అన్వేషించండి

Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి కేవలం అక్కడ పర్యాటకులపై కాదు.. దేశ పర్యాటకం, కశ్మీరీల ఉపాధిపై జరిగిన దాడి!

Pahalgam Attack: పహల్గాంకు 5 కిలోమీటర్ల దూరంలోని ఉన్న బైసరన్ ప్రాంతంలో జరిగింది ఉగ్రదాడి. టూరిస్టులను టార్గెట్ చేసుకుంటూ జరిగిన ఈ దాడి వాస్తవానికి కశ్మీరీల ఉపాధిపై ప్రభావం చూపనుంది

 Pahalgam Terror Attack:  జమ్మూకశ్మీర్‌కు వచ్చే పర్యటకులు తప్పకుండా సందర్శించే ప్రదేశాల్లో పహల్గాం ఒకటి. పచ్చదనం పరుచుకున్నట్టు ఆహ్లాదకరంగా  ఉండే ఈ ప్రాంతం మనదేశీయులనే కాదు విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

అక్టోబరు నుంచి ఫిబ్రవరి నుంచి పూర్తిగా మంచుతో కప్పిఉండే పహల్గాం మార్చి నుంచి జూన్ వరకూ సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. స్విట్జర్లాండ్‌లోని లంగెర్న్ ప్రాంతంలా అనిపించడంతో పహల్గాంని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు.

పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఇలాంటి ప్రదేశంలో ఉగ్రదాటి అంటే ఇది టూరిస్టులపై కాదు కాశ్మీరీల ఉపాధిపై, ఆర్థికవ్యవస్థపై జరిగిన దాడిగా భావించాలంటారు విశ్లేషకులు.  

భూతలస్వర్గంగా పిలిచే కశ్మీర్లో నివసించేవారికి పర్యాటకమే ప్రధాన ఆదాయవనరు. ఈ ప్రదేశంలో జరిగిన దాడివల్ల టూరిస్టులు ఇక్కడకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంటుంది. ఉగ్రదాడి ఘటన పర్యాటకుల్లో నమ్మకాన్ని కోల్పోవడమే కాదు కశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అయిన టూరిజం ఇండస్ట్రీని సంక్షోభంలోకి నెట్టేసింది. పర్యాటకులపై దూసుకెళ్లిన ఒక్కోతూటా కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను కొన్నేళ్ల వెనక్కు తీసుకెళ్లిపోయింది.

ఏప్రిల్ 22 మంగళవారం జరిగిన ఉగ్రదాడి ప్రభావంతో ఇప్పటికే కశ్మీర్ కు బుక్ చేసుకున్న టికెట్లు రద్దు చేసుకున్నారు. ట్రావెల్ టికెట్లు మాత్రమేకాదు..స్థానికంగా హోటళ్లలో వసతి కోసం బుక్ చేసుకున్నవి కూడా రద్దు చేసుకున్నారు.  

కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారినప్పటి నుంచి పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అధికారిక లెక్కలప్రకారం గతేడాది కశ్మీర్ లో 35 లక్షల మంది పర్యటించారు. 2020లో ఈ సంఖ్య 34 లక్షలు ఉండేది..2021 నాటికి  కోటి 13 లక్షలుకి చేరింది. 2022 లో కోటి 88 లక్షలు, 2023 లో 2 కోట్ల 11 లక్షలు, 2024 లో ఈ లెక్క 2 కోట్ల 36 లక్షలకి చేరింది.

కేవలం పర్యాటకం వల్ల కశ్మీర్ కి ఏడాదికి 12 వేలకోట్లు ఆదాయం వస్తుందని అధికారిక అంచనా.  2030 నాటికి ఈ ఆదాయం 25 నుంచి 30 వేల కోట్లకు చేరుతుందని అంచనా. ఇప్పుడు జరిగిన దుర్ఘటనతో ఈ అంచనాలు అందుకోవాలంటే మరికొన్నేళ్లు పట్టేస్తుందన్నది విశ్లేషకుల  అభిప్రాయం.

వాస్తవానికి మార్చి నుంచి పహల్గాంలో మొదలయ్యే సందడి మే నాటికి భారీగా పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే సెలవులు ప్రారంభం కావడంతో పర్యాటకుల సందడి మొదలవుతోంది.  మే నెలలో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. సీజన్ ప్రారంభంలోనే ఈ దాడి జరగడంతో ఇక ఈ ఏడాది మొత్తం ఆ ప్రభావం కశ్మీర్ పర్యాటకంపై పడుతుందంటున్నారు  విశ్లేషకులు.

పహల్గాంలో వెళ్లే పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించే ప్రదేశాలు  చందన్‌వరీ, బైసరన్, శేష్‌నాగ్ లేక్, పంచతర్ణి, అమర్‌నాథ్ గుహ, అరు వ్యాలీ, లిడ్డర్‌వాట్. దాల్ సరస్సులో ఈ సీజన్లో 15వందల కన్నా ఎక్కువ హౌస్ బోట్లు పనిచేస్తాయ్. ఉగ్రదాడికి భయపడి ఇప్పటికే కశ్మీర్లో ఉన్న పర్యాటకులంతా హోటల్స్, బోట్ హౌస్ లు ఖాళీ చేసి తిరుగుప్రయాణం అయ్యారు. దేశ విదేశాల నుంచి కశ్మీర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నవారంతా వెనక్కు తగ్గారు. ఈ భయం పర్యాటకులను ఎన్నాళ్లు వెంటాడుతుందో..

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget