జల్లికట్టుని నిషేధించలేం - తమిళనాడు చట్టాన్ని సమర్థించిన సుప్రీం ధర్మాసనం
Jallikattu In Tamil Nadu: జల్లికట్టుకి అనుకూలంగా తమిళనాడు ప్రభుత్వం చట్టం చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
Jallikattu In Tamil Nadu:
జల్లికట్టు వేడుకలు జరుపుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా చట్టం చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ ఆటను నిషేధించాలన్న పిటిషన్‌లను తిరస్కరించింది. సంప్రదాయ క్రీడలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరవాత...మళ్లీ అందులో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం సరికాదని వెల్లడించింది.
"జల్లికట్టు క్రీడపై తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది. అధికారికంగా జరుపుకునేందుకు అనుమతినిచ్చింది. ఇది సంప్రదాయ క్రీడ. అలాంటప్పుడు న్యాయవ్యవస్థ మరో కోణంలో ఆలోచించడం, దానిపై వేరే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం సరికాదు"
- సుప్రీంకోర్టు
Supreme Court upholds the Tamil Nadu law allowing bull-taming sport 'Jallikattu' in the State
— ANI (@ANI) May 18, 2023
Supreme Court says the Prevention of Cruelty to Animals (Tamil Nadu Amendment) Act, 2017, substantially minimises pain and suffering to animals. pic.twitter.com/DPWVNPaArs
గతేడాదే కీలక వ్యాఖ్యలు..
గతేడాదే సుప్రీంకోర్టు జల్లికట్టుపై కీలక వ్యాఖ్యలు చేసింది. మొత్తం ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. జల్లికట్టులో హింస ఉంటుందన్న వాదనలనూ కొట్టి పారేసింది. హింస ఉన్నప్పటికీ నెత్తుటి క్రీడ అని చెప్పలేమని తేల్చి చెప్పింది. ఎలాంటి ఆయుధాలు వాడడం లేదు కదా అని..తిరిగి ప్రశ్నించింది. 2017 నుంచే దీనిపై వాదనలు వినిపిస్తున్నాయి. ఆ ఏడాదే తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుకి అధికార ముద్ర వేసింది. Prevention of Cruelty to Animals 2017 చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణలపై కొందరు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. చట్టబద్ధం చేయడాన్ని వ్యతిరేకించారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు సుప్రీం ధర్మాసనం ఆ సవరణను సమర్థించింది.