అన్వేషించండి

Jill Biden Surgery: జో బైడెన్ సతీమణికి క్యాన్సర్ సర్జరీ, కుడి కన్ను పైభాగంలో పెరిగిన కణితి

Jill Biden Surgery: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సతీమణికి క్యాన్సర్ సర్జరీ జరగనుంది.

Jill Biden Cancer Surgery:

మైనర్ సర్జరీ 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్‌కు క్యాన్సర్ సర్జరీ జరగనుంది. పెద్దగా భయపడాల్సిన పనిలేదని, ఇది మైనర్ సర్జరీ అని వైట్‌హౌజ్ వెల్లడించింది. ఆమె ముఖంపై కండరం పెరుగుతోందని, దాన్ని తొలగించేందుకు సర్జరీ చేస్తున్నట్టు వైట్‌హౌజ్ వైద్యుడు కెవిన్ ఓ కాన్నర్ వెల్లడించారు. వాల్టర్ రీడ్ మిలటరీ హాస్పిటల్‌లో జనవరి 11న ఈ శస్త్రచికిత్స జరగనుంది. స్కిన్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తుండగా...జిల్ బైడెన్ కుడి కన్ను పై భాగాన క్యాన్సర్ కణజాలాన్ని గుర్తించారు వైద్యులు. వెంటనే తొలగిస్తే మంచిదని సూచించారు. ఈ సర్జరీ తరవాతే ఎలాంటి చికిత్స అందించాలి అన్నది నిర్ణయిస్తామని వైద్యులు స్పష్టం చేశారు. జో బైడెన్, జిల్ బైడెన్ లవ్‌స్టోరీ గురించి అగ్రరాజ్యంలో చాలా మంది ఇప్పటికీ చర్చింకుంటూ ఉంటారు. 1977లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే...పెళ్లి కాక ముందు జిల్ బైడెన్‌కు ఐదు సార్లు ప్రపోజ్ చేశానని జో బైడెన్‌ ఓ సందర్భంలో చెప్పారు. ఓ టీవీ షోలో పాల్గొన్న సమయంలో తమ లవ్‌స్టోరీని చెప్పారు జో బైడెన్. అప్పట్లో ఆ వీడియో బాగా వైరల్ అయింది. "నేను మొట్టమొదటిసారి తనతో బయటకు వెళ్లినప్పుడే నాకు అర్థమైపోయింది. తనను గాఢంగా ప్రేమిస్తున్నానని" అని అన్నారు. 

బైడెన్‌కు క్యాన్సర్..? 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్ ఉందా..? కొద్ది రోజులుగా ఇంటర్నేషనల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. అందుకు కారణం. జో బైడెన్ ఓ సందర్భంగా చేసిన వ్యాఖ్యలే. తనకు క్యాన్సర్ ఉంది అనే అర్థం వచ్చేలా ఆయన చేసిన కామెంట్స్ షాక్‌కు గురి చేశాయి. బైడెన్‌ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఒక్కసారిగా ఇది వైరల్ అవటం వల్ల వైట్‌హౌజ్ కార్యాలయం రంగంలోకి దిగి వివరణ ఇచ్చింది. ఓ హెల్త్ అనౌన్స్‌మెంట్‌ కార్యక్రమానికి హాజరైన జో బైడెన్ గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడారు. ఆయిల్ పరిశ్రమలు తీవ్ర స్థాయిలో కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయని అన్నారు. అలాంటి వాతావరణంలోనే తానూ పెరిగానని చెప్పారు. క్లేమాంట్‌లోని డెలవేర్ ప్రాంతంలో తాను ఉండేవాడినని, అక్కడి వాతావరణం చాలా దారుణంగా ఉండేదని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. "మా ఇంటికి దగ్గర్లోనే ఆయిల్ రిఫైనరీ యూనిట్లు ఉండేవి. బయట కాసేపు కూడా నడిచే అవకాశం ఉండేది కాదు. మా అమ్మ ఎప్పుడూ మమ్మల్ని ఇంట్లోకి తరుముతూ ఉండేది. మా ఇంటి కిటికీలకు విండ్ షీల్డ్‌ వైపర్‌లు పెట్టుకునే వాళ్లం. అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉండేదో తెలిసేది కాదు. విండోస్‌కి జిడ్డు పట్టేది. వాటిని వైపర్లతో తుడిచేవాళ్లం. ఇలాంటి వాతావరణంలో ఉన్నాం కాబట్టే క్యాన్సర్‌తో బారిన పడ్డాం. దేశవ్యాప్తంగా చూస్తే డెలవేర్ ప్రాంతంలోనే అత్యధిక క్యాన్సర్ రేట్‌ ఉంటుంది" అని చెప్పారు జో బైడెన్. ఈ కామెంట్స్ తరవాతే బైడెన్‌కు క్యాన్సర్ ఉందన్న చర్చ మొదలైంది. వైట్‌హౌజ్ ఆఫీస్ వెంటనే జోక్యం చేసుకుని వివరణ ఇచ్చింది. బైడెన్‌ తన స్కిన్ క్యాన్సర్ గురించి మాట్లాడారని స్పష్టం చేసింది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు స్కిన్‌ క్యాన్సర్‌తో బాధ పడ్డారని, కానీ పొరపాటున అది క్యాన్సర్‌ అన్న ప్రచారం జరుగుతోందని చెప్పింది. 

Also Read: US Immigration Fee: వీసాల ఛార్జీలు భారీగా పెంచిన అమెరికా, డాలర్ డ్రీమ్స్ మరింత కాస్ట్‌లీ

 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దటీజ్ నారా లోకేష్ - గంటల వ్యవధిలో మాట నిలబెట్టుకున్న ఏపీ మంత్రి
దటీజ్ నారా లోకేష్ - గంటల వ్యవధిలో మాట నిలబెట్టుకున్న ఏపీ మంత్రి
Jasprit Bumrah Injury: స్టార్ పేసర్ బుమ్రా లేకపోతే ఆస్ట్రేలియా బ్యాటర్లను ఆపలేరా? ఇలాగైతే టీమిండియాకు కష్టమే
స్టార్ పేసర్ బుమ్రా లేకపోతే ఆస్ట్రేలియా బ్యాటర్లను ఆపలేరా? ఇలాగైతే టీమిండియాకు కష్టమే
Pawan Kalyan: మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Guntur Municipal Commissioner Throw Mic | మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో మైక్ విసిరేసిన కమిషనర్ | ABP DesamGame Changer Ticket Rates Fix | గేమ్ ఛేంజర్ కి రేట్ ఫిక్స్ చేసిన ఏపీ సర్కార్ | ABP DesamSwimmer Shyamala Swimming Vizag to Kakinada | 52ఏళ్ల వయస్సులో 150 కిలోమీటర్లు సముద్రంలో ఈత | ABP DesamAus vs Ind 5th Test Day 2 Highlights | ఆసక్తికరంగా మారిపోయిన సిడ్నీ టెస్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దటీజ్ నారా లోకేష్ - గంటల వ్యవధిలో మాట నిలబెట్టుకున్న ఏపీ మంత్రి
దటీజ్ నారా లోకేష్ - గంటల వ్యవధిలో మాట నిలబెట్టుకున్న ఏపీ మంత్రి
Jasprit Bumrah Injury: స్టార్ పేసర్ బుమ్రా లేకపోతే ఆస్ట్రేలియా బ్యాటర్లను ఆపలేరా? ఇలాగైతే టీమిండియాకు కష్టమే
స్టార్ పేసర్ బుమ్రా లేకపోతే ఆస్ట్రేలియా బ్యాటర్లను ఆపలేరా? ఇలాగైతే టీమిండియాకు కష్టమే
Pawan Kalyan: మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Game Changer Pre Release Event: సినీ పరిశ్రమ కోసం త్వరలో కొత్త ఫిల్మ్ పాలసీ - గేమ్ ఛేంజర్ ఈవెంట్లో మంత్రి కందుల దుర్గేష్
సినీ పరిశ్రమ కోసం త్వరలో కొత్త ఫిల్మ్ పాలసీ - గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంత్రి కందుల దుర్గేష్
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
EPFO ​​ATM Card: ఇక నుంచి ఎక్కడి నుంచైనా ఏటీఎం సాయంతో పీఎఫ్ విత్ డ్రా చేస్కోవచ్చు - ఈ కార్డ్ ఎలా పని చేస్తుందంటే..
ఇక నుంచి ఎక్కడి నుంచైనా ఏటీఎం సాయంతో పీఎఫ్ విత్ డ్రా చేస్కోవచ్చు - ఈ కార్డ్ ఎలా పని చేస్తుందంటే..
Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు
Embed widget