మున్సిపాలిటీ కుప్పతొట్టి అని ఇన్ని రోజులు పట్టించుకోలేదు- రోజా కామెంట్స్‌పై నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్
రోజాను మెగా ఫ్యాన్స్ తోపాటు జనసేన లీడర్లు టార్గెట్ చేశారు. ఇప్పుడు సీన్‌లోకి నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. రోజా నోరు.. మున్సిపాలిటీ కుప్పుతొట్టే ఒకటేనంటూ కామెంట్ చేశారు.
మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన మంత్రి రోజాపై నాగబాబు సీరియస్ అయ్యారు. ముందు పర్యాటక శాఖ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇన్ని రోజులు రోజా చేస్తున్న కామెంట్స్‌పై ఎందుకు స్పందించలేదో రీజన్ కూడా చెప్పారు.
ఇన్నేళ్లుగా ప్రజలకు మెగా ఫ్యామిలీ చేసిందేమీ లేదని.. అందుకే ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతున్నారని రోజా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో రోజాను మెగా ఫ్యాన్స్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇప్పుడు సీన్‌లోకి నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. రోజా నోరు.. మున్సిపాలిటీ కుప్పుతొట్టే ఒకటేనంటూ కామెంట్ చేశారు. అందుకే ఇన్నిరోజులు ఏమీ అనలేదన్నారు. కావాలనే మున్సిపాలిటీ కుప్పతొట్టెను ఎవరూ కెలకరని.... అందుకే రోజా కామెంట్స్‌పై రియాక్ట్ కాలేదన్నారు.
ప్రస్తుతం పర్యాటకంలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉందని... దాన్ని ఎలా పైకి తీసుకురావాలో రోజా ఆలోచిస్తే బెటర్ అన్నారు నాగబాబు. ఇలా మాట్లాడుతూ పోతే... రోజా పదవి నుంచి దిగిపోయేసరికి కచ్చితంగా 20వ స్థానానికి దిగజారుతుందని ఎద్దేవా చేశారు. పర్యటక శాఖను డెవలప్ చేయడమంటే... రోజా పర్యటనలు చేయడం కాదని వ్యంగ్యంగా స్పందించారు. ఈ శాఖను నమ్ముకొని వేల మంది జీవిస్తున్నారని వాళ్లందరి బాగు కోసం ఏదైనా చేయాలని సలహా ఇచ్చారు.
కుప్పంలో చంద్రబాబు టూర్, అక్కడ జరిగిన పరిణామాలపై రెండు రోజు క్రితం ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రి రోజా మెగా ఫ్యామిలీపై ఘాటుగా స్పందించారు. తెగేవరకు లాగొద్దని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రి రోజాను హెచ్చరించారు. అయినా సరే తగ్గేదే లే అని రోజా తన స్టైల్లో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు పవన్నే టార్గెట్ చేసిన రోజా ఇప్పుడు మెగా బ్రదర్స్ ని మళ్లీ టార్గెట్ చేశారు. వైసీపీ నేతల్లో ఫైర్ బ్రాండ్ గా మంత్రి రోజాకి పేరుంది. జగన్ పై ఎవరు విమర్శలు చేసినా ముందుగా స్పందించడమే కాదు తీవ్ర పదజాలంతో మాట్లాడే నేతల్లో ముందుగా మంత్రి రోజానే ఉంటారు. ఇప్పుడు మరోసారి జనసేన అధినేతని టార్గెట్ చేస్తూ మాట్లాడిన రోజాపై పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై విపక్షాలు నిరనస వ్యక్తం చేస్తూ ఇప్పటికే కోర్టుని కూడా ఆశ్రయించాయి. అంతేకాదు అధికారపార్టీ తీరుని విమర్శించడంతో వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యారు. ర్యాలీలు, రోడ్ షోలతో ప్రజలు ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆయనకి మద్దతుగా ఉన్న బీజేపీ, జనసేనలను టార్గెట్ చేశారు. ముఖ్యంగా చంద్రబాబు దత్త పుత్రుడిగా ఉన్న పవన్ కల్యాణ్ పై వైసీపీ మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గుంటూరు, కందుకూరు ఘటనలపై సానుభూతి చూపించాల్సిన పవన్ కల్యాణ్ ఆ విషయం మరిచి జీవో నెంబర్ 1ని తప్పుబట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. బాబుగారు తప్పుచేసినప్పడల్లా దత్తపుత్రుడునోటికి ప్లాస్టర్ వేసినట్లు మౌనంగా ఉంటారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఆర్టిస్ట్ లు స్వతహాగా సెన్సిటివ్ గా ఉంటారని అయితే మానవత్వం లేని మనిషి పవన్ కల్యాణ్ అని చెబుతూ ఓ ఆర్టిస్ట్ గా సిగ్గుపడుతున్నానన్నారు. ఇంతటితో ఆగలేదు సొంతూరికి ఏమీ చేయలేకపోవడం వల్లే ముగ్గురు అన్నదమ్ములను ఓడించారన్నారు.