు. 

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు Karnataka Raitha Samruddhi Yojane స్కీమ్‌ని అమలు చేస్తామని సిద్దరామయ్య ప్రకటించారు. సమ్మిళిత వ్యవసాయానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న పథకాల అమలుకు Agriculture Development Authority ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్స్ వద్ద ఫుడ్‌ పార్క్‌లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఉద్యాన పంటలను ప్రోత్సహించడంలో భాగంగా జిల్లాల్లో Kissan Malls  ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని వెల్లడించారు సిద్దరామయ్య. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో floriculture market ని ఏర్పాటు చేయనున్నారు. మత్స్యకారులను రక్షించేందుకు సీ ఆంబులెన్స్‌ల కొనుగోలు కోసం రూ.7 కోట్లు కేటాయించింది. 10 వేల మంది మత్స్యకారులకు ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేయనుంది. రైతు రుణాలను రూ.27 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉల్లిగడ్డలు, ద్రాక్ష, మామిడి, అరటి తదితర పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని సిద్దరామయ్య వెల్లడించారు. 

2 వేల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో త్వరలోనే ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకురానున్నారు. IIT స్థాయిలో  University Visveswaraya College of Engineeringని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లు కేటాయించింది. ఇక ఆరోగ్య రంగానికి వస్తే...7 జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్‌ బిల్డింగ్స్‌ని నిర్మించేందుకు రూ.187 కోట్లు కేటాయించింది. బెంగళూరులోని Institute of Nephro-Urologyలో రోబోటిక్ సర్జరీ సౌకర్యం కోసం రూ.20 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించింది ప్రభుత్వం. గృహలక్ష్మి పథకం కోసం రూ.28,608 కోట్లు కేటాయించింది. అంగన్‌వాడీ వర్కర్‌లకు 75,938 స్మార్ట్‌ఫోన్‌లు పంపిణీ చేయనుంది. ఇందుకోసం రూ.90 కోట్లు ఖర్చు చేయనుంది. Scheduled Tribe Welfare Department పరిధిలోని ఆశ్రమ్ స్కూల్స్‌ని Maharshi Valmiki Adivasi Budakattu Vasathi Shaleగా పేరు మార్చుతున్నట్టు ప్రకటించింది. అన్నభాగ్య స్కీమ్‌ కోసం రూ.4,595 కోట్లు కేటాయించింది. 

బెంగళూరుని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చి దిద్దేందుకు Brand Bengaluru స్కీమ్‌ని లాంఛ్ చేసింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనుంది.  Hebbal Junctionలో ప్రత్యేకంగా సొరంగ మార్గాన్ని నిర్మించనున్నారు. Bengaluru Business Corridorలో భాగంగా కొత్త రింగ్‌ రోడ్‌ని ప్రతిపాదించింది ప్రభుత్వం. 2025 మార్చి నాటికి ఇప్పుడున్న మెట్రోకి అదనంగా 44 కిలోమీటర్ల మేర నెట్‌వర్క్‌ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. గృహ జ్యోతి స్కీమ్‌కి రూ.1.65 కోట్లు కేటాయించింది. బెంగళూరులో అర్ధరాత్రి ఒంటిగంట వరకూ వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. 

Also Read: Paytm Crisis: పేటీఎమ్‌కి మరో షాక్, ఫాస్టాగ్ జారీ నిలిపివేస్తూ IHMCL సంచలన నిర్ణయం

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA Success: వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
KCR BRS Meeting: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు
బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు
Andhra Pradesh and Telangana: కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
PM Kisan Nidhi: ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లోకి రూ.2000 - ఈ రైతులకు మాత్రం డబ్బులు రావు!
ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లోకి రూ.2000 - ఈ రైతులకు మాత్రం డబ్బులు రావు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABPSunita Williams Coming back to Earth | Gravity లేకపోతే మన బతుకులు అథోగతేనా | ABP DesamAdilabad Bala Yesu Festival | క్రిస్మస్ కన్నా ఘనంగా చేసుకునే బాల యేసు పండుగ | ABP DesamPawan Kalyan Maha kumbh 2025 | ప్రయాగ్ రాజ్ లో ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA Success: వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
KCR BRS Meeting: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు
బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు
Andhra Pradesh and Telangana: కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
PM Kisan Nidhi: ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లోకి రూ.2000 - ఈ రైతులకు మాత్రం డబ్బులు రావు!
ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లోకి రూ.2000 - ఈ రైతులకు మాత్రం డబ్బులు రావు!
Rakul Preet Singh: రకుల్ పెళ్లిలో ఫోనుల్లేవ్... ఆ కండిషన్ ఎందుకో చెప్పిన స్టార్ హీరోయిన్
రకుల్ పెళ్లిలో ఫోనుల్లేవ్... ఆ కండిషన్ ఎందుకో చెప్పిన స్టార్ హీరోయిన్
Anil Ravipudi: మెగాస్టార్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనిల్ రావిపూడి... బిగ్ లీగ్‌లో చేరినట్టేనా?
మెగాస్టార్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనిల్ రావిపూడి... బిగ్ లీగ్‌లో చేరినట్టేనా?
Nag Ashwin News: స్వగ్రామంలో నాగ్ అశ్విన్‌ సందడి, ఎమ్మెల్యేతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న టాలీవుడ్ డైరెక్టర్
స్వగ్రామంలో నాగ్ అశ్విన్‌ సందడి, ఎమ్మెల్యేతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న టాలీవుడ్ డైరెక్టర్
Tirumala News: తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం, శ్రీవారి భక్తులు షాక్
తిరుమలలో టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణం, శ్రీవారి భక్తులు షాక్
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.