Covid 19 Vaccination: మోదీకి మరో గిఫ్ట్ రెడీ.. ఒక్కరోజులో 2 కోట్ల డోసులు పంపిణీ.. జెట్ స్పీడ్‌లో వ్యాక్సినేషన్!
దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ రికార్డులు సృష్టిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నాటికే కోటి వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసిన ఆరోగ్యశాఖ మరో 4 గంటల్లోనే 2 కోట్ల మార్కును దాటేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కోటిన్నర వ్యాక్సిన్ డోసులను అందించాలని ఆరోగ్యశాఖ లక్ష్యం పెట్టుకుంది. అయితే అనూహ్యంగా 2 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసి కొత్త రికార్డ్ సృష్టించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం జెట్ స్పీడ్‌లో సాగుతోంది.
మధ్యాహ్నం 1.30 గంటల లోపు..
శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1:30 గంటల లోపు కోటికిపైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆ తర్వాత మరో నాలుగు గంటల్లోనే మరో కోటి డోసులు పంపిణీ చేసి ఆశ్చర్యపరిచింది. నెల రోజుల కన్నా తక్కువ వ్యవధిలో రోజుకు కోటి డోసులు పంపిణీ చేయడం ఇది నాలుగోసారి. కానీ ఒక్కరోజులో 2 కోట్ల డోసులు అందివ్వటం ఇదే తొలిసారి.
PM @NarendraModi जी के जन्मदिवस पर देश ने 1:30 बजे तक अब तक सबसे तेज 1 करोड़ वैक्सीन लगाने का आँकड़ा पार कर लिया है, और हम निरंतर आगे बढ़ रहे है।
— Mansukh Mandaviya (@mansukhmandviya) September 17, 2021
मुझे विश्वास है की आज हम सभी टीकाकरण का नया कीर्तिमान बना कर प्रधानमंत्री जी को उपहार स्वरूप देंगे। #VaccineSeva #HappyBdayModiji pic.twitter.com/qw6jMrxFyu
Record-breaking pace of vaccination today! 𝟐 𝐜𝐫𝐨𝐫𝐞 people vaccinated today & counting!
— PIB India (@PIB_India) September 17, 2021
⚕An outstanding effort from our health workers.#LargestVaccineDrive #VaccinationDrive pic.twitter.com/jAPZPkbV06
𝟏.𝟓𝟎 𝐜𝐫𝐨𝐫𝐞 𝐯𝐚𝐜𝐜𝐢𝐧𝐞 𝐝𝐨𝐬𝐞𝐬 𝐚𝐧𝐝 𝐬𝐭𝐢𝐥𝐥 𝐜𝐨𝐮𝐧𝐭𝐢𝐧𝐠, 𝐈𝐧𝐝𝐢𝐚 𝐬𝐞𝐭𝐬 𝐚 𝐧𝐞𝐰 #𝐂𝐎𝐕𝐈𝐃𝟏𝟗 𝐯𝐚𝐜𝐜𝐢𝐧𝐚𝐭𝐢𝐨𝐧 𝐫𝐞𝐜𝐨𝐫𝐝.#LargestVaccineDrive #We4Vaccine pic.twitter.com/vxSh1PIGjP
— PIB India (@PIB_India) September 17, 2021
శుక్రవారం ఉదయం నాటికి మొత్తం 77.24 కోట్లకు పైనే టీకా డోసులు పంపిణీ చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ వేగంగా ఉందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది.