Militant Attack in J&K: కుల్గాంలో ఉగ్రవాదుల కాల్పులు.. ఓ పోలీసు అధికారి మృతి
జమ్ముకశ్మీర్ కుల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు.
జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు ఓ పోలీసుపై దాడికి తెగబడ్డారు. ఈ కాల్లుల్లో బంతో శర్మ అనే పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
J&K | The policeman who was shot by terrorists in Kulgam district succumbed to his injuries on way to the hospital. More details are awaited.
— ANI (@ANI) September 17, 2021
(Visuals deferred by unspecified time) pic.twitter.com/v7Nt4wcz5x
ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను పట్టుకుని తీరతామని అధికారులు తెలిపారు.
భారీగా ఆయుధాలు స్వాధీనం..
మరోవైపు పుల్వామా జిల్లా తాలంగం పోలీస్ స్టేషన్ పరిధిలో 182 సీఆర్‌పీఎఫ్, ఆర్ఆర్, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కార్డన్ సెర్ట్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో 4 పిస్టోళ్లు, 8 మేగజైన్ల తూటాలు, 60 రౌండ్ల 9ఎమ్ఎమ్ బుల్లెట్లు, 51 రౌండ్ల 7 ఎమ్ఎమ్ తూటాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో మరిన్ని ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
The troops of 182 CRPF, RR, and J&K Police launched a cordon and search operation in the area of Talangam Police Station & District Pulwama today. During the operation, the troops made a recovery of 4 Pistols along with 8 magazines, 60 rounds of 9mm, and 51 rounds of 7mm.
— ANI (@ANI) September 17, 2021
Jammu & Kashmir: In a joint search operation, Police and Army have recovered arms and ammunition including four pistols at Telangam village in Pulwama district. Details awaited pic.twitter.com/tI5LghT6Bl
— ANI (@ANI) September 17, 2021