Kangana Ranaut : దళిత రాష్ట్రపతి రామ్ కోవిడ్ - సోషల్ మీడియాను ఊపేస్తున్న కంగనా సరికొత్త జ్ఞానగుళిక
MP Kangana : కంగనా రనౌత్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ మీమ్స్ కు స్టఫ్ అయ్యారు. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేరును ఆమె రామ్ కోవిడ్ గా చెప్పడమే దీనికి కారణం.
Kangana Ranaut has once again become the stuff of viral memes on social media : కంగనా రనౌత్ వివాదాస్పద స్టేట్ మెంట్లు ఇవ్వడంలో దిట్ట. అయితే ఆమెకు జనరల్ నాలెడ్జ్ చాలా తక్కువ అని అనేక ఇంటర్యూల్లో వెల్లడయింది. తాజాగా ఆమె ఓ ఇంటర్యూలో దళిత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేరు తెలియక.. రామ్ కోవిడ్ అని చెప్పడంతో ఇంటర్నెట్ ఒక్క సారిగా బ్లాస్ట్ అయిపోయింది. ఆమెను ట్రోల్ చేస్తూ.. వెల్లువలా వీడియోలు వచ్చేశాయి.
ఇటీవల ఆమె రైతుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి హర్యానా ఎన్నికల్లో భారీ నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమె మరోసారి ఇలాంటి విజ్ఞాన ప్రదర్శన చేయడంతో.. ఆమె ఇంతే మాట్లాడుతూ ఉండాలని.. హర్యానాలో బీజేపీ ఓడిపోయిన తర్వాతే ఆపాలని కొంత మంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
The more interviews the honorable MP Kangana Ranaut, who called Ram Nath Kovind ji #RamCovid, gets, the more the opposition will benefit.👈✍️
— Mukesh Bangra (चौधरी) (@MukeshBangra12) August 30, 2024
She will stop only after losing the Haryana elections.🤣#KanganaRanaut
।।RamCovid ।। pic.twitter.com/krBVeNwAvx
ప్రముఖ ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్ సైట్ ఆల్ట్ న్యూస్ కు చెందిన జుబేర్ కూడా కంగనాపై సెటైర్ వేశారు.
🤣🤣🤣 "Sorry for my Misinformation" Kangana pic.twitter.com/ufDSirrDl4
— Mohammed Zubair (@zoo_bear) August 29, 2024
కంగనా రనౌత్ భారత్ లో అతి తక్కువ ఐక్యూ ఉన్న ఎంపీల్లో మొదటి స్థానంలో ఉంటారని కొంత మంది సెటైర్లు వేశారు.
Again a new Interview:-
— Braj shyam maurya (@brijshyam07) August 29, 2024
Kangana Ranaut is the lowest IQ Indian MP in the history of Indian Politics , she proves😂
Who all agree? pic.twitter.com/ouAuHp5hOC
ఇలాంటి జెమ్ ను పార్లమెంట్ కు పంపినందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు అభినందనలు చెప్పాలని ..లేకపోతే ఇలాంటి జెమ్స్ ఉన్నారని మనకు తెలియదని కొంత మంది సుతిమెత్తని విమర్శలు చేశారు. కంగనా రనౌత్ ఎన్నికల ప్రచార సమయంలోనూ రాజకీయాలు, అభివృద్ధిపై తనకు పెద్దగా అవగాహన లేదన్న విషయం బయటపడేలా ఇంటర్యూల్లో వ్యాఖ్యలు చేశారు. అయితే అవేమీ ఆమె విజయాన్ని ఆపలేకపోయాయి. కంగనాపై సోషల్ మీడియాలో జరిగిన ప్రతి ప్రచారం ఆమెకు హెల్ప్ అయింది.
అయితే ఇప్పుడు ఆమె ఎంపీగా ఉన్నారు అలాంటి ప్రచారాలు మైనస్ అవుతాయని.. వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తాయని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. బీజేపీ తరపున మాట్లాడటానికి ఆమెకు ఎలాంటి అధికారం ఇవ్వలేదని రైతులపై చేసిన వ్యాఖ్యల తర్వాత బీజేపీ అధికారికంగానే ప్రకటించింది.